చూస్తే అంతా బాగానే వుందనిపిస్తుంది. కానీ ఏదో వెలితి, ఏదో నిరాశ, ఏదో నిస్సత్తువ. ఇక్కడి వాతావరణం, ఇక్కడి పరిస్థితులు, చూడగా చూడగా ఏదోగా అనిపిస్తున్నాయ్! ఇక్కడ నేను నా విధులను సమర్థవంతంగా నిర్వహించగలనా! అనుమానమే! వేరే ఇంకెక్కడికైనా బదిలీ కొరకు ప్రయత్నం చేస్తే? నో… నో…! అది సరైన పద్ధతి కాదు. ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడే వుంటూ విధులను నిర్వర్తించడం నా కర్తవ్యం. వేరే చోటికి వెళ్ళినా అక్కడ ఇంతకంటే బాగుంటుందనే గ్యారంటీ ఏముంది?… ఏంటో… మరి… ఈ ఆలోచనలు… ఎటు దారితీస్తాయో… ఏమో! అర్థం కావడం లేదు… ప్రస్తుతానికి ఫ్యామిలీని గుంటూరులో వుంచి, మరికొద్ది రోజుల్లో ఇక్కడికి తెచ్చేందుకు నిర్ణయించుకున్నాను.
పనిలో ఏకాగ్రత కుదరడం లేదు. ఈ అసంతృప్తిని నాలోనే దాచుకోలేకపోయానో… ఏమో!… మా సిబ్బంది, కొంతమంది పాలకవర్గ సభ్యులు దాన్ని పసిగట్టగలిగారు. ఆఖరికి, విషయం అటు తిరిగి ఇటు తిరిగీ, వరంగల్‌లో వున్న మా రీజినల్ మేనేజర్ గారి దాకా వెళ్ళింది. ఒక రోజు వారి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. నన్ను వెంటనే వరంగల్ వచ్చి కలవమని ఆదేశించారు. మరుసటి రోజే వరంగల్ వెళ్ళి రీజినల్ మేనేజర్ శ్రీ జి. మాలకొండారెడ్డి గారిని కలిశాను. వారిని నేను ఇంతకు ముందే, 1980 ఫిబ్రవరి నెలలో ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులో, నేను పాల్గొన్న సెమినార్ ముగింపు కార్యక్రమంలో చూశాను.
నన్ను చూడగానే రీజినల్ మేనేజర్ గారు… “ఆ! రావయ్యా! రా!… కూర్చో!… ఎలా వున్నావ్?” అని అడిగారు.
“బాగానే వున్నాను సార్!”
“ఏంటి?… నాకో విషయం తెలిసింది. అక్కడ పని చేయడానికి … ఏదో ఇబ్బంది పడుతున్నావట! నిజమేనా?”
“అదేం లేదు సార్!”
“నాకు తెలుసులేవయ్యా!… నీకో విషయం తెలుసా?… నిన్ను అక్కడ పోస్టింగ్ చేయించే ముందే… నీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. నీకు గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధ వుందని నాకు తెలిసింది. ఆ తరువాత ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులో నిన్ను చూశాను. ఆ రోజే, కురవి కర్షక సేవా సహకార సంఘానికి మేనేజింగ్ డైరక్టర్‌గా నువ్వు సరిగ్గా సరిపోతావనే నమ్మకం నాకు కలిగింది. అందుకే నిన్ను అక్కడికి నేనే బదిలీ చేయించాను.
అది చాలా బాగా నడుస్తున్న సంఘం. నువ్ నీ సహజ ధోరణిలో పని చేస్తే చాలు… అటు సంఘానికి… ఇటు నీకు… మంచి పేరు వస్తుంది. ఆ విషయంలో నాకే మాత్రం సందేహం లేదు…!
ఒక పని చేద్దాం! మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి… నువ్ అక్కడ కష్టమైనా ఒక ఆరు నెలలు పని చేయ్! అప్పుడు నీకే తెలుస్తుంది… అక్కడ నీకెంత బాగుంటుందో! ఎంత జాబ్ శాటిస్ఫాక్షన్ కలుగుతుందో!
