నిమి కుమారుడు మిథులుడు. యితనికి విదేహుడు, జనకుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. యితను నిర్మించినదే మిధిలానగరం. యితనికి ఉదాసువు అనే పుత్రుడు. అతనికి నందివర్దనుడు, అతనికి సుకేతువు, అతనికి దేవరాతుడు, అతనికి బృహద్రథడు, అతనికి మహవీర్యుడు, అతనికి సుధృతి, అతనికి ధృష్టకేతుడు, అతనికి హర్యాశ్వుడు, అతనికి మరువు, అతనికి ప్రతింథకుడు, అతనికి కృతరాయుడు, అతనికి దేవమీఢుడు, అతనికి విథృతుడు, అతనికి మహథృతి, అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, అతనికి హస్వరోముడు, అతనికి జనకుడు (సీరధ్వజుడు), అతనికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు.
ఈ జనకుడు సంతానం కొరకు యాగంచేసి యజ్ఞభూమి దున్నుతూ ఉండగా బంగారుపెట్టెలో ఓ బాలిక లభించింది. ఆమెకు సీత అనే పేరు పెట్టి పెంచాడు జనకమహరాజు. అధర్వణ వేదంలో సీత అంటే నాగేటిచాలు. పొలాన్ని దున్నుతున్నప్పుడు మట్టి పెళ్ళగింపబడి ఏర్పడే నాగేటిచాలుని సీత అంటారు. సీతభూములు అంటే దుక్కి దున్ని వ్వవసాయంచేయడానికి అనువుగా ఉన్న పంటభూములు అని అర్థం. అలా జన్మించిన సీత శివదనుర్బంగం చేసిన శ్రీరాముని వివాహం చేసుకుంది.
కుశధ్వజునికి కేశిధ్వజుడు, అతనికి మితధ్వజుడు, అతనికి ఖ్యాండీక్యుడు, అతనికి భానుమంతుడు, అతనికి శతద్యుమ్నుడు అతనికి సుచి అతనికి సనధ్వాజుడు అతనికి ఊర్వకేతుడు అతనికి అజుడు అతనికి కురుజిత్తు అతనికి అరిష్టనేమి అతనికి శ్రుతాయువు అతనికి పార్మకుడు అతనికి చిత్రరధుడు అతనికి క్షేమాపి అతనికి హేమరధుడు అతనికి సత్యరధుడు అతనికి ఉపగుర్వుడు అతనికి సావనుడు అతనికి సువర్చనుడు అతను సుభషుణుడు అని కూడా పిలవబడ్డాడు. అతనికి జయుడు అతనికి విజయుడు అతనికి ధృతుడు అతనికి అనఘుడు అతనికి వీతిహవ్యుడు అతనికి ధృతుడు అతనికి అనఘుడు అతనికి వీతిహవ్యుడు అతనికి థృతి అతనికి బహుళాశ్వుడు అతనికి కృతి అతనికి మహవళి జన్మించారు.
మిథిలానగరన్ని రాజధాని చేసుకొని పాలించిన రాజులు అందరిని మైథిలీలు అని అంటారు, సీతాదేవి కూడా మైథిలి అని పిలవబడింది.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.