[శ్రీ జాడి రేవంత్ రచించిన ‘నేను భారతిని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతి మాట
నేను భారతిని,
కన్నబిడ్డల నెత్తురు చూడలేక అడుగుతున్న,
ఉగ్రవాదమో మతోన్మాదమో,
నన్ను కలవరపెడుచున్నది ముప్పాతికేళ్ళనుండి,
భరించలేనీ కడుపు కోత,
ఊరుకోలేను నేను ఈ క్షణాన,
అమ్మ పిలుపుకై వేచున్న,
నా బిడ్డలందరికీ యాది జేస్తున్న,
నాడు నాతో విడిపోయిననాడు
రైల్లు స్వర్గరథాలైయ్యాయి వీళ్ళ వల్లే
ఆ కన్నీటి బొట్లారకనే
బాంబు దాడుల్లో పట్టణాలు
సాగరుల భస్మ రాసులను తలపాయి
నన్ను కాపాడే సిపాయిలను
దొంగ దెబ్బ కొట్టాయి బాంబులతో
ఎలా ఆపను ఇలా ఆగని బాధల్లో
నా కంటి నుండి కారుతున్న నీటిబొట్లని,
ఎలా ఆపను.