ఒక వేళ, ఆరు నెలల తరువాత కూడా, నీకక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే, సరాసరి నన్నొచ్చి కలువ్! నువ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి, అప్పటికప్పుడే బదిలీ చేయించే పూచీ నాదీ…! ఏమంటావ్?”
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా అనిపించాయి రీజినల్ మేనేజర్ గారి మృదు మధురమైన ఆ మాటలు. అంత వివరంగా చెప్పిన తరువాత కూడా… నా మనసు మార్చుకుని మహబూబాబాద్ లోనే కొనసాగుతూ ముందుకెళ్ళకపోతే… అంతకంటే పెద్ద తప్పిదం మరేదీ వుండదని నాకనిపించింది.
“సార్! నాకంతా అర్థమయింది సార్! మీరు నా మీద వుంచిన నమ్మకాన్ని, ఎట్టి పరిస్థితులలోనూ వమ్ము కానివ్వను సార్! నేనేంటో చేసి చూపిస్తాను సార్”
“దట్ షుడ్ బీ ద స్పిరిట్! గో ఎహెడ్! ఆల్ ది బెస్ట్ టు యూ!”
“థాంక్యూ సార్!”
తేలికపడిన మనసుతో క్యాబిన్ బయటికొచ్చాను. అక్కడే వున్న గ్రామీణాభివృద్ధి అధికారి, మా సంఘంలో ఆంధ్రా బ్యాంకు తరఫున ఓ డైరక్టర్ కూడా అయినటువంటి, నా మిత్రుడు రామచంద్రారెడ్డిని కలిశాను. కొంచెం సేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నాము. తిరిగి రాత్రికి మహబూబాబాద్ చేరుకున్నాను.
జాయినింగ్ టైమ్‌లో కాకినాడ నుండి సామాన్లు మహబూబాబాద్ చేర్చాను. మా అబ్బాయి చదువుకునే బ్లూ కాన్వెంట్లో టి.సి. కూడా తీసుకుని, ఫ్యామిలీ మహబూబాబాద్‌కు మార్చాను. అబ్బాయిని ఫాతిమా కాన్వెంట్లో, అమ్మాయిని మా ఇంటెదురుగానే వున్న గాదె రుక్మారెడ్డి మెమోరియల్ స్కూల్లో చేర్చించాము.
ఫీల్డ్ ఆఫీసర్లు వెంటరాగా, సంఘం యొక్క సొంత జీపులో సంఘ పరిధిలోని గ్రామాలకు వెళ్ళి, అక్కడి సంఘ సభ్యులను కలుసుకోవడం, పంట పొలాలను పరిశీలించడం మొదలుపెట్టాను. ముఖ్యంగా మారుమూల తండాలకు వెళ్ళి, అక్కడి లంబాడీలతో కలిసి మెలసి తిరుగుతూ, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా గమనించే అవకాశం నాకు దొరికింది. ఏ గ్రామాని కెళ్ళినా, ఏ తండాకు వెళ్ళినా, అక్కడి వారి ఆదరాభిమానాలు, ఆతిథ్యం నన్ను కట్టిపడేసేవి.
గ్రామాల్లో ఇంతవరకు ఋణాలు పొందనివారు ఇంకా చాలామంది వున్నారు. వాళ్ళందర్నీ సంఘ సభ్యులుగా చేర్పించి, వాళ్ళకవసరమయే ఋణాలు ఇస్తూ, వాళ్ళందర్నీ అభివృద్ధి పథంలో నడిపిద్దామని మా ఫీల్డ్ ఆఫీసర్లకు చెప్పాను.
అక్కడి రైతులందరూ కష్టపడి పని చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి కనబరచడం నేను గమనించాను. అందుకే ప్రతి గ్రామం నుండి, తండా నుండి, ఎంపిక చేయబడిన రైతులను, శిక్షణ నిమిత్తం, ప్రభుత్వ రంగంలో నడిచే శిక్షణా సంస్థలకు పంపిద్దామని నిర్ణయించాము.
