(తతః ప్రవిశ త్యలఙ్కృతః సహర్షః సిద్ధార్థకః.)
జలధి జలదణీలో కేసవో కేసిఘాదీ
జ అది అ జణదిట్ఠీ చందమా చందఉత్తో
జ అది జ అణకజ్జం జావ కాఊణ సవ్వం
పడిహదపరపక్ఖా అజ్జ చాణక్కణీది. – (1)
[జయతి జలదనీలః కేశవః కేశిఘాతీ,
జయతి చ జనదృష్టీ చన్ద్రమా శ్చన్ద్రగుప్తః,
జయతి జయనకార్యం యావత్ కృత్వా చ సర్వం
ప్రతిహతపరపక్షా ఆర్యచాణక్యనీతిః॥]
జలదనీలః=మేఘం వలె నల్లనివాడూ, కేశిఘాతీ=కేశి రాక్షసుణ్ణి చంపినవాడూ (అయిన), కేశవః=విష్ణువు, జయతి=జయశీలుడవుతున్నాడు. జనదృష్టీ+చన్ద్రమా+చన్ద్రగుప్తః=జనుల కన్నులకు చంద్రుడైన చంద్రగుప్తుడు, చ=కూడా, జయతి=జయశీలుడవుతున్నాడు, జయన+కార్యం=జయానికి అవసరమైన (సేనా కల్పనాది) పని, యావత్+సర్వం+చ+కృత్వా=అంతటినీ సంపూర్ణంగా చేసి, ప్రతిహత+పరపక్షా=దెబ్బతీయబడిన శత్రుపక్షం కలిగిన (శత్రుపక్షాన్ని దెబ్బతీసి), ఆర్యచాణక్యనీతిః=పూజ్య చాణక్యుని రాజనీతి, జయతి=జయశీలంతో ఉన్నది.
మాలిని. న – న – మ – య – య గణాలు.
దావ చిరస్స కాలస్స పిఅవఅస్సం సమిద్ధత్థఅం పేక్ఖామి. (పరిక్రమ్య అవలోక్య చ) ఏసో మే పి అవఅస్సఓ సమిద్ధత్థఓ ఇదో ఎవ్వ ఉప సప్పది. జావణం ఉపసప్పామి.
(తావచ్చిరస్య కాలస్య ప్రియ వయస్యం సమిద్ధార్థకం పశ్యామి. ఏష మే ప్రియవయస్యః సమిద్ధార్థకః, ఇత ఏ వో పసర్పతి. యావ దేన ముపసర్పామి.)
తావత్+చిరస్య+కాలస్య=అంత చిరకాలానికి, ప్రియ+వయస్యం+సమిద్ధార్థకం=ఆప్తమిత్రుడు సమిద్ధార్థకుడిని, పశ్యామి=చూస్తున్నాను. (పరిక్రమ్య=ముందుకు నడిచి, అవలోక్య+చ=చూసిన మీదట) ఏషః+మే+ప్రియ+వయస్యః+సమిద్ధార్థకః=ఇదుగో నా ఆప్తమిత్రుడు సమిద్ధార్థకుడు, ఇతః+ఏవ+ఉపసర్పతి=ఇటే వస్తున్నాడు. యావత్+ఏవ+ఉపసర్పామి=నేను దగ్గరగా వెడుతున్నాను.
(ప్రవిశ్య)
సందావే తారేసాణం గేహూసవే సుహాఅత్తాణం
హిఅఅట్ఠిదాణం వివాహ విరహే మిత్తాణం దూణన్ది. – (2)
(సన్తాపే తారేశానాం, గేహోత్సవే సుఖాయమానానామ్
హృదయస్థితానాం విభవా విరహే మిత్రాణాం దూనయన్తి॥)
సన్తాపే=విషాద సమయంలో, తారేశానాం=చల్లదనం ఇచ్చే చంద్రులు గాను, గేహ+ఉత్సవే=ఇంట జరిగే వేడుకలలో, సుఖాయమానానామ్=సుఖం కలిగించే వారు గానూ, హృదయ+స్థితానాం=మనస్సులో నిలిచే, మిత్రాణాం=స్నేహితుల (యొక్క), విరహే=ఎడబాటులో, విభవాః=సంపదలు,దూనయన్తి=బాధ కలిగిస్తాయి.
