Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ ప్రేముంటే చాలు

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నీ ప్రేముంటే చాలు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

చెలీ..!
వెన్నెల కురవక పోయినా
నీ చల్లని చూపుంటే చాలు
కోయిల కూయకపోయినా
నీ మధుర స్వరముంటే చాలు
చిలుక పలుకక పోయినా
నీ తియ్యటి మాటుంటే చాలు
పువ్వు పరిమళించక పోయినా
నీ నవ్వులు వికసిస్తే చాలు
భాష లేకపోయినా
నీ బాసలుంటే చాలు
శ్వాస లేకపోయినా
నీ ధ్యాసుంటే చాలు
నేను లేకపోయినా
నీ మదిలో నా పై ప్రేముంటే చాలు

Exit mobile version