ఆ క్రమంలో మొదటిగా మహబూబాబాద్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వున్న మల్యాల గ్రామంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థకు కొంతమంది రైతులను శిక్షణ నిమిత్తం, తీసుకొని వెళ్ళాము. ఆ సంస్థ ఇన్ఛార్జిగా వున్న శాస్త్రవేత్త పమిడి వెంకటేశ్వర్లు గారు, బాపట్ల వ్యవసాయ కళాశాలలో నా క్లాస్మేట్ కూడా. రైతులకు శిక్షణ నిమిత్తం తరగతులను నిర్వహించడమే కాకుండా ఆ సంస్థ భూముల్లో వివిధ పంటలపై, ముఖ్యంగా మిరప పంటపైన జరుగుతున్న పరిశోధనలను, ప్రత్యక్షంగా చూపిస్తూ, రైతుల సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు వెంకటేశ్వర్లు గారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై చక్కటి అవగాహనను పెంచుకోగలిగారు. ఆ పద్ధతులను తాము కూడా తమ తమ వ్యవసాయ భూముల్లో అవలంబిస్తూ, లాభసాటి వ్యవసాయం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
మరికొంతమంది రైతులను హైదరాబాద్‌కు ఆవలి వైపున, పటాన్‌చెరువుకు సమీపంలో వున్న ‘ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్’ – ‘ఇక్రిశాట్’ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థకు తీసుకొని వెళ్ళాము.
ఆ సంస్థ మెట్ట వ్యవసాయం అభివృద్ధి కొరకు నిరంతర పరిశోధనలు జరుపుతుంది. ముఖ్యంగా వర్షాభావంలో కూడా మెట్ట భూముల కనువైన హైబ్రీడ్ వెరైటీలను అభివృద్ధి చేస్తుంది ఆ సంస్థ. కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ పంటల కోసం అధిక దిగుబడులిచ్చే వంగడాలను కనిపెడుతుంది ఆ సంస్థ. ఆ పంటలలో కొన్ని మన సంఘ పరిధిలోని గ్రామాల్లో కూడా సాగు చేయబడుతున్నాయి. అందుకే శాస్త్రజ్ఞులతో ముచ్చటిస్తూ, వారు చేస్తున్న పరిశోధనలను క్షేత్రస్థాయిలో చూస్తూ, చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నారు మన రైతులు.
***
గుంటూరు లాం ఫారంలో, మిరప జి4 రకంపై పరిశోధనలు విజయవంతంగా ముగిసిన తరువాత, అక్కడి సీనియర్ శాస్త్రవేత్త, శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, మల్యాల వ్యవసాయ పరిశోధనా సంస్థకు వస్తున్నారని ఆ సంస్థ ఇన్ఛార్జ్, నా క్లాస్మేట్ వెంకటేశ్వర్లు గారి ద్వారా తెలుసుకున్నాను. మల్యాల వచ్చినప్పుడు మా సంఘ పరిధిలోని గ్రామాల్లో పర్యటించడానికి ఒకటి రెండు రోజులు కేటాయించాలని శ్రీ సత్యనారాయణ రెడ్డి గారిని ఫోన్లో అభ్యర్థించాను. వారు నా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు నేను బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్‌గా వుండేవారు! ఎంతైనా గురుశిష్యుల అనుబంధం కదా! నేనడిగితే కాదంటారా!!
అనుకున్నట్టే శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మా సంఘ పరిధిలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు అనేక సలహాలను ఇచ్చారు. ముఖ్యంగా మిరప జి4 రకం విత్తనాలతో మిర్చి సాగు చేస్తే దిగుబడులను ఇతోధికంగా పెంచుకుంటూ అధిక లాభాలను సంపాదించవచ్చని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ తన పర్యటనను కొనసాగించారు. ఆ పర్యటనలో భాగంగా రైతులడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పారు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు. రైతులందరూ ఈ పర్యటనతో చాలా సంతోషించారు.
