[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నీవారెవరో తెలుసుకో!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తెల్లవారుతూ వెలుగు పంచుతోంది జగతినంతా మెల్ల మెల్లగా ఉదయం వేళ చిగుర్లు మేసిన కోయిలలు స్వాగతాలు పలుకుతూ మేలుకొలుపు పాడుతున్నాయి
రేయంతా నిదురలేక ఎప్పుడో మగతలోకి జారుకున్న పడతులను లెలెమ్మని పిలుస్తున్నాయి వెన్నెల సెలయేరుల విరబూసిన కలువలు ఎండవేడికి తాళలేక వసివాడిపోతున్నాయి
నింగీ నేలా కలిసినచోట నీలిరంగు అందాలు కనువిందు చేస్తున్నాయి తొలకరివానకు పుడమి పులకించగా పచ్చని వనాలు విరులతో అలరించాయి
చల్లగాలి మోసుకొచ్చిన రాగాలేవో నా మదిలో ఆశలు రేకెత్తించాయి నీ చూపులు సోకగానే సిగ్గుతో విరబూసిన కుసుమమునయ్యాను
పులకించిన నా మదిలో అంబరాన్ని అంటిన సంబరం అలుముకుంది తేనెలూరు పెదవుల మాటున ఒదిగిన మురిపెములెవ్వరికో తెలుసుకోవోయి
వలపంటే ఎరుగనిదానను కలలుకనే వయసులేనిదానను ఎదురుగా నువ్వుంటే చాలు
బంధమంటే తెలియని నేను మరుని తూణీరాలను పూలబాణాలని భ్రమసేను
ఎదలో దాచుకున్న మమతలన్నీ బాహుబంధంతో అందిస్తున్నా బదులేమి ఇస్తావో తెలుసుకోలేక పోగొట్టుకుంటే తిరిగి పొందలేవు కాలం నీకోసం ఆగదు మనసిచ్చేది ఒక్కసారే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావని పగిలిన హృదయం అతుక్కోదని తెలుసుకో!
ఏ. అన్నపూర్ణగారిది కాకినాడ. వారి నాన్నగారు పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేశారు. ఇంట్లో చాలా అమూల్య గ్రంథాలూ నవలలు, మాసపత్రికలు, ఎన్నో పుస్తకాలు ఉండడం వలన చిన్నప్పటి నుంచే బాగా చదవడం అలవాటైంది. బాల సాహిత్యంతో పాటు ఇతర పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చదువు, పెళ్లి పిల్లలు జీవితంలో అందరిలాగే పరిణామాలు జరిగినా ఏనాడూ చదవడం మానలేదు. పిల్లలు బాగా చదువుకుని మెరిట్లో అమెరికా వెళ్ళాక తీరిక లభించి రచనలు చేయాలనే ఆలోచన వచ్చింది. రంగనాయకమ్మ, వై.సులోచన రాణి, యండమూరి, మల్లాది అభిమాన రచయితలు. వారి ప్రభావమో ఉత్తరాలు రాసే అలవాటూ కలసి వారిని రచయిత్రిని చేశాయి. వారి మొదటి కథ ‘రచన మాసపత్రిక’లో వచ్చింది. మొదటి నవల ‘చతుర’లో ప్రచురితమయింది. వీరి రచనలను ఎక్కువగా – రచన, చతుర ప్రచురించాయి. ఏభై కథలు. మూడు చతుర నవలలు, ఇరవై అయిదు కవితలు వ్రాశారు. విపుల కథలు రెండు కన్నడంలో అనువదించారు. ఇంకా ఇతర పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలోను ప్రచురితమయ్యాయి. మాజీ ఐఏఎస్ ఆపీసర్ డాక్టర్.జయప్రకాశ్ నారాయణగారు తొంభై ఏడులో హైదరాబాదులో స్థాపించిన ‘ఉద్యమ సంస్థ’లో ఇరవై నాలుగేళ్లుగా కార్యకర్తగాను; సంస్థ మాసపత్రికలో వ్యాసాలు రాసే రచయిత్రిగా గుర్తిపు రావడం వారికి సంతృప్తినిచ్చింది! అటువంటి అత్యుత్తమైన గొప్ప అధికారితో పనిచేసే అవకాశం రావడం అన్నపూర్ణ గౌరవప్రదంగా భావిస్తారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి భార్య ఇందిర అన్నపూర్ణగారికి మేనత్తగారే! ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చదవడం రాయడంతో కాలం ఆనందంగా గడిచిపోతోంది. వారి భర్త మేథ్స్ ప్రొఫెసర్‌గా హైదరాబాదులో పనిచేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సామెత కథల ఆమెత-12
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-8
కొరియానం – A Journey Through Korean Cinema-60
సినిమా క్విజ్-59
సాగర ద్వీపంలో సాహస వీరులు-5
వృక్ష హృదయం – వృక్ష నవకం!
సరిగ్గా వ్రాద్దామా?-2
దేశ విభజన విషవృక్షం-61
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-71
ఎదురుగాలి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®