Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరికొత్త ధారావాహిక ‘మేనల్లుడు’ – ప్రకటన

సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘మేనల్లుడు’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

***

వివేక్ తండ్రి రమణకి లేని అలవాటు అంటూ లేదు.. రమణతో విసిగిపోయిన నారాయణరావు తన చెల్లెలు శారదని, ఆమె కొడుకు వివేక్‌ని తన ఇంటికి తీసుకువెళతాడు.

సుమిత్ర – ఆడపడుచు శారదని తన సొంత కూతురిలా చూసుకుంటుంది. సుమిత్ర నారాయణరావులకు సంతానం కలగదు.. పసివాడైన మేనల్లుడు వివేక్ తోటే సుమిత్రకి లోకం..

నారాయణరావుకి మేనల్లుడు వివేక్ అంటే పంచప్రాణాలు!

సుమిత్ర, నారాయణరావులకు అమృత పుట్టడంతో ఊరంతా పండగ చేసుకుంటారు..

మేనల్లుడు ఇంట అడుగు పెట్టిన వేళ.. లక్ష్మీదేవి పుట్టిందని చెప్పుకుంటారు ఆ ఊరి జనం..

ఆ ఊరికి ధనవంతుడు నారాయణరావు.. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుంటాడు నారాయణరావు.. ప్రజల తలలో నాలుకలా ఉంటాడు నారాయణరావు.

ఆ ఊరికి దగ్గరగా ఉన్న రాజమండ్రిలో ఉన్న స్కూల్లో వివేక్, అమృతని జాయిన్ చేస్తాడు నారాయణరావు.

ఎంతో పెద్ద వాడిలా అమృతని జాగ్రత్తగా చూసుకోవడం.. స్కూల్లో అన్నం తినిపించడం, అన్ని పనులు చేయడం చూసి నారాయణరావు, సుమిత్ర పొంగిపోతుంటారు..

“అదృష్టవంతులు నారాయణరావుగారు.. బంగారం లాంటి మేనల్లుడే అల్లడవుతాడు..” అని ఎవరో అనబోతే కోపం తెచ్చుకుంటాడు నారాయణరావు.

“వాళ్ళని స్వేచ్ఛగా, సంతోషంగా.. ఫ్రెండ్స్‌లా పెరగనివ్వండి..” అన్నాడు.

“మామూ.. నాన్నకి బాగోలేదు.. నాకు భయంగా ఉంది.. నాన్నకి బాగుడలేదని మాముకి ఫోనులో చెబుతానంటే నాన్న చెప్పనీయలేదు.. ఇప్పడేమో.. నాన్న నిన్నే పలవరిస్తున్నారు.. తొందరగా వచ్చేయ్!.. నువ్వు వస్తే నిన్ను గట్టిగా పట్టుకొని.. నీ వళ్లో తల పెట్టుకొని..” అమృత వెక్కిళ్లు  పెట్టడం చూసి, షాకైయ్యాడు.. “ఇదిగో ఈ రోజో బయలుదేరుతున్నా” అని ఫ్లైట్ ఎక్కాడు విశాల్..

తన చిన్నతనం అంతా గుర్తు వచ్చి కళ్ళు తుడుచుకున్నాడు వివేక్..

హస్పటల్‌లో నారాయణరావుని చూసి షాకైయ్యాడు.. పులిలా ఉండే మామయ్య.. మంచంలో కళ్లల్లో ప్రాణం పెట్టుకొని, చిక్కి శల్యం అయ్యాడు ఏమిటి?

నీరసంగా, మాటాడలేక.. అతి కష్టం మీద నారాయణరావు అన్న మాట విని.. షాక్ య్యాడు వివేక్.

“నాన్నా ఏమంటున్నారు?” అని నిర్ఘాంతపోయింది అమృత.

***

ఈ ధారావాహికని చదవండి వచ్చే వారం నుంచి.

Exit mobile version