1992 సంవత్సరం.
కాలచక్రం గిర్రున తిరుగుతూనే వుంది. ఒక రోజు సాయంత్రం ఐదు గంటలకు బ్యాంకు పని మీద బయటకు వెళ్దామనుకుని, టేబిల్ పైన వున్న ఫైల్స్ అన్నింటిని బీరువాలో సర్దుకుంటున్నాను. అంతలో ఇద్దరు స్టాఫ్ మెంబర్సు నా క్యాబిన్లోకి వచ్చారు. వారిని కూర్చోమని సైగ చేశాను.
“మీతో ఒక విషయం మాట్లాడాలి సార్!” ఇద్దరు అన్నారు ముక్త కంఠంతో…
“చెప్పండి!” అన్నాను.
“మరేం లేదు సార్! మన సబ్ మేనేజర్ గారితో కొంచెం ఇబ్బందిగా వుంది సార్!”
“ఇబ్బందా!! అదేంటి!!!”
“మాకేదైనా సందేహం కలిగినా, మరేదైనా సమస్య తలెత్తినా, సహాయం కోసం, సలహా కోసం వారి దగ్గరికెళ్తే, – ‘నో… నో… నో… మేనేజరు గారు ఉన్నప్పుడు నేను నిర్ణయాలు తీసుకోవడమా… ఇంకేమైనా ఉందా? తప్పమ్మా!!’ – అంటూ తప్పించుకుంటున్నారు సార్… ప్రతి చిన్నదానికి మీ దగ్గరకి వచ్చి, మీరు చేస్తున్న ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగించలేము కదా సార్!” చెప్పారు ఒకరు.
“అలాగని చెప్పి, మీరు బ్యాంకు పని మీద బయటకెళ్ళినప్పుడు, మా సందేహ నివృత్తి కోసం, సహాయం కోసం, వారి దగ్గరికెళ్తే – ‘నో… నో… నో… మేనేజరు గారు లేనప్పుడు నేను నిర్ణయాలు తీసుకోవడమా… ఇంకేమైనా ఉందా? తప్పమ్మా!!’ – అంటూ తప్పించుకుంటున్నారు సార్!” చెప్పారు ఇంకొకరు.
“ఇటు మీరు బ్రాంచ్‌లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోక, అటు మీరు బ్రాంచ్‌లో లేనప్పుడు నిర్ణయాలు తీసుకోక, మరెప్పుడు సార్, ఆయన నిర్ణయాలు తీసుకునేది?” అన్నారు ఒకరు కొంచెం కోపంగా.
“మేము చాలా రోజుల నుండి ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. కానీ మీ దాకా తీసుకురాలేదు సార్! ఎందుకంటే, వారికి తెలిస్తే, మేమేదో ఆయనపై మీకు ఫిర్యాదు చేసినట్లు బాధపడతారు కదా సర్! అందుకని…! ఇప్పుడిక వారి గురించి మీ దృష్టికి తీసుకురాక తప్పలేదు సార్!” నింపాదిగా చెప్పారు ఇంకొకరు.
