Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ స్నేహం

[సౌనిధి గారు రచించిన ‘నీ స్నేహం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

తియ్యని పరిచయం
కమ్మని కావ్యం
ఆత్మీయ అనుబంధం
అద్వితీయ అనురాగం
నిస్వార్థానికి నిలయం
విచారానికి ఔషధం
ఎనలేని సహకారం
మరవలేని మమకారం
అవిభక్త బంధం
అవ్యక్త భావం
అనన్యమైన నీ స్నేహం..

Exit mobile version