[శ్రీ శిరిప్రసాద్ రచించిన ‘ముందుకు సాగండి!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఆగుతారా, సాగుతారా, మీ యిష్టం!
ఆగిపోతే ముందుకు సాగిపోడం కష్టం!
ఆగుతూ, ఆగుతూ పోయినా,
గమ్యం చేరచ్చు ఏనాటికైనా!
పూర్తిగా ఆగిపోతే,
గమ్యం చేరలేము ఎప్పటికైనా!
ఆయాసపడే జీవులకి
అష్టకష్టాలు ఎదురైతే,
కష్టపడే కార్యదక్షులకు
అష్టైశ్వర్యాలు ఎదురొస్తాయి!
నెమ్మదిగా సాగితే,
చేరుకోడం తథ్యమే!
వేగం పెంచితే,
ముందుగా చేరుతాం!
అడ్డదారులు కావు మనవి;
దూరమైనా రాచబాట మనది!
విషపూరిత జనాల్ని దాటుకుంటూ,
సానుకూల మిత్రులతో ముందుకుపోదాం!
పోయే కొద్దీ మంచిని వెతుకుదాం –
చెడుని వెనక్కి నెట్టుకుంటూ!