వీలు కుదిరినప్పుడల్లా మరలా మన గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు. చివరిగా వారికి మేమంతా ఘనంగా వీడ్కోలు చెప్పాము.
1981 సంవత్సరం.
1981 సంవత్సరం మార్చి నెలలో రాజోలు గ్రామం, హర్యా తండాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 40 గుడిసెలు దాకా అగ్నికి ఆహుతి అయ్యాయి. కట్టు బట్టలతో, పిల్లా పాపలతో, ప్రాణాలతో బయటపడ్డారు నివాసితులందరూ. విషయం తెలిసిన వెంటనే, నేను, మా సిబ్బంది, కొంతమంది సంఘ పాలకవర్గ సభ్యులు హుటాహుటీన ఆ ప్రదేశానికి చేరుకున్నాము. అప్పటికే తండాలోని మిగతావారు గుమిగూడారు. అక్కడివారంతా జరిగిన నష్టానికి తట్టుకోలేక, ఏడుపులు, పెడబొబ్బలతో గుండెలు బాదుకుంటున్నారు. వారిని ఆ తరుణంలో ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వెంటనే అందరం కలిసికట్టుగా సహాయక చర్యలు ప్రారంభించాము. కొద్ది సేపటికి ప్రభుత్వ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని మాతో చేతులు కలిపారు.
తక్షణ అవసరాల నిమిత్తం, సంఘం తరఫున బాధిత కుటుంబాలకు ఓ నెలకు సరిపడా బియ్యం, పప్పులు, మొదలైన వాటితో పాటు, వంట సామాగ్రిని కూడా అందించాము. వారందరికీ కావలసిన దుస్తులు కూడా ఏర్పాటు చేశాము.
ఆ తరువాత బాధితుల వివరాలను సేకరించి, మహబూబాబాద్ రెవెన్యూ డివిజినల్ ఆఫీసరు గారి ద్వారా, వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ఒక సమగ్ర నివేదికను పంపాము. ఇళ్ళు కోల్పోయిన వారందరికీ పునరావాసం పథకం క్రింద తిరిగి ఇళ్ళను నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం మంజూరు చేయవలసిందిగా కోరాము.
కొద్ది రోజుల తరువాత, బాధితులందరూ ప్రభుత్వ సహాయంతో తిరిగి ఇళ్ళు కట్టుకోగలిగారు.
(మళ్ళీ కలుద్దాం)
ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
మొదట మీ అసంతృప్తిని తరిమికొట్టిన మీ మేనేజర్ అభినందనీయులు. వారు ఇంతకముందే మీ పనితనాన్ని ఎరిగిఉండడం మీ అదృష్టం సర్ . అంతేకాక వారి మాటలను స్పూర్తిగా తీసుకుని మరీ కష్టపడాలనే మీ నిర్ణమే మిమ్మల్ని అభివృద్దిబాటలో నడిపింది సర్ . గ్రామ స్వరాజ్యం అనే మాట ప్రతివారం మీ రచనలలో కనీపిస్తుండడం అవి చదివి ఆనందించడం నాలాంటి వారి అదృష్టం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్ .
Brother Sagar ! Mee aathmeeya spandanaku Dhanyavaadaalu 💐
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..20 th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏
Mee Sambasivarao Thota
చాలా లైవ్లీ గా వుంటున్నాయి. 🙏🙏🙏🙏
Sreenivasarao Garu! Dhanyavaadaalandi 🙏
సమాజమే దేవాలయం, సమాజసేవే పరమావధిగా భావించే మీరున్నచోట ఏ ప్రమాదమూ ప్రజలను నిర్భాగ్యులను చెయ్యలేదని నిరూపించారు. అగ్నిప్రమాద బాధితులపట్ల మీ సత్వర స్పందన బహుదా ప్రశంసనీయం సాంబశివరావు గారూ.
