Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాకు నమ్మకం ఉంది

[‘నాకు నమ్మకం ఉంది’ అనే అనువాద కవితని అందిస్తున్నాము. మూలం Alexander Kimel.]

విశ్వాసం ఉంది నాకు –
మనిషిలోని మానవత్వంపై

మనిషి తానే దేవుడినని
సాటి మనుషులను నాశనం చేస్తూ
రక్తపాతం సృష్టించినా, విశ్వాసం ఉంది నాకు
మనిషిలోని మానవత్వంపై

దైవం మనిషిని ఆశీర్వదించాడని, శపించాడని
నాకు నమ్మకం
అసూయ, ద్వేషం, అపోహలను మనిషి ఎంచుకోవచ్చు
లేక ప్రేమ, సమన్వయం, సౌందర్యాలను స్వీకరించవచ్చు
గతంలో భయంకరమైన శాపాలను అనుభవించినా
దైవం అందించే ఆశీర్వాదంపై నమ్మకం ఉంది

అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు దేవుడు
సూర్యుడు, వృక్షాలు, పూవులు, తుమ్మెదలు..
దైవం సృష్టించిన ఈ అందాలను ఆనందంగా అనుభవించటమే ప్రార్థన
గతంలో ఎన్ని భయంకరమైన అనుభవాలున్నా
జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని నమ్ముతాను

దైవం తన ప్రతిబింబంలా మనిషిని సృష్టించాడు
అని నమ్ముతాను నేను
సాటి మనిషిని చంపటం అంటే దైవాన్ని చంపటమే
ర్వాండాలోని మారణ హోమం
బోస్నియాలోని మారణకాండ
ముస్లిం ఛాందసవాదుల విలయ తాండవం
పోల్ పోట్ ల  అమానుష రాక్షసత్వం
కళ్ళ ముందు కదిలినా దైవంపై విశ్వాసం ఉంది నాకు
ఏదో ఒక రోజు భూమి స్వర్గమవుతుందన్న నమ్మకం ఉంది నాకు
తనలోని పశుత్వాన్ని మనిషి గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు
ప్రకృతితో మమేకమై
తనని తాను అర్థం చేసుకుంటాడని నమ్మకం ఉంది

అప్పుడు ద్వేష ప్రచారకుల నోళ్ళు మూతలు  పడతాయి
మనిషి సాటి మనిషిని సోదరుడిలా ప్రేమిస్తాడు

దైవం పేరిట మనిషిని మనిషి చంపటం మానేస్తాడు
ఒక దేశం మరో దేశంపై ఆయుధాలు ప్రయోగించదు
ఇదెప్పుడు సాధ్యమో నాకు తెలియదు
ఈ శాంతి కనుచూపు మేరలో లేకున్నా
ఇది సాధ్యమేనని నాకు విశ్వాసం ఉంది
~

మూలం: Alexander Kimel
స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్


The Creed of a Holocaust Survivor
~
I do believe, with all my heart,
In the natural Goodness of Man.
Despite the blood and destruction,
Brought by one man, trying to be God,
In the Goodness of Man, I do believe.
I do believe, with all my heart,
That God gave man the blessing and the curse.
Man can select the curse of envy, hatred and prejudices,
Or the blessing of love, harmony and beauty.
Despite the painful curses of the past,
In the blessing of the Creator, I do believe.
I do believe, with all my heart,
That God created a beautiful world,
The sun and the trees, the flowers and the bees.
And the best way to serve God, is
To enjoy the fruits of His labor of love.
Despite the painful memories from the past,
In the joyful celebration of life, I do believe.
I do believe with all my heart,
That God has created man in image of His own.
And killing of man, is like killing of God.
Despite the massacres in Rwanda, the cleansing in Bosnia,
The folly of Muslim fanatics, and the cruelty of Pot Pol.
In the love and compassion of the Creator, I do believe.
I believe with all my heart,
That the Messiah and the Kingdom of Heaven will come;
When man will conquer his destructive urge,
And learn how to live in harmony with nature and himself.
When all the preachers of hate will be silenced,
And man will become his brother’s keeper.
When man will stop killing man, in the name of God,
And nation will not lift weapons against nation.
When it will be, I do not know, but
Despite all the signs to the contrary.
In the dawn of a Better World, I do believe.

by Alexander Kimel

Exit mobile version