[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘నీ చావుకొచ్చింది’ అనే కవితని అందిస్తున్నాము.]
మేక అడిగింది కసాయిని
నన్నెందుకు చంపుతున్నావు
నా ఆకలి నీ చావుకొచ్చింది
కసాయి కళ్ళలో కన్నీరు
నన్నెందుకు రేప్ చేస్తున్నావు
ముక్కు పచ్చలారని
అప్పుడే వికసిస్తున్న
మల్లె లాంటి పిల్ల అడిగింది
నా ఆకలి నీ చావుకొచ్చింది
అపరాధ భావంతో కుంగి పోయాడు
రేపిస్ట్
నన్నెందుకు సార్
ఇంత గణం గొడ్డును
బాదీనట్టు బాదుతున్నారు
నా ఆకలి నీ చావుకొచ్చింది
తల పక్కకు తిప్పుకొన్నాడు
కానిస్టేబుల్
చావు బతుకుల్లో వున్న వ్యక్తి
లారీ డ్రైవర్ను అడిగాడు
ఎందుకు సార్ నన్ను చంపుతున్నారు
లారీతో గుద్ది
నా ఆకలి నీ చావుకొచ్చింది
బ్రాందీ తీసుకున్నాడు
అపరాధం మరచి పోవడానికి
ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.