Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నయనాలు – పయనాలు

[కావైశ్రీ గారు రచించిన ‘నయనాలు – పయనాలు’ అనే కవితని అందిస్తున్నాము.]

రంగు రంగుల లోకానికి గమనం ఈ నయనం
చూడటానికి చుంబనం

అందమైన వదనానికి ప్రధానం నయనం
నిత్యం ప్రక్క ప్రక్కనే కలసి పయనం

బాధకి సంతోషానికి ఒకే సోపానం
కన్నె పిల్లల కలలకి కథనం

గుండెల్లో గుబులుకు గంభీర గానం
కన్నీటి బాసలకు సాగర మధనం

మనసులోని ఊసులకు దొరుకుతుంది సమాధానం
కళలకు, సంకేతాలకు కవనం

కనులు మూసి చేస్తే ధ్యానం
దానికి తార్కాణం ఎదుట నిలిచేను మౌనం

కనులతో చూపే అభిమానం
దీని కదలిక చాలా నిదానం

కాని కను సైగతో లోకాన జరుగును కల్యాణం
అందరూ నేర్చుకోవాలి వీటిని చూసి జీవనం
మనసులు మారేను ఆనంద నందన పూల వనం

Exit mobile version