ఆర్య.
సుదం చ మఏ మలఅ కేదుకడయాదో పిఅవఅస్సఓ సిద్ధత్థఓ ఆఅదోత్తి. ణం అణ్ణేసామి. (ఇతి పరిక్రామతి; విలోక్య) ఏసో సిద్ధేత్థఓ.
(శ్రుతం చ మయా మలయ కేతుకటకాత్ ప్రియవయస్యః సిద్ధార్థక ఆగత ఇతి. ఏన మన్వేషయామి. — ఏష సిద్ధార్థకః)
మలయకేతుకటకాత్=మలయకేతువు శిబిరం నుంచి, ప్రియవయస్యః+సిద్ధార్థకః=ప్రియమిత్రుడు సిద్ధార్థకుడు, ఆగతః+ఇతి=వచ్చాడని, మయా+శ్రుతం+చ=నాకు వినికిడైంది. ఏనం+అన్వేషయామి=వాడిని వెతుకుతున్నాను. (ఇతి=అని, పరిక్రమ్య=ముందుకు నడిచి, విలోక్య=చూసి) – ఏషః+సిద్ధార్థకః=ఇదుగో సిద్ధార్థకుడు!
(ఉపసృత్య) కహం సమిద్ధత్థఓ! అవి సుహం పి అవఅస్సస్స?
(కథం సమిద్ధార్థకః! అపిసుఖం ప్రియవయస్యస్య?)
(ఉపసృత్య=సమీపించి), కథం=ఎలాగ! సమిద్ధార్థాకుడే! అపిసుఖం+ప్రియవయస్యస్య=(నా) ప్రియమిత్రుడికి క్షేమమే కద! (కుశలమేనా?)
(ఇత్యన్యోన్య మాలిఙ్గతః)
(ఇతి=అని, అన్యోన్యం+ఆలిఙ్గతః=ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.)
కుదో సుహం, జేణ తుమం చిరప్పవాస పచ్చాగదో వి అజ్జ ణ మే గేహం ఆ అచ్ఛసి?
(కుతః సుఖం, యేన త్వం చిర ప్రవాస ప్రత్యాగతో ఽప్యద్య న మే గేహ మాగచ్ఛసి?)
కుతః+సుఖం=సుఖమనేదెక్కడ?, యేన+త్వం=ఏ నువ్వైతే, చిరప్రవాస+ప్రత్యాగతః+అపి=చాలాకాలం పాటు వేరే చోట ఉండిపోయి తిరిగి వచ్చినా, అద్య+మే+గేహం+ న+ఆగచ్ఛసి =ఇవాళ మా యింటికి రావడం లేదు (ఇక, సుఖం ఏమిటి?).
