[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[శ్యామలతో మాట్లాడుతుంటాడు నరేంద్ర. తాను రాసిన లెక్కల చిట్టాలను చూసి అభిప్రాయం చెప్పమంటాడు. ఆమె అవసరమా అని అంటే, అవసరమే అని చెప్పి, మర్నాడు ఆదివారం – వాళ్ళింటికి వచ్చి, అక్కడ చూపించనా అని అడుగుతాడు నరెంద్ర. మర్నాడు ఉదయం పది గంటల తర్వాత రమ్మని చెబుతుంది. సులభంగా రావడానికి గుర్తులు చెబుతుంది. కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి కోటి వంట చేస్తుంటాడు. ఏం వండుతున్నావని అడిగితే, ఉలవకట్టు చేశాననీ, వడియాలు వేయిస్తానని చెప్తాడు కోటి. నోరూరుతోంది, త్వరగా వడ్డించమని అంటాడు నరేంద్ర. మర్నాడు ఉదయం అప్పలనర్సయ్య ఇంటికి వెళ్తాడు నరేంద్ర. పెసలు, మినుములు విత్తనాలు వస్తున్నాయనీ, మర్నాటి నుండి ఆ పనులు మొదలెడదామని ఆయనతో అంటాడు. అలాగే చేద్దమంటాడాయన. ఇంతలో అమ్మాజీ వచ్చి నమస్కారం సార్ అని నరేంద్రని పలకరిస్తుంది. తనని సార్ అని పిలవవద్దంటాడు. అన్నయ్యా అని పిలవమని అప్పలనర్సయ్య చెప్తే, అలాగే పిలవమని నరేంద్ర అంటాడు. ఆమె అలాగే పిలిచి, తన ఎన్జిఓ వ్యవహారం గుర్తు చేస్తుంది. వీలైనంత త్వరలో చెప్తానంటాడు. ఇంటికి వచ్చి పద్దుల పుస్తకం తీసుకుని శ్యామల ఇంటికి వెళ్తాడు. లెక్కలవీ బానేవున్నాయని, ఇంకొన్ని సూచనలు చేస్తుంది శ్యామల. ఇంతలో అప్పుడే గుర్తొచ్చినట్టు “మరో విషయం” అంటాడు నరేంద్ర. – ఇక చదవండి.]
శ్యామల తలెత్తి అతడిని చూస్తుంది.
“అమ్మాజీది తేల్చేస్తే బాగుంటుంది.” మెల్లిగా అన్నాడు.
“అదొకటి నెత్తినేసుకోవాలా.” అనేసింది శ్యామల.
“రేపటి పనులు మాటలకై ఉదయం అప్పలనర్సయ్యగారింటికి వెళ్లాను. అమ్మాజీ అడిగింది.” నరేంద్ర మెల్లి మెల్లిగా మాట్లాడేడు. అతడి చూపులు నేలన ఉన్నాయి.
“ఏమడిగింది.” చికాకవుతోంది శ్యామల.
“అదే..” ఆగాడు నరేంద్ర.
ఆ గ్యాప్ లోనే.. “నాన్చక.. విషయంకి రండి.” విసురుగా అనేసింది శ్యామల.
నరేంద్ర తలెత్తకనే..
“అన్నా.. ఎన్జీవో తీరు బాగుంది. అందుకు నాకు సాయపడండి అంది.” చెప్పాడు.
ఉలిక్కి పడింది శ్యామల.
“ఏదీ మరో మారు చెప్పండి.. తను ఏమన్నది ‘ఎగ్జాట్’ గా చెప్పండి.” తను కుతూహలమవుతోంది.
“అన్నా.. ఎన్జీవో తీరు బాగుంది. అందుకు నాకు సాయపడండి అంది.” మళ్లీ చెప్పాడు నరేంద్ర.
“ఉఫ్..” దీర్ఘంగా నోటి నుండి గాలిని వదిలింది శ్యామల.
ఆమె చేష్టను చూసిన నరేంద్రకి ఆమె చర్య అర్ధం కాలేదు.
“సరిసరే. అమ్మాజీ ప్రతిపాదన మీకేమైనా ఉపయోగ పడుతోందేమో. ఇప్పుడు ఆలోచించాలి.” అనేసింది శ్యామల.