ఊహించని ఈ పరిస్థితిని తెలుసుకుని నిర్ఘాంతపోయాను. ‘సబ్ మేనేజర్లు ఇలా కూడా వుంటారా? ఎంత విచిత్రం! ఇంతకు ముందు నేను మేనేజర్‌గా పని చేసిన మహబూబాబాద్ బ్రాంచ్ సబ్ మేనేజర్ గారు కాని, నిడుబ్రోలు బ్రాంచ్ సబ్ మేనేజరు గారు కాని, అటు బ్రాంచ్ స్టాఫ్ మెంబర్స్‌కి, ఇటు నాకు ఎంతో సహాయకారులుగా వుండేవారు. మరి ఇక్కడి సబ్ మేనేజరు గారు ఇలా వుండడం ఏమిటి? అవును మరి! మనిషి మనిషికి పరిస్థితుల పట్ల వారి అవగాహనలో, ఆలోచనా ధోరణితో తేడా వుంటుంది అనేది నిజమే కదా!’ అనుకుంటూ ఆ ఆలోచనలకు ఫుల్‌స్టాఫ్ పెట్టిన నేను…
“ఆ! చూడండి!! మన సబ్ మేనేజరు గారు ఈ మధ్యనే తెనాలి రీజియన్‌కి బదిలీ కోసం హెడ్ ఆఫీసుకి అర్జీ పెట్టుకున్నారు. కొద్ది రోజుల్లో ఈ సంవత్సర సాధారణ బదిలీలు జరిగేటప్పుడు, వారికి తెనాలి రీజియన్‌కి తప్పక బదిలీ వస్తుంది… వారి స్థానంలో మరొకరు సబ్ మేనేజర్‌గా వస్తారు. అప్పటి వరకు ఓపిక పట్టండి… ఈ లోపు మీ విధుల నిర్వహణలో మీకు ఏ మాత్రం అసౌకర్యం కాని, ఇబ్బంది కాని కలిగితే సరాసరి నన్ను కలిసి నాతో మాట్లాడడానికి వెనుకాడకండి. నేనేమీ అనుకోను… సరేనా!” అంటూ వారిని సముదాయించాను.
“అలాగే సార్! మా ఇబ్బందిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించినందుకు మీకు ధన్యవాదాలండీ!” అంటూ నిష్క్రమించారు వాళ్ళిద్దరూ.
అప్పుడు నేనూ, తేలికపడిన మనసుతో బయటికి నడిచాను.
మార్చి నెల దాటి ఏప్రిల్‌లోకి అడుగుపెట్టాం. మా బ్రాంచ్‌కి నిర్ధారించిన లక్ష్యాలన్నింటిని అందరి సమిష్టి కృషితో అధిగమించగలిగాం.
రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఉదయం పదకొండు గంటలకు మా సబ్ మేనేజర్ గారు హడావిడిగా నా క్యాబిన్ లోకి ప్రవేశించి, తనను తెనాలి రీజియన్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయని చెప్పారు.
“చాలా సంతోషమండి.. కంగ్రాచ్యులేషన్స్! మొత్తానికి మీరు కోరుకున్నట్టే జరిగింది” అంటూ నా ఆనందాన్ని వ్యక్తపరిచాను.
“థాంక్సండీ!” అంటూ మిగతా సిబ్బందికి ఆ శుభవార్తను చెప్పేందుకు వెళ్ళారు సబ్ మేనేజర్ గారు.
అప్పుడే, నేను రాజమండ్రిలో ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థలో డైరక్టరుగా పనిచేసే రోజుల్లో, రాజమండ్రిలోని ఆల్కాట్ గార్డెన్స్ బ్రాంచిలో అధికారిగా పనిచేసే శ్రీ టి. మోహనరావు గారు నా క్యాబిన్లోకి వచ్చారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.
“హల్లో! మోహన్‌రావు గారు… మీరేంటి ఇక్కడ!!” అని అడిగాను.
“సార్! నాకు యమ్.యమ్.II గా ప్రమోషన్ వచ్చింది. తెలంగాణలో దూరపు బ్రాంచికి బదిలీ చేస్తున్నారని తెలిసింది. సరే! ఎటూ వెళ్ళాలి కాబట్టి, కరీంనగర్ బ్రాంచ్‌లో నాకు బాగా తెలిసిన మీరున్నారు కదా… అని… మీ బ్రాంచ్‌కి పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. వెంటనే నన్ను ఈ బ్రాంచికి పోస్ట్ చేశారు. అంతే! ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇలా వచ్చేశాను సార్! ఈ రోజే మీ బ్రాంచిలో జాయిన్ అవుదామనుకుంటున్నాను సార్!” గుక్క తిప్పుకోకుండా చెప్పారు మోహన్‌రావు గారు.
