[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘మెట్లు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎక్కేందుకు భుజాలెగిరేసే
వలసజీవి
ఊరు కళలు వెన్నెలకాచి
వెన్నలా మనసు కరిగించిన రోజులు
మసకమసక కనుల మసి
పచ్చదనం గాలికి ఆక్సీజన్
బతికిన ఊరూచెట్టుదే ఊపిరి
వాడూ.. నేనూ
కలిసిన రోజే వెలిగే దీపాల కన్ను వన్నె
రాత్రికి పగలు డే & నైట్ దశ కాపలా లైఫ్
చలో బతుకిదే నడుపూ గడుపు
పిల్లోడి గోల అరిచే
ఎక్కేది భుజాల మెట్లే
ఎగిరే తాత ఆనందం చెట్టూగుట్ట
వాడు పసివాడు బాల్యం చుట్టేసే వీరుడు
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.