Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రముఖ రచయిత మంజరి గారికి ఎం.వి.వి. సత్యనారాయణ స్మారక పురస్కారం – వార్త

ప్రముఖ రచయిత మంజరి (గంధం నాగేశ్వరరావు) గారికి, ప్రసిద్ధ రచయిత స్వర్గీయ ఎం.వి.వి. సత్యనారాయణ స్మారక పురస్కారం లభించింది. మంజరి గారు ఈ సాహితీ పురస్కారాన్ని 5-8-2025 తేదీన అందుకున్నారు.

ఈ సందర్భంగా మంజరి గారు ప్రసంగిస్తూ, “ఈ సమావేశంలో చెప్పుకోవలసిన గొప్ప విషయం ఎం.వి.వి. గారి కుటుంబం సంస్కారం” అని అన్నారు. “ఆయన తన జీవితమంతా కుటుంబ అభివృద్ధికి పాటుపడ్డారు. ఎం.వి.వి. కృషిని నమ్మిన వ్యక్తి. కుటుంబ పోషణ కోసం అర్ధరాత్రి వరకూ మేల్కొని రచనలు చేసిన వ్యక్తి. అలాంటి మనిషి పేరిట సాహితీ పురస్కారం నాకివ్వడం వారి కుటుంబ సభ్యుల విశాల హృదయానికి తార్కణం” అని మంజరి పేర్కొన్నారు.

Exit mobile version