Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నన్ను నాకే ఇచ్చి

నేనడిగింది ‘నన్నేగా’?
నీకేమి కష్టం ఇవ్వడానికి?
చేతి పక్కనే ఉన్నాను కదా!

ముఖంలో ఇష్టాల్ని కోసి
కొత్త మాటతో కుట్లు వేస్తే
నేనక్కడ స్రవిస్తాను?

నిరుడు రోజుల
జ్ఞాపకాలను పీకేస్తే
ఖాళీగా చప్పుడు కానుగా?

కొత్త నిద్రతో కళ్ళు
నడక మార్చుకుంటే
కల కాలేనుగా?

ఊహల వనంలో
తప్పిన అల్లికతో
ఒంటరి కాపునేగా?

స్పర్శలేని మౌనంలో
జీవంలేని మాటలకు
నీకు లేనుగా?

ఇక
నన్ను నాకే ఇచ్చి
నీవు ఉండిలో..

Exit mobile version