“ముందుగా మీకు పదోన్నతి లభించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! మా బ్రాంచి తరఫున మీకు సుస్వాగతం! మీరనుకున్నట్లే ఈ రోజే జాయిన్ అవ్వండి! ఈ బ్రాంచిలో మీకు అన్ని విధాల బాగుంటుంది… మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ టు యూ!” అని ఆప్యాయంగా చెప్పాను.
“థాంక్యూ సో మచ్ సర్!” అన్నారు మోహన్‌రావు గారు అంతే ఆప్యాయంగా.
అప్పుడే, …అటెండర్ మా ముందుంచిన కాఫీ కప్పులను ఖాళీ చేసి, ఇద్దరం బ్యాంకింగ్ హాల్లోకి నడిచాము. మా సిబ్బందికి మోహన్‌రావు గారిని పరిచయం చేసి, తనకు కేటాయించిన సీట్లో కూర్చోబెట్టి… మరోసారి… ‘ఆల్ ది బెస్ట్…’ చెప్పాను. సిబ్బంది అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు మోహన్‌రావు గారికి.
నాతో పాటే మా సబ్ మేనేజర్ గారు కూడా నా క్యాబిన్ లోకి వచ్చారు. కూర్చోమంటూ కుర్చీ చూపించాను.
“సార్! ఎటూ నా ప్లేస్‌లో మోహన్‌రావు గారు వచ్చి జాయిన్ అయ్యారు కదా సార్! ఈ రోజు సాయంత్రం మీరు నన్ను రిలీవ్ చేస్తే, రేపే తెనాలి వెళ్ళి రీజినల్ మేనేజర్ గారిని కలిసి, నాకు కావలసిన బ్రాంచ్‌కి పోస్టింగు కోసం రిక్వెస్టు చేస్తాను సార్! లేటయితే… నేను కావాలకున్న బ్రాంచిలో వేరే వారిని పోస్టు చేస్తారేమో సార్! ఈ రోజే రిలీవ్ చెయ్యండి సార్!” ప్రాధేయపూర్వకంగా అడిగారు సబ్ మేనేజర్ గారు.
“అలాగేనండి! ఈ రోజు సాయంత్రమే రిలీవ్ అవుదురు గాని… సంతోషమేనా…!” అడిగాను.
“థాంక్యూ వెరీమచ్ సర్!” అని చెప్పి ఆనందాతిశయంతో తన సీటు వైపు వడివడిగా నడిచారు సబ్ మేనేజర్ గారు.
(మళ్ళీ కలుద్దాం)
ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ .46th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏
Mee Sambasiva Rao Thota
సబార్ఢినేట్ లకు అవసరమైనరీతిలో వారిని ప్రోత్సహించడం, వారి సమస్యలను ఆలకించి పరిష్కరించడం మీకున్న లక్షణమని నేటి రచన తెలుపుతుంది. అలాంటి లక్షణంమీలో ఉన్నందునే మోహన్ రావుగారు మీరున్న ఈబ్రాంచిని ఎంపికచేసుకున్నారని స్పష్టంగ తెలుస్తుంది సర్. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు
Brother Sagar, Thank you very much for your observations and appreciation 👍
బాగుంది మీ జీవన యానం. గతాన్ని పునశ్చరణ చేసుకుంటూ నిబద్ధతతో అక్షరీకరిస్తున్న మీ శ్రద్ధ ఎంతైనా అభినందనీయం.
