Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేను ఆలోచిస్తాను

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘నేను ఆలోచిస్తాను’ అనే కవితని అందిస్తున్నాము.]

నేను కవిని కవితలు రాస్తాను
నేను రచయితను రచనలు చేస్తాను
నేను మనిషిని ఆలోచిస్తాను

నిచ్చెన మెట్ల సమాజం గురించి
అసమానతల గురించి
రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవస్థలలోని
అవకతవకల గురించి
నేను ఆలోచిస్తాను

దిగజారుతున్న విలువల గురించి
అడుగంటుతున్న మానవత్వం గురించి
నిరుద్యోగము గురించి
కూడు గుడ్డ గూడు లేని వారి గురించి
నేను ఆలోచిస్తాను

ఆరోగ్య సదుపాయాలు అందని వారి గురించి
విద్యావకాశాలు లేని వారి గురించి
అభివృద్ధి ఫలాలు అందని వారి గురించి
నేను ఆలోచిస్తాను

అందలం ఎక్కిన వారి గురించి
చేసిన బాసలు మరిచిన వారి గురించి
అందలం ఎక్కించిన వారి గురించి
నేను ఆలోచిస్తాను

ఏమీ చేయలేని నా అశక్తత తలుచుకొని
నేను బాధ పడతాను
నేను ఆలోచిస్తాను
అంతకు మించి ఏమీ చేయలేను

Exit mobile version