SubbaRao Garu! Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
మామయ్య ట్రాన్సఫర్ అయిన తరువాత కన్ఫ్యూషన్ చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. మీరు నిజముగా బ్యాంకర్ గా గ్రామాల అభివృద్ధికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మేము చేస్తుంది అప్పటి మీ పనితో పోలుచుకోలేము. ఆ రోజుల్లో మేము అందరం బ్యాంక్ జాబ్ చాలా ఈజీ అని అనుకునే వాలము. కానీ మీరు పడిన శ్రమ ….గ్రేట్. సముద్రం లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్న పైకి ఏంతో ప్రశాంతగా కనపడుతుంది. అదే విధంగా మీరు ఉద్యోగరిత్యా ఎంత కష్టపడుతున్న పైకి ప్రశాంతగా కనిపెంచేవారు.
తరువాతి భాగం కొరకు ఎదురు చూస్తూ
బుడగాల నాగరాజు
Dear Naagaraju! Mee aathmeeya spandanaku Dhanyavaadaalu 💐
Dear Rao Thrilled to read your services to the poor farmers . Photos added more interesting Seeing our classmate and lecturer made me to recollect college days again These are all life experiences and unforgettable memories All the best and regards
Dear ASN Garu! Thank you very much for your observations and appreciation.. Our college days are golden days.. Gurthu ku vasthe entho santhoshamgaa vuntundi.. Mee encouragement ki Dhanyavaadaalandi 🙏
Hats off to your photographic memory and wonderful collection of photos! It is a gripping story!
Sri MN Rao Garu! Thank you very much for your observations and appreciation.. I am so happy with your continued encouragement.. Dhanyavaadaalandi 🙏
శ్రీ మాలకొండారెడ్డి గారు తన క్రిందివారి శక్తియుక్తులను గ్రహించడంలో దిట్ట. ఆయన సలహాను పాటించి మీరు విజయవంతమయ్యారు. నేను 2008లో తిరుమల బ్రాంచిలో పనిచేస్తున్నప్పుడు ఆయన తిరుమల వచ్చారు. మన బ్రాంచిలో ఆయన్ని చూడడం జరిగింది. అప్పటికి చాలా వృధ్ధులైపోయారు.
Avunu Sivaramakrishna Garu! Aa rojullo MaalakodaReddy Gari daggera panicheyadam naa adrushtamgaa bhaavisthaanu.. Dhanyavaadaalandi 🙏
నేను చదివాను సర్. ఈ సంచిక లో వచ్చిన భాగాలు చాలా బాగుంది. మిమ్మల్ని అక్కడికి పోస్టు చేయడం మీకు ఆ మేనేజర్ గారి హామీ తదుపరి మీ బాధ్యతలు నిర్వర్తించడం చాలా చక్కగా వివరించారు.కష్టాలలోవున్న వారిని బాగా ఆదరించారు. నాకు తెలిసిన నా నడకమిత్రునిలో ఇంత విషయం ఉన్నందుకు నాకు సంతోషంగా వుంది.😃
From Sri ARK Rao Kurnool
Sri ARK RAO GARU! Dhanyavaadaalandi 🙏
Sambasivarao garu meeku play direction lo anubhavam undani naaku Tenali lo undaga telusu. Mee ku rachanaa vyasangam undani ippude thelisindi.mee anubhavaalu chaduvuthunte paatha rojulu gurthuku vastunnayi.thq
Sri Gurubabu Garu! Thank you very much for your observations and appreciation 🙏 Thanks for your encouragement… Old days are Golden Days..🙏
మీ గురించి రీజినల్ మేనేజర్ మాలకొండా రెడ్డి గారికి ముందే తెలుసు,మీ సమర్ధతను గుర్తించి సంఘం మీదున్న అనుమానం,అసంతృప్తిని పారద్రోలి,వారిచ్చిన సలహాను స్ఫూర్తిగా తీసుకుని,వేయి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగు తోనే ప్రారంభవుతుందని భావించి,సంఘం అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటునందించినారు.సర్వ ప్రాణి సేవగా మాధవ సేవ అని గుర్తించి ,హర్యా తండాలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు సంఘం తరుపున మీరు(స్టాఫ్) చేసిన కృషి అభినందనీయం.సంఘం కార్య వర్గ సభ్యులు శ్రీ అమృతారెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఆగ్ని ప్రమాద బాధితులకు అవసరమైన సమగ్ర నివేదికను మీరు(సహఉద్యోగులు ) మహబూబాబాద్ డివిజన్ ఆఫీసర్ ద్వారా వరంగల్ కలెక్టర్ గారికి అందచేసి,వారికి కావాల్సిన సహాయం సరియైన సమయంలో అందించిన విధానం ప్రశంసనీయం.మీరు చేసిన సహాయం వారి జీవితంలో ఎప్పుడు మరువ రానిది మరియు మరుపురానిది.