పసీదదు వఅస్సో, దిట్ఠమేత్తో ఎవ్వ అజ్జ చాణక్కేణ ఆణత్తోహ్మి, యథా ‘సిద్ధత్థఅ, గచ్ఛ – ఎదం పిఓ దన్తం దేవస్స చన్దసిరిణో ణివేదేహి‘ త్తి తదో ఏదస్సణి వేదిఅ ఎవ్వం అణుభూద పత్థివ ప్పసాదో అహం పిఅవఅస్సం పేక్ఖిదుం తుహ ఎవ్వ గేహం చలిదోహ్మి।
(ప్రసీదతు వయస్యః. దృష్ట మాత్ర ఏవ ఆర్య చాణక్యేన ఆజ్ఞప్తో ఽస్మి యథా – ‘సిద్ధార్థక, గచ్ఛ. ఇమం ప్రియోదన్తం దేవస్య చన్దశ్రియః నివేదయ‘ ఇతి. తత ఏతస్య నివేద్యైవమనుభూత పార్థివ ప్రసాదో ఽహం ప్రియవయస్యం ప్రేక్షితుం తవైవ గేహం చలితోఽస్మి॥)
వయస్యః+ప్రసీదతు=మిత్రుడు మన్నించాలి గాక! దృష్టమాత్రః+ఏవ=చూసినదే తరువాయిగా, ఆర్య చాణక్యేన=పూజ్య చాణక్యుని చేత, ఆజ్ఞప్తః+అస్మి=ఆదేశింపబడ్డాను; యథా=ఏమని అంటే – ‘సిద్ధార్థక, గచ్ఛ=వెళ్ళు. ఇమం+ ప్రియ+ఉదన్తం=ఈ ఇంపైన వార్తను, దేవస్య+చన్దశ్రియః=చంద్రశ్రీ దేవరకు, నివేదయ=మనవి చెయ్యి’ ఇతి=అని. తతః=ఆ మీదట, ఏతస్య+నివేదయ=వానికి (చంద్రశ్రీకి) విన్నవించి, అనుభూత+పార్థివప్రసాదః+అహం=ప్రభువు వారి అనుగ్రహం పొందిన నేను, ప్రియవయస్యం+ప్రేక్షితుం=(ఇక) ప్రియ మిత్రుణ్ణి చూడడానికి, తవ+గేహం+ఏవ=నీ యింటికే, చలితః+అస్మి=కదిలాను (బయలుదేరాను).
వఅస్స, జది మే సుణిదవ్వం తతో క హేహి. కిం తం పిఅం జం పిఅదంసణస్స చందసిరిణో ణివేదినం.
(వయస్య, యది మే శ్రోతవ్యం తతః కథయ కిం తత్ ప్రియం ప్రియదర్శనస్య చన్ద్రశ్రియో నివేదితమ్.)
వయస్య=మిత్రమా, యది+మే+శ్రోతవ్యం=నేను వినదగినదే అయితే, తతః=అప్పుడు, ప్రియదర్శనస్య+చన్ద్రశ్రియః+నివేదితమ్=చూపరులకు ప్రియం కలిగించే చంద్రగుప్తునికి నివేదించిన, కిం+తత్+ప్రియం=ఆ ఇష్ట వార్త ఏమిటో, కథయ=చెప్పు.
వఅస్స, కిం తుహ వి అక హిదవ్వం అత్థి? తాణిసామేహి అత్థి దావ చాణక్క ణీది మోహిదమదిణా మలఅకేదుహదఏణ ణిక్కాసిఅ రక్ఖసం హదా చితవమ్మప్పముహా ప్పహాణా పంచపత్థివా। తదో అసమిక్ఖకారీ ఏసో దురాఆరోత్తి ఉజ్ఝిఅ మలఅకేదుహత అభూమిం కుసలదాఏ భఅవిలోల సేస సైణిక పరివారేసు సభ అం ప్పత్థిదేసు పాత్థివేసుసకం విసఅం ణివ్విణ్ణహి అఏసు సఅలసామం తేసు బద్దభట పుణ్ణదత్త డింగురాద బలఉత్త రాఅసేణ భాగురాఅణ రోహినక్ఖ విజఅవమ్మపము హేహిం సంజమిఆ గిహీదో మలఅకేదు.