నరేంద్ర తేలికవుతున్నాడు.
అంతలోనే అతడి ఫోన్ మోగుతోంది. కోటి ఫోన్ చేస్తున్నాడు.
నరేంద్ర ఆ కాల్ కి కనెక్టై మాట్లాడి.. దానిని కట్ చేసేక..
“విత్తనాలు ఇంటికి చేరిపోయాయి.” చెప్పాడు.
“రేపటి నుండి పనులు మొదలవుతాయి. గుడ్. ఆల్ ద బెస్ట్.” చెప్పింది శ్యామల. చిన్నగా నవ్వేసింది.
“ఆల్ ద బెస్ట్.. వద్దు.. మీ నుండి నాకు కావలసింది.. ‘ఆల్ విల్ బి వెల్’ మాట. అది మీ నోట నాకు ఒక వేద వాక్కు.” చెప్పాడు నరేంద్ర.
“అయ్యో. మళ్లీ మొదలెట్టారా.” గమ్మత్తుగా తలాడించింది శ్యామల.
ఆ వెంబడే.. “వేళవుతోంది. వెళ్లి భోంచేయండి. ఈ పూట బాగా రెస్ట్ లో ఉండండి. రేపటి నుండి పనులుగా.” అంది శ్యామల. తర్వాత లేచింది. నరేంద్ర కూడా లేచాడు.
“ఆరోగ్యం జాగ్రత్త.” ముచ్చటగా చెప్పింది శ్యామల.
“సరే. వస్తాను.” చెప్పాడు నరేంద్ర.
“వెళ్లి వస్తాను.. అనాలి.” చిన్నగా చెప్పింది శ్యామల.
“వెళ్లి వస్తాను.” చెప్పాడు నరేంద్ర. పుస్తకంతో బయటికి వచ్చాడు.
శ్యామల తలుపు మూసుకుంది.. నరేంద్ర బైక్ స్టార్ట్ చేసి కదిలాక.
***
మర్నాడు.. హైస్కూలులో..
డ్రిల్ టీచర్, సోషల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ తో పాటు తెలుగు టీచర్.. స్టాప్ రూంలో ఉన్నాడు. మిగతా వారు తరగతులకు వెళ్లి ఉన్నారు. తెలుగు టీచర్ ఏదో రాసుకుంటుండగా.. మిగతా ముగ్గురు టీచర్ల పిచ్చాపాటి కొనసాగుతోంది.
ఆ తీరులోనే..
“గురుడు ఇంటి వరకు వచ్చేస్తున్నాడు.” సడన్ గా చెప్పాడు సోషల్ టీచర్.
“ఎవరు. ఎవరింటికి.” అడిగాడు ఇంగ్లీష్ టీచర్ తహతహగా.
“మరెవరు.. ఆ దొడ్డ మనిషనుకుంటున్న ఆ నరేంద్ర.. శ్యామల టీచర్ ఇంటికి.” చెప్పాడు సోషల్ టీచర్.
“అవునా.” ఇంగ్లీష్ టీచర్ ఉత్సుకతయ్యాడు.
డ్రిల్ టీచర్ ప్రేక్షకుడు మాదిరి వింటున్నాడు.
“నేను అప్పుడే అనుకున్నా. వాళ్ల మధ్య ఏదో సంథింగ్.. సంథింగ్.. నడుస్తోందబ్బా.” ఇంగ్లీష్ టీచర్ తేలిగ్గా స్టేట్మెంట్ పాస్చేసాడు.
“స్టూడెంట్స్ చూసారట.. వీళ్లు శివాలయం దగ్గర కలుసుకుంటుంటారట.” చెప్పాడు సోషల్ టీచర్.
డ్రిల్ టీచర్ కలుగచేసుకున్నాడు.
“తెలియని.. తేలని విషయాల గురించి ఏవేవో అనుకోవడం మంచిది కాదండీ. ‘ట’ కబురులు అస్సలు వద్దు.”
