సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

    ఈ మధ్యన పుస్తక సమీక్ష అనేది స్థలం లేక బాగా బక్కచిక్కిపోయింది. స్థలం లభించినచోట పుస్తక పరిచయంగా మారిపోయింది. అడపాదడపా కొంచెం లోతుకు వెళ్లినా అది పుస్తకంలోని ముందుమాటల్ని దాటి ముందుకు వెళ్లడం అడుదై పోయింది. ఆయినప్పటికీ సంచిక సమీక్షలు లోతుగా ఉంటాయి. ఈ సమీక్ష కూడా లోతైనది. అధిక్షేప రచనల గురించిన వివరణ బాగుంది. పుస్తకం పట్ల ఆసక్తిని మాత్రమే కాక ఆలోచనని కూడా కలిగించేలా రాయడం ఒక కళాత్మక శాస్త్రం. ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది ఈ సమీక్షా వ్యాసం

  2. 2

    విజయ శ్రీముఖి

    ఏ ఫైల్ మీద సంతకం చేయాలన్నా తనని అడగమన్న భర్తతో శారద చెప్పిన సమాధానం ఆలోచించగల సామర్థ్యం ఉన్న ప్రతి స్త్రీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించింది!
    “మున్సిపాలిటీ” అనే పదాన్ని కొంతమంది కించపరచడానికి పర్యాయపదంగా వాడటం నేను విన్నాను. కానీ, శ్రీ.దీర్ఘాసి విజయభాస్కర్ గారు మున్సిపాలిటీని “అమ్మ”తో పోల్చడం వారి చిత్తశుద్ధికి, అవగాహనారీతికి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను!
    సుశీలమ్మగారి సమీక్ష, కథల పరిచయం చదివిన తర్వాత పుస్తకం మొత్తం చదవాలనే ఆసక్తి కలిగింది. సామాజిక సమస్యలను సాదృశ్యంగా చూపించిన రచయితగారికి, సమీక్షించిన వారికి మనఃపూర్వక అభినందనలు, నమస్సులు!
    *విజయశ్రీముఖి*

  3. 4

    మధు చిత్తర్వు

    చాలా మంచి సమీక్ష.ఈ కథలు చదవాలి అని ఆసక్తి రేకెత్తించే విధంగా వుంది.

  4. 5

    C.Suseela

    సుశీలగారూ, ఇప్పుడే ‘మున్సిపల్ కథలు, డా.ధీర్ఘాశి విజయ భాస్కర్ , విశ్లేషణ చదివాను. కడుపులో దేవినట్లైయింది. గుండెను నులి పెట్టి తిప్పినట్లైయింది.
    నేటి సమాజం, నేటి రాజకీయాలు మనుషుల తత్వాలు, ట్రిక్స్, ( తెలుగు పదం ఉపాయాలు , కాదు కుతంత్రాలు) వీటికి దర్పణం ఈ కథలన్నీ.
    విజయ భాస్కర్ గారు గట్టు పై నిలబడి చూసి రాసినవి కావు. స్వయంగా అనుభవించినవి, తన కళ్ళారా చూసినవి, తన ఆదర్శాలు తన కళ్ళముందె నిస్సహాయంగా తలవంచి, చేతులు కట్టి నిలబడినపుడు వారి మానసిక వేదన మాటల్లొ చెప్పలేము.
    రాజకీయాల విశ్శరూపాన్ని దర్శింపజేశారు. మీరూ మీ విశ్లేషణ రూపంలొ ఆ విశ్వరూపాన్ని చూపించారు.
    నాకు ఇది చదువుతూంటె రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి ఒకటి ఒకరోజు సి.ఎమ్. రెండవది నంబరు 1.
    ఒక్క రోజు సి.ఎమ్.గా ఎన్ని మంచి పనులు చేస్తాడు. ఆ ఒక్క రోజుకూడా వాటిని భరించలేని నాయకులు ఏ విధంగా తల్లి .దండ్రిని బలిచేస్తారు, ఆయననే చంపడానికి ప్రయత్నిస్తారు.
    నంబరు.1. సి.ఎమ్ ప్రజలకు న్యాయం చేయాలి, అధికారం వారి చేతుల్లొ ఉండాలి, Democracy of the People, by the People, for the People’ Recall బిల్లు ప్రవేశపెడితె, ఆ బిల్లు approval కాకపోవటమే కాదు, అధికారం నుంచి సి.ఎమ్ ను దించేస్తారు.
    ఒక్కొక్క కథ చదువుతుంటె బాధ, నిస్సహాయత! అధికారంలొ ఉండిన వ్యక్తే ఏమి చేయలేకపోయారంటె!!😰😰😰.
    ఎత్తుకు పై ఎత్తు. ఈ బుద్దిని ప్రజలకు మేలు చేయటానికి ఉపయోగిస్తె ‘సర్వేజన సుఖినోభవంతు ‘
    ‘లాలన – పాలనా’ సూపర్. అలాంటి వారు ఒక్కరైన ఉన్నారా!!!
    దీనికి పరిహారం ఉందా!!??? అంతా నెలసమమై మళ్ళీ కొత్తగా చిగురించాలి. చరిత్రలో ఎన్ని క్రాంతుల గురించి చదివాం. ఏమైంది చివరికి!!!😭😭😭.
    డా.ధీర్ఘాశి విజయ భాస్కర్ గారికి ఏం చెప్పాలి!!🙏🙏🙏
    కళ్ళను తెరిపించె , నేటి సమాజానికి ప్రతిరూపమైన కథలను పరిచయం చాలా లోతుగా విశ్లేషించారు, పరిచయం చేశారు.మీకు మనఃపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏.

  5. 6

    vizaibhaskar

    డాక్టర్ సుశీల గారు మున్సిపల్ కథల ఫై చేసిన సమీక్ష చాలా సంతోషాన్ని కలిగించింది . సాధారణం గా సమీక్ష అంటే కథను మళ్ళీ చెబుతుంటారు . సుశీల గారు ఆ పని చేయలేదు కధ పుట్టిన నేపధ్యం , దానిలక్ష్యం,పాత్రల స్వభావం ,వాటి ప్రయోజనం , రచయిత అంతరంగం , ఆశయం – వీటిని ప్రస్తావిస్తూ – కధల్లోని సాహిత్య ,సామాజిక, వైయక్తిక అంశాల్ని చక్కగా స్పృశించారు . మంచి సమీక్ష చేశారు .
    ధన్యవాదాలు .

  6. 7

    శీలా సుభద్రాదేవి

    ప్రతీ కార్యాలయంలోనూ కొందరి స్వార్థం, సంకుచితం,పనిపట్ల అశ్రద్ధ మొదలైన వాటివలన అనేకానేక అవకతవకలు జరగటం సాధారణమే.అయితే వాటికి బలి అయ్యేది మాత్రం బలహీన వర్గాలు,అమాయకులు.సమర్థత ఉన్న అధికారులు ఈ విధంగా వాటిని ధైర్యంగా సాహిత్యం లోకి తీసుకు రాగలిగితే అన్నీ వెలుగులోకి వస్తాయి.అటువంటి సమర్థతగల రచయిత డా.విజయభాస్కర్ గారి కథలసంపుటిని మీరు పాఠకులకు అవగాహన కలిగేలా సమీక్షించారు.మీకూ,రచయిత విజయభాస్కర్ గారికి అభినందనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!