(వయస్య, కింత వా ప్యకథితవ్య మస్తి? తన్ని శామయ. అస్తి తావత్ – చాణక్యనీతి మోహితమతినా మలయకేతు హతకేన నిష్కాస్య రాక్షసం హతా శ్చిత్రవర్మ ప్రముఖాః ప్రధానాః పఞ్చ పార్థివాః। తతో ఽసమీక్ష్యకా ర్యేష దురాచార ఇత్యుజ్ఘీత్వా మలయ కేతుహతక భూమిం కుశలతయా భయవిలోల శేష సైనిక పరివారేషు సభయం ప్రస్థితేషు పార్థివేషు సక్వం విషయం, నిర్విణ్ణహృదయేషు సకలసామన్తేషు, భద్రభట పురుదత్త డిఙ్గురాత బలగుప్త రాజసేన భాగురాయణ రోహితాక్ష విజయవర్మ ప్రముఖైః సంయమ్య గృహీతో మలయకేతుః.)
వయస్య=మిత్రమా, తవ+అపి+కిం+అకథితం+అస్తి=నీకు కూడా చెప్పదగనిది అంటూ ఉంటుందా? తత్+నిశామయ=అదేమిటో విను. అస్తి+తావత్=జరిగినదేమిటంటే – చాణక్యనీతి+మోహిత+మతినా=చాణక్యుని రాజనీతి చేత వంచింపబడిన మనస్సు గలవాడైన, మలయకేతు+హతకేన=చంద్రకేతుగాడి చేత (అతడేమి చేశాడంటే), రాక్షసం+నిష్కాస్య=రాక్షసమంత్రిని బహిష్కరించి, చిత్రవర్మ+ప్రముఖాః=చిత్రవర్మ మొదలైన, ప్రధానాః+పఞ్చ పార్థివః=ముఖ్యులైన ఐదురుగు రాజులు, హతాః=చంపబడ్డారు. తతః=ఆ పైని, – ఏషః+దురాచారః=వీడు దుర్మార్గుడు, అసమీక్ష్యకారీ=ఆలోచన లేకుండా పని చేసేవాడు, ఇతి+ఉజ్ఘీత్వా=అని విడిచివేసి, మలయకేతు+హతక+భూమిం=మలయకేతుగాడి రాజ్యప్రాంతాన్ని, కుశలతయా=మిక్కిలి నేర్పుతో, భయవిలోల+శేషసైనిక+పరివారేషు=భయంతో వికలమైపోయిన మిగిలిన సైన్యం, పరివారం గల, సభయం+ప్రస్థితేషు+పార్థివేషు=భయంతో తమ తమ ప్రాంతాలకు వెళ్ళడానికి, మిగిలిన రాజులు ప్రయాణం కాగా – నిర్విణ్ణహృదయేషు+సకలసామన్తేషు+సక్వం+విషయం(ప్రస్థితేషు)=నిర్ఘాంతపోయిన సామంతులందరూ తమ తమ ప్రదేశాలకు ప్రయాణం కట్టగా, భద్రభట+పురుదత్త+డిఙ్గురాత+బలగుప్త+రాజసేన+భాగురాయణ+రోహితాక్ష+విజయవర్మ+ప్రముఖైః=ఈ పేర్లు గల ముఖ్యుల చేత, మలయకేతుః+సంయమ్య+గృహీతః=మలయకేతు బంధించి పట్టుకోబడ్డాడు.
వయస్య, భద్దభటప్పముహా కిల దేవస్స చందఉత్తస్స అవరత్తా మలఅకేదుం సమస్సిదేత్తి లోఏ మంతిఅది. తా కిం ణిమిత్తం కుకవికిధణా డ అస్స విఆ అణ్ణం ముహే అణ్ణం ణివ్యహణే.