“చాల్లెండి. మీది మరీ విడ్డూరం. కళ్ల ముందు జరుగుతోంది. ఇంకా తెలియడానికి ఏముంది.. తేల్చుకోవడానికి ఏముంది.” బిరబిరా అనేసాడు ఇంగ్లీష్ టీచర్.
పని ఆపి.. తెలుగు మాస్టారు..
“డ్రిల్ మాస్టార్ చెప్పేది సబబుగానే ఉంది.” అన్నాడు.
ఆ వెంబడే.. సోషల్ టీచర్ వైపు చూస్తూ..
“కలవడాలు తప్పా. ఇళ్లకి రావడం తప్పా. మరి మనం కలవడం లేదా.. మీరు మా ఇంటికి రాలేదా. నేను మీ ఇంటికి రాలేదా. ఆఁ.” అన్నాడు.
“మనది వేరు. వాళ్లది వేరు.” సోషల్ టీచర్ అన్నాడు.
“అంతే. మగ, మగకి.. ఆడ, మగకి ఎంతెంత తేడా. అది మర్చిపోతే ఎలా.” ‘హవ్వా’లా అనేసాడు ఇంగ్లీష్ టీచర్.
“ఇది సున్నితమైన విషయం. చర్చించ వద్దు. సాగతీయ వద్దు. దయచేసి ఇలాంటి మాటలు ఆపేయండి.” తెలుగు టీచర్ కాస్తా గట్టిగానే చెప్పాడు.
డ్రిల్ టీచర్ వత్తాసు పలికాడు.
మిగతా ఆ ఇద్దరూ అప్పటికి మౌనమయ్యారు.
ఫస్ట్ పిరియడ్ ముగిసింది.
శ్యామల స్టాప్ రూంకి వచ్చింది.
ఇంగ్లీష్ టీచర్, సోషల్ టీచర్ తరగతులకు వెళ్లారు.
సైన్స్ టీచర్ ఈ రోజు సెలవు పెట్టడంతో.. డ్రిల్ టీచర్ ఆ తరగతి పరివేక్షణకై వెళ్లాడు.
హిందీ టీచర్.. శ్యామల విడిచి వచ్చిన తరగతికి అటు నుండి అటే మారాడు.
ఆ స్టాఫు రూంన ఇప్పుడు శ్యామలతో పాటు తెలుగు టీచర్ మాత్రమే ఉన్నాడు.
“తల్లీ.. నీకు ఒకటి చెప్పాలి. మరోలా అనుకో వద్దు.” మెల్లిగా అన్నాడు తెలుగు టీచర్.
“అయ్యో. మీరు పెద్దవాళ్లు. మీరు సంశయపడకండి. చెప్పండి.” అంది శ్యామల.
ఇదాంకటి సంభాషణలని క్లుప్తంగా వివరించాడు తెలుగు టీచర్.
అది విన్న శ్యామల..
“అపార్థం చేసుకోనందుకు మీకు, డ్రిల్ టీచర్ కి ధన్యవాదాలు.. అభినందనలు.” చెప్పింది.
ఆ వెంబడే.. “మా ఇద్దరి అభిరుచులు కలిసాయి. మేము కలుస్తోంది ఒక చక్కటి ఆశయ సిద్ధి కోసమే.” ఆగింది.
అప్పుడే.. “ఏమైనా.. తగు జాగ్రత్త అవసరం. అర్ధం చేసుకో తల్లీ.” చెప్పాడు తెలుగు టీచర్.
శ్యామల నిశ్చలంగా కూర్చుంది. అప్పటికి ఏమీ అనలేదు.
పిరియడ్ ముగిసేక.. టీచింగ్ స్టాఫంతా స్టేఫ్ రూంన చేరింది.
స్వల్ప విరామ సమయం మొదలయ్యింది.
శ్యామల సర్దుకుంది.
అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడుతోంది..
“నేను చెప్పేది ఉంది. దయచేసి వినండి.
గాసిప్స్, మీమ్స్, ట్రోల్స్ లాంటివి పుంఖాపుంఖాలుగా విర్రవీగుట నాకు ఎఱికే. అవి ఆయా వ్యక్తుల బలహీనత లేదా సరదా లేదా మరోటిలే అనుకునే దాన్ని. మరియు బాధ్యతాయుతలు ఎవరూ అట్టి వాటి జోలికి పోరు అని నమ్మేదాన్ని. ప్చ్. జరుగుతోంది ఏమిటి.
