[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘నీ కోసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆశ జనించని
అజ్ఞాత జీవిలాగ
నిరాకార నిర్జీవ
చిత్ర రచనలాగ
ధూళి మూగిన
శిథిల శిల్పం లాగ
నీ జాడ తెలియక నిరీక్షిస్తున్న
తడారిన గుండెతో తపిస్తున్న
నిదురించని ఆలోచనలతో
నిదురరాని కళ్ళతో వీక్షిస్తున్న
నీ కోసం ఎన్నో రాత్రుల నుండి
నిలబడిన చోటే నిలబడి ఉన్న