From Sri Vempati KameswaraRao Hyderabad
Vempati KameswaraRao Garu! Thank you very much for your observations and appreciation 🙏
Very Diplomatic…
From Sri RamanaMurthy Vizag
That is managing things with positive approach.. Thank you very much RamanaMurthy Garu 🙏
Very nicely managed the situation Sir
From Sri Seshumohan Hyderabad
Thank you very much Seshumohan Garu 🙏
Good and great 👍👍. In today’s episode, while going through, I remembered one dialogue of one of my colleague Managers. He used to say… Sir as long I was a Sub Manager, my Manager was lucky and when I became Manager, my Sub manager became lucky. That means a person who is alcoholic continues to work irrespective of their position, just like you. Special Kudos to you
From Sri BoseBabu Hyderabad
BoseBabu Garu! Thank you very much for your observations and appreciation…🙏 The dialogue is very apt.. Good…
🙏🙏Dear Sambasiva raoJi NA jeevanagamanamulo Experiences atTENALI KARIMNAGAR highly appreciated regards M S RAMA RAO 👍👍 Central Bank Hyderabad
Thank you very much MS RAMARAO Garu 🙏
సిబ్బంది ఇబ్బందులను అర్ధం చేసుకుని, ఎవరినీ నొప్పించకుండా, అర్ధవంతమైన పరిష్కారాన్ని చూపి మీ నాయకత్వ పటిమను ప్రదర్శించారు. సాధారణంగా కొంతమంది సిబ్బంది అప్పుడప్పుడూ కొన్ని సమస్యలను సృష్టిస్తుంటారు. వాళ్ళ వాళ్ళ నైజాలబట్టి, కావాలని కొంతమందీ, తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని కొంతమందీ అలా చేస్తుంటారు. అటువంటి సందర్భాలను బట్టి ఎవరిని ఎలా అదుపుచెయ్యాలో మంచి నాయకులకే సాధ్యమవుతుంది. అభినందనలు సాంబశివరావు గారూ.
SubbaRao Garu! Thank you very much for your observations and appreciation 🙏 I believe that….As long as we try to solve the issues or problems with positive approach,things will go smoothly and comfortably.. I used to follow the same system every where…
Thank you SubbaRao Garu…
I never knew you were so good at human management! You should have changed your job and become a VP in a multi-national company! This issue is like a suspense thriller. I am eager to know whether the sub-manager learnt his lesson! If not a movie, at least write a story with such incidents! All the best!
Sri MV RAO Garu! You are so kind enough to go through all the episodes analytically and offer your valuable comments….. Not only that , you always offer good suggestions and advices,which are really worth to follow and implement.. Thank you very much Sir 🙏
బ్యాంక్ లో క్రింది స్థాయి వారితో పనిచేయిన్చుకోవడం ఒక ఆర్ట్. అది మీదగ్గర పుష్కలంగా వుంది. అదే మీకు బాగా ఉపయోగ పడింది. ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీలే! అభినందనలు మీకు. —-డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ.
Prasad Garu! Thank you very much for your observations and appreciation 🙏
Nice Sir..
From Sri Venkateswarlu Guntur
Thank you very much Venkateswarlu Garu 🙏
Miku management skills baaga unnai
From Smt.Seethakkaiah Hyderabad
సహచర సిబ్బందికి దైర్యాన్ని ఇవ్వడం, వారి సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించడం మరియు బ్రాంచ్ అభివృద్ది లక్షాలను అధిగమించడంలో గురువుగారు ఉద్దండుడు. ఒకరేమో సహచరులకు సహకరించక స్వార్థంతో స్వంత రీజియన్ కు బదిలీ కోరుకున్నారు. మరొకరు MM I I ప్రమోషన్ తో మీవద్దనే పని చేయాలనే దృడ సంకల్పంతో తమరి చెంతకు చేరారు. అధికారులు ఎక్కడికి బదిలీ చేసినా ఆస్వాదించి వెళ్తూ, అక్కడ అభివృద్ధిని కోరుతు పనిచేసారు తమరు. ధన్యవాదములు🙏 అరుణాకర్ మచ్చ,మానుకోట
Arunakar Garu ! Thank you very much for your observations and appreciation 🙏 For the success of any one , good team with perfect understanding and wholehearted cooperation,is very much needed… Dhanyavaadaalandi 🙏