నా గురించి మాట్లాడే వారంతా ఒక విషయం తెలుసుకోవాలి. నాకు నరేంద్రగారి ఐడియోలజీ నచ్చింది. అందుకే ఆయనతో కలిసి మూవ్ అవ్వగలుగుతున్నాను.
మాట్లాడే ముందు విషయ అవగాహన అవసరం ఉంటుంది. అది ఉన్న వారు హితం చేపడతారు. మిగతావారు ఏదో వాగేస్తారు.
హితం చెప్పే వాళ్లు ఉన్నారని నేను బరి తెగించను.. వాగేవాళ్లు ఉన్నారని నేను ముడుచుకు కూర్చోలేను.
నా హద్దులు నాకు తెలుసు. నాది తొలుత నుండి ఇదే తీరు.” ఆగింది.
అక్కడి వారు ఆమెనే చూస్తున్నారు.
ఆమె చెప్పడం ఆపేక మాత్రం.. సోషల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ మొహాలు చూసుకుంటున్నారు.
అర నిముషం లోపే..
స్వల్ప విరామం ముగిసినట్టు బెల్ మోగింది.
శ్యామల లేచి.. “ఐ యాం ఏన్ ఓపెన్ బుక్. సో ఆల్ దిస్ ఈజ్ జుజుబి ఫర్ మి.” చెప్పేసి తన తరగతికై అక్కడ నుండి చక్కగా కదిలింది.
మూడు రోజులు గడిచాయి.
రాత్రి తొమ్మిదప్పుడు..
శ్యామలతో ఎప్పటిలాగే నరేంద్ర ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
“మీతో మాట్లాడాలి.” సడన్ గా చెప్పాడు నరేంద్ర.
“మాట్లాడుతున్నారుగా.” అటు శ్యామల చిన్నగా నవ్వుకుంటుంది.
“అదే. ఉదయం తెలుగు మాస్టార్ నన్ను కలిసారు. రేపు మధ్యాహ్నం.. హైస్కూలు పరిసరాల్లో.. తన కూతురు పుష్పవతి పంక్షన్ కి ఆహ్వానించారు.” బిడియం పడుతున్నాడు నరేంద్ర.
“అవునా. నిజానికి ఈ ఉదయమే అసలు తంతు ఐంది. రేపు ఆదివారం.. పైగా స్కూలు సెలవు కనుక.. రేపు అక్కడ పంక్షన్ అంటూ భోజనాలు పెడుతున్నారు. పిలిచారుగా రండి. నేను ఎటెండ్ అవుతాను.” అనేసింది శ్యామల సరదాగా.
“నాకు ఇట్టివి తెలియదు. నేనేమైనా కానుక ఇవ్వాలా.” అడిగాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “ఇంతకు ముందు అమ్మతో ఫోన్ లో అన్నీ మాట్లాడేను కానీ.. ఈ సంగతి మాట్లాడ లేక పోయాను.” ఇబ్బందవుతున్నాడు నరేంద్ర.
చిన్నగా నవ్వుకుంటూ..”కానుక.. అంటే ఇస్తుంటారు. ఐనా మీరట్టివేం ఇవ్వక్కర లేదు కానీ.. డబ్బులిచ్చేయండి. బాగుంటుంది.” చెప్పింది శ్యామల.
“అంతేనంటారా. ఎంత ఇవ్వను.” నసిగాడు నరేంద్ర.
“మీ ఇష్టం.” చెప్పింది శ్యామల.
“ప్లీజ్” అన్నాడు నరేంద్ర.
“ఊఁ.. నూటాపదహారులు చదివించండి.” చెప్పింది శ్యామల.
“అంటే.. వన్ వన్ సిక్స్ రూపీస్.. కదా.” అన్నాడు నరేంద్ర.
“అవును మహానుభావా.” నవ్వుకుంటుంది శ్యామల.
ఆ పిమ్మట మరి కొద్ది సేపు ముచ్చట్లయ్యేక.. వాళ్ల ఫోన్ సంభాషణ.. ‘గుడ్‌నైట్’లు తో ముగుస్తోంది.
