[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘నాలుగు పేజీలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చిత్తడి వ్రాతే తను.
చదివే శిక్షలో
ఒక్కో వాక్యం ఒక్కో శిలువ.
కాలంపై ఆశతో
సహనం భరించే
మనసు నొప్పికి
తలని కాళ్ళకు మెలేసి
ఏడాదికో పేజీతో
యుద్ధం చేసినా
నడవాల్సిన కథ కోసం మిగిలిన
నాలుగు పేజీలకు
చాకిరీ చేయాల్సిందే.