చాలా బాగుంది కథనం బాగుంది. తరువాయి బాగం కోసం ఎదురు చూస్తున్నాము
VaraPrasad Garu! Thank you very much for your encouragement and appreciation 🙏
It is very difficult to manage a branch To my knowledge there will be many types of problems the Br head has to Pass through 1. Maintaining cordial relations with all the staff both award staff officers and especially when there are two different unions 2 Satisfying the ego of Sub manager 3 Expectations of the Custoners and proper understanding their issues and requirements 4. Achieving the br targets .Generally the staff feels that it is the responsibility of BM only .Here lies the tact and mingle ness of BM to make all the staff responsible for br development . 5 Ensuing efficient customer service 6 Good Credit 7 Recovery abd follow up of NPA accounts 8. Proper house keeping and avoid a bug audit report All these culminate into either a success or failure If success the staff feel that it is because of them Failure is attributed to BM Hope u might have experienced all these in ur journey and still u have cone out with flying colours focusing on development Hearty congratulations Sir
From Sri Lakshman Rao Hyderabad
Lakshman Rao Garu! Thank you very much for your observations and appreciation 🙏 You have so clearly explained the entire functioning of a Branch, … Fantastic Sir… Thanks for your time and patience in documenting the facts ,practically…,,,, Dhanyavaadaalandi 🙏
VaraPrasad Garu! Thank you very much for your observations and appreciation 🙏
బాగుంది. కొన్ని అట్లాగే కలిసి వస్తాయి. సమయమే అన్నిటికీ పరిష్కారం. మీ ఓపికకు జోహార్లు👏🏻👏🏻👎🏻👎🏻
From Sri RamanaPrasad Hyderabad
Avunandi.. Meeru cheppindi nizam.. Dhanyavaadaalandi 🙏
Nice one Sambasiva Rao garu. Nice coordination with the staff and not hurting ones feelings and getting the work done is an art of the managerial cadre which is abundant with you.
SreenivasaMurthy Garu! Thank you very much for your observations and appreciation 🙏
జీవనగమనం ఎపిసోడ్ చాలా బాగుంది.మీరు ఏ ప్రాంతంలో పని చేసిన,అక్కడున్న పరిస్థితులు,అవసరాలకనుగుణంగా ప్రత్యేక శైలితో సముచిత నిర్ణయాలు తీసుకొని స్టాఫ్ సమస్యలు మరియు ఖాతాదారుల అవసరాలు ఎప్పటికప్పుడు ఓర్పు కనబర్చి సమస్యలు జటిలం కాకుండా నెరవేర్చుతూ దానికి తోడు బ్యాంక్ ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ పై అధికారుల మెప్పు పొందుతున్న మీకు ధన్యవాదములు సర్.
BhujangaRao Garu! Thank you very much for your observations and appreciation 🙏 Every where , I am lucky to have colleagues like you…who supported me and walked along with me on the path of SUCCESS… Dhanyavaadaalandi 🙏
చాలా బాగుంది సార్. ఇవన్నీ మనకి చాలా అనుభవాలు సార్. From Sri Krishnamurthy (FB) Hyderabad
Avunandi… Thank you very much Krishnamurthy Garu 🙏
సాంబశివ రావు గారు, ఈసంచికలో మీ ఉద్యోగ నిర్వహణలో వచ్చే సమస్యలను ఎలా సున్నితంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించ గలరో మరియొకసారి నిరూపించినందుకు దన్యవాదములు.
NagaLingeswararao Garu! Thank you very much for your observations and appreciation 🙏
Interesting Episode… From Mr.Ramakrishna Hyderabad
Thank you very much Ramakrishna 👍
చదువుతుంటే కంటి ముందు దృశ్యాలు కనబడుతున్నాయి.
From Sri Sathyanarayana Hyderabad
Thank you very much Sathyanarayana Garu 🙏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వెతుకులాట
సీత-8
జ్ఞాపకాల తరంగిణి-80
ఎవరో రావాలి
ఏది ఉగాది?!
ఆకాశవాణి పరిమళాలు-40
రాత్రి వేళ
జగన్నాథ పండితరాయలు-14
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-65
శతక పద్యాల బాలల కథలు-8
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®