Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా చెలి

దివి సీమ నుండి
దిగి రావే ఓ చెలీ

మబ్బు పల్లకి ఎక్కి
జాబిలి దిండు వేసి

నువు గల గలా నవ్వితే
సెలయేరు అనుకున్నా
కిల కిలా నవ్వితే
పిక పికలు అనుకున్నా

కాలు నేలపై మోపకు
గరకు గరిక గుచ్చుకొనేను
నీ పాదాలు నా చేతిలో ఉంచు

నువ్వొస్తావని నాకు
పిల్ల తెమ్మెర ముందుగా
కబురు తెచ్చేను
నీ సిగ సౌగంధం
మోసుకొని తెస్తూ

దివి నుండి భువికి
దిగి రావే ఓ చెలీ
శిశిరాన వసంతం
చిగురించేను..

Exit mobile version