Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘నాది దుఃఖం వీడని దేశం’ కవితాసంకలనం ఆవిష్కరణ సభ – ప్రకటన

ప్రముఖ కవి, రచయిత హనీఫ్ గారి తాజా కవితాసంకలనం ‘నాది దుఃఖం వీడని దేశం’ ఆవిష్కరణ సభ – కవిసంగమం మరియు తెలంగాణా భాషాసాంసృతిక శాఖ సహకారంతో, ది 21-12-2021న మంగళవారం, రవీంద్రభారతి మినీ హాల్‌లో సాయంత్రం 6.00 గంటలకు జరగనున్నది.

ప్రముఖ కవి శ్రీ యాకూబ్ సభాధ్యక్షత వహిస్తారు

ప్రసిద్ధ కవి, సంస్కృతి సమ్మాన్ అవార్డ్ గ్రహిత శ్రీ కె. శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

ప్రముఖకవి శ్రీ సతీష్ చందర్, వీక్షణం సంపాదకులు శ్రీ ఎన్. వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

శ్రీ మామిడి హరికృష్ణ, సంచాలకులు, తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ; ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ జయరాజ్; ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య యువపురస్కార గ్రహీత డా. పసునూరి రవీందర్ విశిష్ట అతిథులుగా విచ్చేస్తారు.

శ్రీ హుమాయున్ సంఘీర్ ముగింపు వాక్యాలు పలుకుతారు.

సాహితీ ప్రియులు అందరికీ ఆహ్వానం!

Exit mobile version