Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మృత్యుంజయవై వర్ధిల్లు

[కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి గారు రచించిన ‘మృత్యుంజయవై వర్ధిల్లు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

న్నీటి సంద్రాన బతుకులు
కడలి కెరటాల నడకలు
కష్ట సుఖాలు వచ్చి పోయేవే గాని
కడ దాకా బ్రతుకున నిలువవే
పుట్టినప్పుడు పుటకరించు బంధము
పోయేటప్పుడు కానరాని చందము
కష్ట సుఖముల కానరాని మమతానుబంధాలు
కాటి పయనం నాడు రాల్చేటి కన్నీటి చుక్కలు
మాయ బతుకుల మర్మాలివియే
మర్మ మెరిగి పయనము చేయవే
మనిషి జన్మకు అర్థమ్ము కనవే
మాయ దారి రోదనలు మనకేలనే
మంచి మార్గ మొకటి ఎంచుకు పదవే
మరల మరల జననాలు మనకేల ననవే
ముక్తి కోరేటి భక్తిని ఎంచంగా నడవవే
ముక్కంటి మార్గాన్ని ఎంచుకొనవే
మృత్యుంజయునిగా వర్థిల్ల కదలవే.

Exit mobile version