Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా హీరో

[శ్రీ వకుళాభరణం రాంనరేశ్ కుమార్ రచించిన ‘నా హీరో’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

రంగులు పూసుకునే వాడు కాదుర హీరో
రక్తం చిందించిన అల్లూరి నా హీరో

బరితెగించే వాడు కాదుర హీరో
భారతి కొరకు బాంబులు వేసిన భగతు నా హీరో

నీతి లేనివాడు కాదుర హీరో
నిజాము నెదిరించిన కొమురం భీము నా హీరో

డూపు ఫైట్లు చేసేవాడు కాదుర హీరో
గెరిల్లా యుధ్ధంతో గుబులురేపిన శివాజీ నా హీరో

ప్రేమంటూ వెకిలిచేష్టలు చేసేవాడు కాదుర హీరో
అమ్మను ప్రేమించి ఉరి చుంబించిన అశ్ఫాకుల్లా నా హీరో

కాసుల కోసం కామకలాపాలు చూయించేవాడు కాదుర హీరో
దేశం కోసం గడ్డిరొట్టెలు తిన్న రాణాప్రతాపు నా హీరో

చరిత్రహీనుడు కాదుర హీరో
చరిత్ర సృష్టించిన సావర్కర్ నా హీరో

సొల్లు కబుర్లు చెప్పేవాడు కాదుర హీరో
సేవా నిరతిని చాటిన వాడే నా హీరో

విదేశీ ఉత్పత్తుల చాటేవాడు కాదుర హీరో
మన కడుపులు నింపే అన్నదాత నా హీరో

తుపాకి తోటి అడవుల కెల్లమనెవాడు కాదుర హీరో
సరిహద్దుల పహార కాసే జవాను నా హీరో

నా హీరో ఒక ఆదర్శం
నా హీరో ఒక ఉత్తేజం
నా హీరో ఒక ఉల్లాసం
నా హీరో ఒక ఉద్గంథం
నా హీరో ఒక యుగద్రష్ట
నా హీరో నా సర్వస్వం

Exit mobile version