(వయస్య, భద్రభట ప్రముఖాః కిల దేవస్య చన్ద్రగుప్తస్య అపరక్తా మలయకేతుం సమాశ్రితా ఇతి లోకే మన్త్ర్యతే. తత్ కిం నిమిత్తం కుకవికృతనాటక స్యేవ అన్యన్ముఖేఽన్యన్నిర్వహణే)
వయస్య=మిత్రమా, భద్రభట+ప్రముఖాః+కిల=భద్రభటుడు మొదలైన వాళ్ళయితే, దేవస్య+చన్ద్రగుప్తస్య=దేవర చంద్రగుప్తునికి, అపరక్తాః=వ్యతిరేకులయ్యారు, మలయకేతుం+సమాశ్రితాః+ఇతి=మలయకేతుణ్ణి ఆశ్రయించుకున్నారని, లోకే+మన్త్ర్యతే=లోకంలో అనుకుంటున్నారు. తత్=అట్టి స్థితిలో, కుకవి+కృత+నాటకస్య+ఇవ=అసమర్థ కవి రచించిన నాటకం (యొక్క – లో) వలె – ముఖే+అన్యత్=మొదట ఒక తీరుగానూ, నిర్వహణే+అన్యత్=చివరకు మరొకటి (తటస్థించినదేమి?)
వఅస్స, దైవగదీఏ విఅ, అసుణీదగదీఏ ణమో చాణక్క ణిదీఏ.
(వయస్య, దైవగత్యా ఇవ అశ్రుతగ త్యై నమ శ్చాణక్యనీత్యై)
వయస్య=మిత్రమా, దైవగత్యా+ఇవ=విధి నడకతో వలె, అశ్రుతగత్యై+చాణక్యనీత్యై=ఊహకందని విధంగా నడిచే చాణక్య నీతికి, నమః=నమస్కారం.
తదో తదో
(తతస్తతః)
తతః+తతః= తరువాత… తరువాత
తదో పహుది సారసాహాణసమేదేణ ఇదో ణిక్కమ్మిఅ ఆజ్జచాణక్కేణ పడివణ్ణం సఅలరాఆలో అసహిఅం అసేసం మ్లేచ్ఛబలం.
(తతః ప్రభృతి సారసాధనసమేతే నేతో నిష్క్రమ్యార్య చాణక్యేన ప్రతిపన్నం సకల రాజలోక సహిత మశేషం మ్లేచ్ఛబలం.)
తతః+ప్రభృతి=అది మొదలు, సార+సాధన+సమేతేన=ప్రధాన సాధనాలతో కూడికొని ఉన్న, సకల+రాజలోక+సహితం=స్వర్వరాజ సమూహాలతో కూడివున్న, అశేషం+మ్లేచ్ఛబలం=మ్లేచ్ఛుల సైన్యం మొత్తంగా, ఇతః+నిష్క్రమ్య=ఇటు నిష్క్రమించి, ఆర్యచాణక్యేన+ప్రతిపన్నం=పూజ్య చాణక్యుడిని (చేత) పొందబడ్డాయి (చేరుకున్నాయి).
వఅస్స కహింతం?
(వయస్య, కుత్ర తత్?)
వయస్య=మిత్రమా, కుత్ర+తత్=ఎక్కడది?
జహిం ఏదే –
ఆదిసఅ గురుఏణ దాణదప్పేణ దంతీ
సకలజలదణీలా ఉబ్భమంతో నదంతి;
కస పహర భఏణ జాఆ కంపోత్తరంగా
గిహిద జఅణ సద్దా సంపఆంతే తురంగాః. – (3)
(యత్రైతే) –
(అతిశయ గురుకేణ దానదర్పేణ దన్తినః
సజలజలదనీలా ఉద్భ్రమన్తో నదన్తి;
కశాప్రహారభయేన జాతకమ్పోత్తరఙ్గాః
గృహీత జయన శబ్దాః సంపతన్తి తురఙ్గాః.)
యత్ర+ఏతే=ఎక్కడైతే ఇవి (జంతువులు), అతిశయగురుకేణ+దాన+దర్పేణ=చాలా ఎక్కువగా ఉన్న మదజలాల గర్వంతో, దన్తినః=ఏనుగులు, సజలజలద+నీలాః=నీరు నిండిన మేఘాల వలె నల్లనివి, ఉత్+భ్రమన్తః=ఎగిరెగిరి పడుతూ, నదన్తి=ఘీంకారాలు చేస్తున్నాయి.