BhujangaRao Garu! Your indepth analysis of the episode is quite interesting.. I really appreciate for your time and patience.. I always remember the days when I worked at Mahabubabad.. I had the greatest job satisfaction in those days…
Thank you very much for your observations and appreciation 🙏
వర్క్ పట్ల మీ కున్న శ్రద్దకు అభినందనీయం. చాలా బాగుంది మీ ఉద్యగ పర్వం.
From Mrs.Kasturi Devi Hyderabad
Kasturi Devi Garu! Dhanyavaadaalandi 🙏
Super andi Your past experience is quite inspiring👍👍
From Sri BoseBabu Hyderabad
BoseBabu Garu! Dhanyavaadaalandi 🙏
గురువు గారు
ఇంత అంకితభావం తో పని చేసే వాళ్ళను చాలా తక్కువ మందికి చూసాను.
అయ్య బాబోయ్..మేము నిరంతర శ్రామికులు..చాలా మెచ్చతగ్గ విషయం సర్.
మీకు కోటి కోటి ప్రణామములు🌿🙏🏻🌿
From Sri RamanaPrasad Hyderabad
RamanaPrasad Garu! Adanthaa Andhra Bank naaku kalagajeshina avakaashaalu.. Aa Bhagavamthudi Daya .. Anthe! Nenu nimitha maathrudini.. Mee aathmeeya spandanaku Shatha Koti Vandanaalu 🙏
Very good sir సబ్జెక్ట్ గుర్తుండటం ఓకే అప్పటి ఫోటోలు కూడా భద్రపరచి ఎంతో ముందు చూపుతో ,,,,,,,,,,,,,,,,,,,ok. రిటైర్మెంట్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు
From Sri Ramana Vinukonda
Ramana Garu! Thank you very much for your observations and appreciation.. I am encouraged by your affectionate comments.. Thank you Andi 🙏
Nice naration of past Experience sir. Thanks for sharing Regards From Sri Seshumohan Hyderabad
Seshumohan Garu! Dhanyavaadaalandi 🙏
Good sir, Bankers’ social responsibility ante practical ga chesi chuparu. Bsc rao.
From Sri SuryachandraRao Hyderabad
SuryachandraRao Garu! Dhanyavaadaalandi 🙏
Nice one sir. Very well explained. Gathering that many photos of that period it’s great. Remembering by names too is extraordinary.
