Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నావ!

నావలో నువ్వూ నేను

ఒకవైపు నువ్వూ నీ సిగ్గు

మరోవైపు నేనూ నా ఓర చూపు

ప్రేమ అనే తెడ్డుతో

స్నేహామనే నీటిలో

పడవను నడుపుతుంటే

ముందుకెళ్తే పెళ్ళికి సంకేతం

వెనక్కెళితే ప్రాణ స్నేహానికి చిహ్నం

అటు ఇటు ఎటు చూసినా

నీతో ఎడబాటు అసంభవం!

Exit mobile version