Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూడో కన్ను

[సిసి టివి కెమెరా గురించి శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘మూడో కన్ను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చేతికి అందనంత
ఎత్తుమీద ఉంది
తలెత్తి చూస్తే తప్ప
కనిపించదెవ్వరికి

దారి ప్రక్కన దాక్కొంది
రహస్యంగా గమనిస్తుంది
ఎన్నో తెలిసిన నంగనాచి
చూస్తునట్లుగా తెలియదు

అన్నీ పసిగడుతుంది
అందర్ని కనిపెడుతుంది
విచిత్రాలు చూస్తుంది
చిత్రాలను తీస్తుంది

రెప్పవాల్చదు నిద్రపోదు
తలుపులేదు తాళం లేదు
లేదు అలయిక సొలయిక
చూపులతోనే సర్వం గస్తు

అనుభవించాలే తప్ప
కర్మను తప్పించుకోలేరు
పైన మేల్కొనే ఉంది
సమీక్షించే మూడో కన్ను

Exit mobile version