SreenivasaMurthy Garu! Dhanyavaadaalandi 🙏
From Sri Ramakrishna Kurnool
Rama Krishna Garu! Mee abhimaanamtho koodina spandanaku Dhanyavaadaalandi 🙏
Very happy to read and to memorize my visit to mahabubabad in those days and your and pinni’s loving hospitality to me Babai 👍🏼💐 From Mr.Vijay Vijayawada
Dear Vijay! Thank you very much for remembering those memorable days.. We also really enjoyed those days which we spent with you at Mahabubabad.. Thank you once again 👍
బ్యాంక్ లో నా రోజులు జ్ఞాపకం వస్తున్నాయి
FYI Sri Sathyanarayana Hyderabad and
Sathyanarayana Garu! Dhanyavaadaalandi 🙏
9866039460 M S RAMARAO Dear Sambasiva Rao Garu I am very much proud to know your experiences in the banking career May God bless you and your family with happy retired life Respects and regards 🙏🙏🙏
From Sri MS RamaRao Hyderabad
RamaRao Garu! Thank you very much for your affectionate words 🙏
మొత్తానికి గీతోపదేశం బాగా పనిచేసింది మీకు. కొన్ని సలహాలు అంతే అలా పనిచేస్తాయి.మల్యాలను బాగా గుర్తు చేసారు. వెంకటేశ్వర్లు గారు నాకు కూడా బాగా తెలుసు.మీజ్ఞాపకాలు నన్ను మల్లీ మహబూబాబాద్ తీసుకు పోయాయి.అమృత రెడ్డి గారి ని గుర్తు చేసారు.లైన్స్ క్లబ్ ద్వారా మీ పరిచయం అయినట్టు గుర్తు. మీ జ్ఞాపకాలు గొప్పవి. అభినందనలు.
Prasad Garu! Avunu..Cheppevaallu chepthe evarainaa vinaalsinde… Mee parichaya bhaagyam mari koddirojullo naaku kalagabothundi… Avi nizam gaa Golden Days.. Dhanyavaadaalandi 🙏
మీ కృషి మీ అభి రుచి మీ అనుభవాలు prasamsaniyamu
From Smt.Seethakkaiah Hyderabad
Dhanyavaadaalandi Seethakkaiah 🙏
Extensive and wonderful exchange of commendable field work. This dedication made you to occupy your first posting in Farmers’ Training Institute in Dowleswaram. Wondering as to how you kept up such an exhaustive collection of photographs and further wondering your great and great memory power. Proud of you dear. Many more experiences to read in future.
Fraternally, Shanmukha Chary .A Sr. Journalist 16 May 2021
Hyderabad
Thank you very much Brother Shanmukhachary 🙏 I am particularly happy with your observations and appreciation.. Your affectionate Comments are so valuable to me as you are my Best Friend and Contemporary… I always need your guidance and encouragement to go further in the matter of Writing.. Thank you once again Brother 👍
Very nice episode.. With lot of emotions.. Pictures are making much more interesting.. Fire accident..is heart touching..
From Mr.Ramakrishna Hyderabad
Thank you very much Ramakrishna 👍
చాలా సంతృప్తి నిచ్చే నిజాంసం.
From Smt.Prabha Sasthry Mysore
Prabha Sasthry Garu! Dhanyavaadaalandi 🙏
Sambasiva garu all the episodes of your geevanagamanam published so far reveals that you were brought up in healthy & good atmosphere with utmost morals ,hardwork& healthy mingling with society. This also helps in justifying your family 👪.
Communication system not developed during those as developed nowadays 😒. No cell phones, no television, no social media.
To communicate anything either banking system or anything people have to take a lot of strain to go far places to meet the people & getting banks to develop. Like that you have taken all the hard steps 🚶♂️ that are necessary to develop your working bank”Andhra Bank “. Thus you also become a part of the bank employees in development 👏 of bank.
I wish you all the best 👍 in coming episodes.
