ఏప్రిల్ 20న ఖమ్మజిల్లా నేలకొండపల్లి బౌద్ధారామం వద్ద జరిగిన ‘కవియాత్ర’ ముగింపు సభలో ప్రముఖ కవి సాదనాల వేంకటస్వామినాయుడు రచించిన ‘నీవే ప్రశ్న అయిన చోట..?’ కవితాసంపుటిని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ ఆవిష్కరించారు.
చిత్రంలో ‘కవియాత్ర’ వ్యవస్థాపకుడు కారం శంకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, కవి, రచయిత సాదనాల వేంకటస్వామినాయుడు, వికాస వేదిక సాహిత్య సంస్థ ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ తదితరులున్నారు.