నీ వలపు తలపుల తలుపు
తెరిచి నీ ప్రేమను నాకు తెలుపు
నా చిరునగవుతో నీ చిరుతగవు
ప్రేమికులకవి మాత్రము తగవు
క్రీగంట చూసి నా గుండెలో
గుడిగంట మ్రోగించావు
ఉలకవు పలకవు నీవు
రామచిలుకవా, రాతిపలకవా
నా మది సంద్రంలో అల్పపీడనం
ఉప్పెనగా మారక మునుపే
చప్పున నా ప్రేమను చెప్పనీ
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.