Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీవు నిశ్శబ్దానికే నీడవు..

నీవు నిశ్శబ్దానికే నీడవు!
నీ కళ్ళల్లోని ప్రేమ
కొలిమిలో కాలుతున్న
ఇనుప కడ్డీలా
కరిగి ప్రవహించి
ఎర్రని జీరగా మిగిలింది..
అందులో మిగిల్చింది
నను సన్నని బూడిదగా!
ఆకసాన్నంత అలుముకొన్న
నేను నీ వేడికి
కరిగి కరిగి వర్షంలా
కురిసి హిమలయంలా
చల్లదనానికి గడ్డకట్టి
నీపై కోరికతో..
సాగి ప్రవహించి
నీ కంటినే అందుకొన్న
కంటిలోని బిందువై!
కనురెప్పల మాటున
నీలో నేనైనా నాకు విశ్రాంతి!
నా కోసం నీవు కనులు
తెరచినపుడు జారివస్తాను
ఒక స్వప్నమై!!!

Exit mobile version