తురఙ్గాః=గుర్రాలు, కశా+ప్రహార+భయేన=కొరడా దెబ్బలు మీద పడతాయనే భయంతో, జాతకమ్ప+ఉత్తరఙ్గాః=శరీరంపై జలదరింపుల తరగలు కలవయ్యాయి, గృహీత+జయన+శబ్దాః=జయధ్వానాలను స్వీకరించి, సంపతన్తి=గుంపుకడుతున్నాయి (అక్కడ మ్లేచ్ఛసైన్యాలు చాణక్యుని చేరుకున్నాయి అని అన్వయం).
మాలిని- ? (పాదాలలో గణాల అమరిక తేడా ఉంది. ఉపజాతి కావచ్చు. చూడాలి).
వఅస్స, ఏదం దావ చిట్ఠదు. తహా సవ్వలో అపచ్చక్ఖం ఉజ్ఝిఆహిఆరో చిట్ఠిఅ అజ్జ చాణక్కొ కిం ఉడో వితం ఎవ్వ మంతిపదం ఆరూఢో?
(వయస్య, ఏత త్తావ తిష్ఠతు. తథా సర్వలోక ప్రత్యక్ష ముజ్ఝి తాధికారః స్థి త్వార్య చాణక్యః కిల కిం పున రపి త దేవ మన్త్రపద మారూఢః?)
వయస్య=మిత్రమా, ఏతత్+తావత్+తిష్ఠతు=ఇది అలా ఉండనియ్యి; తథా=ఆ విధంగా, సర్వలోక+ప్రత్యక్షం=ప్రజలందరికీ తెలిసి, ఉజ్ఝిత+అధికారఃస్థిత్వా=అధికారం విడిచి నిలిచి ఉన్న, ఆర్యచాణక్యః+కిల=చాణక్యుడేనా? పునరపి=మళ్ళీ, తత్+ఏవ+మన్త్రపదం=అదే మంత్రి పదవిని, కిం+ఆరూఢః=అధిష్టించాడా ఏమి?
అఇమద్ధోసి దాణీం తుమం, జో అమచ్చ రక్ఖసేణ విఅణవగాహి అపువ్వం అజ్జచాణక్క చరిదం అవగాహిదు మిచ్ఛసి.
(అతిముగ్ధో సీదానీమ్ త్వం; యతో ఽమాత్య రాక్షసేనా ప్యనవగాహితపూర్వ మార్య చాణక్యస్య చరిత మవగాహితు మిచ్ఛసి.)
ఇదానీమ్=ఇప్పుడు, త్వం=నువ్వు, అతిముగ్ధః+అసి=చాలా అమాయకుడిలా తోస్తున్నావు; యతః=ఎందుకంటే,- అమాత్య+రాక్షసేన+అపి=రాక్షసమంత్రి వంటి వాడికి కూడా, అనవగాహిత+పూర్వం=తెలియజాలకపోయిన, ఆర్య+చాణక్యస్య+చరితం=పూజ్య చాణక్యుడి నడవడిని, అవగాహితుం+ఇచ్ఛసి=అర్థం చేసుకోవాలని కోరుతున్నావు.
వఅస్స అమచ్చరక్ఖసో సంపదం కహిం?
(వయస్య, అమాత్య రాక్షసః సాంప్రతం కుత్ర?)
వయస్య=మిత్రమా, సాంప్రతం=ప్రస్తుతం, అమాత్య+రాక్షసః+కుత్ర=రాక్షసమంత్రి ఎక్కడ (ఉన్నాడు?)
తస్సిం భ అవిలోలే పట్టమాణే మలఅకేదుకడ ఆదో ణిక్కమిఅ ఉదుంబరణామహేఏణ చరేణ అనుసంధిజ్జమాణో ఇదం పాడలీపుత్తం ఆఅదో త్తి అజ్జ చాణక్కస్స ణివేణిదం.
