[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘నాన్నే నాకు ఓ బిరుదు..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నాన్న అనే మాట విలువైన ఓ బిరుదే
నాన్న అనే పిలుపు పెదాలకు అందనివే
నాన్న అనే పిలుపు ధైర్యమే
నాన్న అనే పిలుపుకు సంతోషము
నాన్న అనే పిలుపుకు ఆనందమే
కూతుళ్ళతో కోడళ్ళలో
ఆ పిలుపే ఓ మధురమే
నాన్న ప్రొద్దుననక పోయి
రాతిరి సంధ్య సమయానికి తిరిగొస్తాడు
నాన్న పిల్లల భవిష్యత్తు కోసం ఆరా తీస్తాడు
ఎందుకో నాన్న తినలేకున్న
తిన్నానని చెప్తాడు
ఎందుకో మరి నాన్న అబద్ధాలు చెప్తాడు
పిల్లల కోసం ప్రతిక్షణం
శ్రమతో శ్రమిస్తాడు నాన్న
నాన్నకు పురస్కారాల కన్నా
పిల్లల క్షేమమే ఎక్కువ
బరువు, బాధ్యతలంటే
పిల్లలకు నేర్పిస్తాడు
పిల్లల కోసం
నాన్న చాలా వెనకబడ్డాడు.
గిద్దలూరు సాయి కిషోర్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, రాయదుర్గంకు చెందినవారు. మురళి, లక్ష్మి గార్లు ఆయన తల్లిదండ్రులు. సాయి కిషోర్‌కు చెల్లెలు ఉంది.
కవితలు, కథలు రాయడం అంటే సాయి కిషోర్‌కు చాలా ఇష్టం. అలాగే కవితల, కథల పోటీలకు పాల్గొనడం ఇష్టం.
సాయి కిషోర్‌కు కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీరు రచించిన కవితలు మైండ్ మీడియాలో కవితా ఝరి కార్యక్రమంలో అనేక మార్లు ప్రసారమయ్యాయి. త్వరలో ప్రచురితమవబోతున్న వీరి మొదటి కవితా సంపుటి పేరు ‘జీవనం’.