UshaRani Garu! Thank you very much for your detailed observations and visualising those hard days … Whatever it be , I have derived the Greatest Job Satisfaction.. That is more than anything else,to me.. Thanks for your affectionate comments ,encouragement,and appreciation,which are inspiring me.the same which I always cherish… Thank you once again 🙏
మీ.స్వచరిత్ర చదువు తూ ఉంటే ఒకవిషయం తట్టింది. చదివిన చదువు కీ ఉద్యోగానికీ సంబంధం ఉండాలని నేను. ఒకప్పుడు అనుకనే.వాడిని..ఇంజనీరింగ్ లేక.మెడికల్ చదివిన వారు IAS చేరడాన్ని విమర్శించేవాడిని. ఇప్పడు తెలిసింది డిగ్రీ కన్నా అంకిత భావన (commitment) ముఖ్యం. Agriculture నుంచి bankingకీ అక్కడినుంచి రచనా వ్యాసంగానికీ జరిగిన మీ ప్రయాణం ఆసక్తి కరంగా ఉంది. ఇంగ్లీషు రచనాప్రపంచంలో 64ఏళ్లుగా ఉన్ననాకు తెలుగులో రాసి, కన్నడ లోకి తర్జుమా ఐ ప్రచురింపబడిన నాపుస్తకం తెలుగులో నేనేఅనువాదం చెయ్యడానికీ సాహసం చేస్తున్నారు -తెలుగు ఏబడి లోనూ నేర్చుకోకపోయీనా
From Sri Someswar Bangalore
Someswar Garu! Telugu raakapinaa Telugu lo meeru tharjumaa Cheyadaaniki meeru saahasinchadam Harshaneeyam.. Mee prayathnam vijayavamtham kaavaalani manaspoorthigaa korukuntunnaanu.. All the Best Sir 👍👍👍
Someswar Garu! Thanks for your time and patience in reading my episodes.. I am also thankful to you for your observations and appreciation.. I am delighted to read your affectionate and encouraging comments,which are so inspiring me .. to go further in my Rachanaa vyaasangam… As you rightly pointed ,”COMMITMENT “ is one of the Best sources of “Success “ in any one’s Proffession ,whatever may be Educational Background.. Thank you very much Sir for your comments which I always cherish..🙏🙏🙏
RM , Malkonda Reddy sir, has identified your potentiality and assingned MD position of FSCS, which you successfully done the job . The commitment levels are certainly high in those days. Continue the saga.
From Sri ChandrasekharReddy Hyderabad
ChandrasekharReddy Garu! Your observations about those days are very much correct… As you said, Sri MalakondaReddy Garu was very much known for identifying and developing Leaders,…in those days… Thank you very much for your affectionate comments 🙏
Namasthe Guruvu Garu. నన్ను క్షమించ గలరు. ఫోను పాడింది. వారం తర్వాత కొత్త ఫోన్ కొన్నాను. మీ కధల సంపుటి లో గత నాలుగు సంచిక లు దయచేసి తిరిగి వాట్సప్ చేయగలరు. Please Sir. I have lost nearly 500 phone contact numbers also due to phone crash as it fell down. Sorry but I want to read your serial writings which are very interesting. If another two are ready that one also can be posted Sir. Tk you Sir. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐jeevanandam Hyderabad
Jeevaanandam Garu! Thappakundaa pampisthaanu.. No problem at all.. Thank you very much Sir 🙏
Just like running commentary ur life journey speed up aindi.
From Sri VenkateswaraReddy Guntur
Dear VenkateswarReddy! Thank you very much 🙏
గురువు గారికి 🙏 *నా జీవన గమనంలో* సంచిక తెలుగు సాహిత్య వెబ్ పత్రికలో ఎపిసోడ్ 20,21,22 మీ రచన చదివాను. ఆనాటి పాత విషయాలు గుర్తుకు తెచ్చారు. చాలా చక్కగా వివరించారు. మరియు ఆనాటి దాచిన భద్రపరిచిన తాషివీర్లు (చిత్రాలు) ద్వారా వాటి ప్రాముఖ్యతను వాటి విలువను తెలిపారు. అభినందనీయం అద్భుతం, మీ రచనలు చదినకొద్ది ఇంకా చదవాలనిపిస్తుంది… ధన్యవాదములు 🙏 అరుణాకర్ మచ్చ మహబూబాబాద్.
You must be logged in to post a comment.
అనువాద మధు బిందువులు-14
దొరికిన పెన్నిధి
ఫొటో కి కాప్షన్ 25
స్వతంత్ర్యం వచ్చింది
అక్షయపాత్ర – పుస్తక పరిచయం
సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీ – ఒక అప్డేట్
అలనాటి అపురూపాలు-1
వడదెబ్బ తగిలితే
నీతికి నిజానికి మధ్య సంఘర్షణ చూపించిన సోమర్సెట్ మామ్ నవల CAKES AND ALE
కొత్త చిగురు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®