(తస్మిన్ భయవిలోలే వర్ధమానే మలయకేతుకటకా న్నిష్క్రమ్య ఉదుమ్బర నామధేయేన చరే ణానుసన్ధీయమాన ఇదం పాటలీపుత్ర మాగత ఇ త్యార్య చాణక్యస్య నివేదితమ్.)
తస్మిన్=ఆ, భయ+విలోలే+వర్ధమానే=భయంతో కూడిన కలవరపాటుతో ఊగిసలాడే, మలయకేతు+కటకాత్=మలయకేతు శిబిరం నుంచి, నిష్క్రమ్య=మరలిపోయి, ఉదుమ్బర+నామధేయేన+చరేణ=ఉదుమ్బరుడనే చారుడి చేత, అనుసన్ధీయమానః=జాగ్రత్తగా కనిపెట్టబడుతూ – ఇదం+పాటలీపుత్రం=ఇదే పాటలీపుత్రాన్ని (నికి), ఆగతః+ఇతి= వచ్చాడని, ఆర్యచాణక్యస్య+నివేదితమ్=పూజ్య చాణక్యునికి తెలియజేయడమైనది.(ఉదుమ్బరుడి ద్వారా తెలిసింది).
వఅస్స, తహా ణామ అమచ్చరక్ఖసో ణందరజ్జ పచ్చాణఅణే కిదవ్వవసాఓ ణిక్కమిఆ సంపదం అకిదత్థో పుణోవి ఇమం పాడలీఉత్తం ఆఅదో ఎవ్వ.
(వయస్య, తథా నామామాత్య రాక్షసో నన్దరాజ్య ప్రత్యానయనే కృత వ్యవసాయో నిష్క్రమ్య సాంప్రత మకృతార్థః పున ర పీదం పాటలీపుత్ర మాగత ఏవ।)
వయస్య=మిత్రమా, తథానామ=అలాగంటే, అమాత్యరాక్షసః=రాక్షసమంత్రి, నన్దరాజ్య+ప్రత్యానయనే=నందరాజ్యాన్ని తిరిగి సంపాదించడంలో, కృత+వ్యవసాయః+నిష్క్రమ్య=ప్రయత్నం చేసి (ఇక్కడి నుండి మరలిపోయి), సాంప్రతం=ఇప్పుడు, అకృతార్థః=విఫలమనోరథుడై, పునః+అపి=మళ్ళీ కూడా, ఇదం+పాటలీపుత్రం=ఇదే పాటలీపుత్రానికి, ఆగతః+ఏవ=వచ్చేశాడే!!
వఅస్స. తక్కేమి చందణదాస సిణేహేణేత్తి.
(వయస్య, తర్కయామి చన్దనదాసస్య స్నేహేనేతి.)
వయస్య=మిత్రమా, చన్దనదాసస్య+స్నేహేన+ఇతి+తర్కయామి=చందనదాసుతో ఉన్న స్నేహమని అనుకుంటున్నాను (భావిస్తున్నాను).
వఅస్స, చందణదాసస్స మోక్షం విఆపేక్ఖామి.
(వయస్య, చన్దనదాసస్య మోక్షమివ ప్రేక్షే.)
వయస్య=మిత్రమా, చన్దనదాసస్య+మోక్షం+ఇవప్రేక్షే=చందనదాసుని విడిపించడం కోసంగా కనిపిస్తోంది (నాకు).
కుదోసే అధణస్స మోక్ఖో? సోక్ఖు సంపదం ఆజ్జచాణక్కస్స ఆణత్తీఏ దువేహిం అమ్మేహిం వజ్ఝట్ఠాణం పవేసిఅ వావాద ఇదవ్వో
(కుతో ఽస్యాధన్యస్య మోక్షః? న ఖలు సామ్ప్రత మార్య చాణక్య స్యాజ్ఞప్త్యా ద్వాభ్యా మావాభ్యాం వధ్యస్థానం ప్రవేశ్య వ్యాపాదయితవ్యః.)
