Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ లోని నేను నా లోని నువ్వు

[డా. బి. హేమావతి రచించిన ‘నీ లోని నేను నా లోని నువ్వు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీ లోని నేను
నా లోని నువ్వు
ఎంత దూరమని పరిగెత్తగలము
ఎక్కడికి వెళ్ళగలం
అలలాంటి నీ నవ్వు
నన్నే ముంచెత్తగా
నీ ముందు సిగ్గు బుట్ట నయ్యాను
మమతల పందిరి కింద
మల్లెల మొగ్గనయ్యాను
నీ గుండెలోని
పాట నయ్యాను

Exit mobile version