మర్నాడు.. ఆదివారం..
ఉదయం.. పదవుతోంది.
పొలాల చోట కోటితో కలిసి నరేంద్ర ఉన్నాడు. ఇద్దరూ గట్ల వెంబడి పొలాల చుట్టూ పరిశీలనగా తిరుగుతున్నారు.
“విత్తనాలు మట్టిని బాగా పట్టాయి. చూసారా. మొలక మొక్కలు ఎలా తన్నుకు వస్తున్నాయో.” అన్నాడు కోటి.
“ధాన్యం పంటలా ఈ పంటలూ చేతికి అందితే బాగుంటుంది.” ఆశ పడుతున్నాడు నరేంద్ర.
“ఇవి చూస్తుంటే నాకు ఆ రీతినే ఇవీ వస్తాయనిపిస్తోంది సార్.” కోటి నమ్మకంగా పలికాడు.
నరేంద్ర చక్కగా నవ్వుకున్నాడు.
“అదే ఐతే.. నీకు సైకిల్ కొని పెడతా.” చెప్పాడు.
కోటి సంబరమవుతాడు.
ఆ వెంబడే.. “మీరు మాత్రం ఇది వరకటిలాగే ఆ ఎక్స్‌ఫర్ట్స్ సూచనలు అడుగుతుండాలి.” చెప్పాడు.
“నాకు యాదన ఉంది. నేను త్వరలోనే వాళ్లని కలుస్తాను. తోడ్చుకు వస్తాను.” చెప్పాడు నరేంద్ర.
వాళ్ల పరివేక్షణ ముగిసాక.. ఆ ఇద్దరూ ఇంటికి బయలుదేరారు, బైక్ మీద.
దార్లో ఒక బడ్డీ కొట్టు వద్ద ఆగి.. తను, కోటి సోడాలు తాగారు.
నరేంద్ర పది నోటు ఇచ్చాడు. చిల్లర తీసుకున్నాడు. చిల్లర ఆరు రూపాయల కోసమే నరేంద్ర సోడాలు కొన్నాడు.
దార్లో మాంసం వాటాల చోట ఆగాడు.
“ఒక వాటా కొంటాను. నీకు సరిపోతోందిగా.” కోటిని అడిగాడు.
“రాత్రికి కూడా మీకు, నాకు సరిపోతోంది.” చెప్పాడు కోటి.
మాంసం వాటా కొన్నాడు నరేంద్ర.
ఇంటికి చేరాక..
“నువ్వు వండుకో. నేను ఫంక్షన్ కు వెళ్లాలిగా.” చెప్పాడు కోటితో నరేంద్ర.
ఆ వెంబడే.. “ఆడవాళ్లది. నన్ను పిలిచారు.” మరో మారు సిగ్గయ్యాడు నరేంద్ర.
“లేదు సార్.. కావలసిన వాళ్లని పిలుస్తారు. మీకు కొత్త. అంతే.” అనేసాడు కోటి.
ఆ వెంబడే.. “పండెండు కావస్తోంది. తయారై వెళ్లండి. విలేజీల్లో భోజనాలు త్వరగానే పెట్టేస్తారు.” చెప్పాడు.
రిప్రెష్ కు కదిలాడు నరేంద్ర.
వంట పనిని చేపట్టాడు కోటి.
(ఇంకా ఉంది)
తెలుగు రైటర్, బ్లాగర్ మరియు వ్లాగర్
You must be logged in to post a comment.
రచయిత, సంకలనకర్త శ్రీ సి.హెచ్. శివరామ ప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ
అనిర్వచనీయమైన అలౌకికానందం కలిగించే ‘శబరి’
ఆధ్యాత్మ రామాయణంలో పాత్రలు
జీవన రమణీయం-18
నేను మరణించాల్సి వస్తే..?
అల్చి – విహారం
‘ఇంపీచ్మెంట్ – అమెరికన్ క్రైం స్టొరీ’ సీరీస్ పరిచయం
సంచిక పద ప్రహేళిక ఫిబ్రవరి 2021
సత్యాన్వేషణ-49
అమ్మణ్ని కథలు!-7
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®