అస్య+అధన్యస్య+మోక్షః+కుతః=ధనం ఏమీ లేని అతడి విడుదల ఎలా సాధ్యం? సామ్ప్రతం= ఇప్పుడు, ఆర్య+చాణక్యస్య+ఆజ్ఞప్త్యా=పూజ్య చాణక్యుని ఆదేశంతో, ఆవాభ్యాం+ద్వాభ్యం=మన ఇద్దరి చేత, వధ్య+స్థానం+ప్రవేశ్య=శ్మశానానికి ప్రవేశపెట్టబడి, (చన్దనదాసః) =చందనదాసు, వ్యాపాదయితవ్యః=చంపబడవలసి ఉన్నది.
(సక్రోధమ్) కిం అజ్జచాణక్కస్స ఘాతఅ జణో అణ్నో ణత్థి, జేణ అహ్మే ఈరిసేసు ణిఓజిదా అదిణిసం సేసు?
(కి మార్యచాణక్యస్య ఘాతక జనో ఽన్యో నాస్తి యేన వయ మీదృశేషు నియోజితా అతినృశం సేషు నియోగేషు?)
(స+క్రోధమ్=కోపంతో), యేన+వయం=ఏ మన చేతనైతే, ఈదృశేషు=ఇటువంటి, అతి+నృశం+సేషు=మిక్కిలి పాపకరమైన, నియోగేషు=పనులలో, నియోజితా=నియమింపబడ్డామో, (ఆ పనులు చేయడానికి), ఆర్యచాణక్యస్య+ఘాతక+జనః=పూజ్య చాణక్యుల వారి తలవరులలో, అన్యః+నాస్తి+కిమ్=మరొకడెవడూ లేడా ఏమి?
వఅస్స, కో జీవలోఏ జీవిదుకామో అజ్జ చాణక్కస్స ఆణత్తిం పడిఊలేది. తా ఏహి, చండాల వేసధారిణా భవిఅ చందణదాసం అజ్ఝట్ఠాణం ణఏమ.
(వయస్య, కో జీవలోకే జీవితుకామ ఆర్యచాణక్య స్యాజ్ఞప్తిం ప్రతికూలయతి. తదేహి, చణ్డాల వేశధారిణౌ భూత్వా చన్దనదాసం వధ్యస్థానం నయావః.)
వయస్య=మిత్రమా, జీవలోకే+జీవితుకామ+కః+నామ=ప్రాణులు సంచరించే ప్రపంచంలో బతకాలనుకుంటున్న ఎవడు, ఆర్య+చాణక్యస్య+ఆజ్ఞప్తిం=పూజ్య చాణక్యుని ఆదేశాన్ని, ప్రతికూలయతి= వ్యతిరేకించగలడు? తత్+ఏహి=అందువల్ల – పద, చణ్డాల+వేశధారిణౌ+భూత్వాం=ఇద్దరం తలవరుల వేషాలు ధరించి, చన్దనదాసం=చందనదాసును, వధ్యస్థానం+నయావః=శ్మశానానికి నడిపిద్దాం.
(ఇత్యుభౌ నిష్క్రాన్తౌ)
(ఇతి=అని, ఉభౌ=ఇద్దరు, నిష్క్రాన్తౌ=వెళ్ళారు)
– ప్రవేశకః –
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సమకాలిక ప్రకటన
శ్రీ మహా భారతంలో మంచి కథలు-8
అలనాటి అపురూపాలు-2
తల్లివి నీవే తండ్రివి నీవే!-47
కాజాల్లాంటి బాజాలు-75: షాపింగ్ అంటే అదీ…
ఒక్క పుస్తకం-8
దుఖీ కీ పుకార్..
ముదిమి ఓ కొత్త జీవితమనే కవిత ‘వృద్ధాప్యం ఒడ్డున’
ఏరిన ముత్యాలు 12
అలనాటి అపురూపాలు-74
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®