[శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట రచించిన ‘నీకు చేతులెత్తి’ అనే బాలగేయం పాఠకులకు అందిస్తున్నాము.]
పల్లవి:
నీకు చేతులెత్తి
నీకు చేతులెత్తి
నీకు చేతులెత్తి
దండం పెడతా..
కొట్టాకు సారు
నీ కళ్ళల్లోన
కోపం చూస్తే
మాకు బేజారు ॥ 2 ॥
మా అమ్మనాన్న
కన్న మిన్న
మీరూ.. మాస్టారు
మీ చేతుల్లోనా
బెత్తం చూస్తే
మా బతుకే చేజారు ॥ 2 ॥
॥ నీకు చేతులెత్తి ॥
చరణం:1
కొండంత అండ నీవే
నమ్ముకుంటిమి
మా కోటి ఆశలతో మిమ్ము చేరుకుంటిమి
॥ 2 ॥
మా అమ్మ నాన్న
కలలు ఏవో
కలలు గంటిమి ॥ 2 ॥
నీ కోపమేమో
అర్థం గాక పారిపోతిమి
॥ 2 ॥
॥ నీకు చేతులెత్తి ॥
చరణం 2:
మీ మాటలకు
ఒదిగిపోయే
ఒదుగులవ్వుతం
మీ పాఠాలకు
ఎదిగిపోయే
వెలుగులవ్వుతం ॥ 2 ॥
మీ పాటలకు పొంగిపోయి మురిసిపోతము ॥ 2 ॥
మా ఆటలల్లో
మాకు మేమే మరచిపోతము ॥ 2 ॥
॥ నీకు చేతులెత్తి ॥
చరణం 3:
మా పేరు పెట్టి పలకరించి
చేరదీస్తరు
మా బతుకు దెరువు
బాటలల్లో వెన్ను దడుతారు
మా వచ్చిరాని
చదువు నైనా ఓర్చుకుంటరు
పట్టుబట్టి మొద్దునైనా మార్చుతుంటరు
మీకు చేతులెత్తి
దండం బెడతా
తిట్టండి సారు ॥ 4 ॥
మీ కళ్ళల్లోన
ఆనందమే మాకు హుషారు ॥ 4 ॥
మా అమ్మ నాన్న
కన్న మిన్న
మీరూ మాస్టారు
మీ మాటల్లోన కోపమే
మా బతుకు రహదారు
॥ 4 ॥
అక్షరం ప్రభాకర్‌గా ప్రసిద్ధులైన వీరి అసలు పేరు నాగెల్లి ప్రభాకర్. లక్ష్మమ్మ, హనుమంతులు తల్లిదండ్రులు. ఒకప్పటి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా (మరియు మండలం) లోని అమనగల్ గ్రామంలో 6 జూలై 1976 నాడు జన్మించారు. వృత్తి: తెలుగు భాషోపాధ్యాయులు. వీరి ప్రవృత్తి: పుస్తక పఠనం, ప్రకృతి పర్యావరణం పరిరక్షణ సామాజిక గేయాలు, బాలల గేయాలు రచన. ప్రభాకర్ గారి జీవిత భాగస్వామి పేరు రోజా బాయి. కుమారులు త్రిలోక్, త్రివర్ణ్.
ప్రభాకర్ గారి ప్రచురించిన రచనలు:
1. ఆ పది జిల్లాలు ఆపద జిల్లాలు (దీర్ఘ కవిత సంపుటి), 2. కన్నీళ్ల పంటలు (దీర్ఘ కవిత సంపుటి), 3. అక్షరం సాక్షిగా.. (కవితా సంపుటి) 4. అక్షరాభ్యాసం (తెలుగువాచకం) 5. అక్షరామృతం (గేయరూప కవిత్వం, తెలుగు హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలలో ప్రచురితం), 6.అక్షరామృత్ (గేయ రూప కవిత్వం, హిందీ), 7. అక్షరామృతం (సాంగ్ ఫార్మేట్ పోయెమ్స్, ఇంగ్లీష్), 8. అక్షర తపస్వి, 9. అక్షర భారతం (వ్యాస సంపుటి), 10. అక్షర కోకిల (పర్యావరణ పరిరక్షణ సామాజిక చైతన్య గీతాలు), 11. అక్షర స్వరం (గేయ రూప కవిత్వం).
~
రాబోయే పుస్తకాలు
12. అక్షర జీవనది, 13. అక్షరాభిషేకం, 14. అక్షరామృతం (3, 4, 5 వాల్యూమ్స్), 15. అక్షర లక్షణ సారం (సులభ వ్యాకరణం) 16. అక్షర మొలకలు (పదవిన్యాసాలు), 17. అక్షరాంజలి, 18. అక్షర వీక్షణం,19 అక్షర యానం
