[శ్రీమతి రమాదేవి బాలబోయిన రాసిన ‘మేల్కొలుపు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“అమ్మా! అమ్మా.. ఏం చేస్తున్నావే!?” సంబరంగా గంతులు వేస్తూ అమ్మను పిలువసాగింది మైథిలి.
“ఒసేయ్, ఆ గంతులేంటే. ఆపు.. గొంతు కోసిన మేకలా ఆ అరుపులేంటి. నిమ్మలంగ ఉండలేవ్. ఇగ వచ్చింది యువరాణి అని వాడకంతా తెలవాల్నా” కసురుకుంది మైథిలి బాపమ్మ.
“ఓయ్. ముసలీ. నా మనవరాలిని ఏమో అంటున్నవేందె. ముయ్ నోరు. పసిపిల్లను సూత్తెసాలు. కంట్లె పెట్టుకుంటవ్” అని మైథిలి తాత వాళ్ళ బాపమ్మను బెదిరించిండు.
బాపమ్మ మాటలకు ముడుచుకు పోయిన మైథిలి తాత మాటలకు ఊరడిల్లింది. ఇంతలో మైథిలి వాళ్ళ అమ్మ ధరణి అక్కడికి వచ్చింది.
తల్లిని చూస్తూనే హుషారుగా మళ్ళీ మునుపటిలా “అమ్మా! ఈరోజు మనం టీవీలో చంద్రయాన్ సక్సెస్ అయిన విధానాన్ని చూసాము కదా.. అంతేకాకుండా నువ్వు చక్కగా వివరించావు కూడా.. నాకు అర్థమైంది అంతా ఈరోజు మా టీచరు ప్రేయర్లో నాతో చెప్పించింది. నేను చాలా చక్కగా చెప్పాను. టీచర్లంతా మెచ్చుకున్నారు. మా హెడ్మాస్టర్ మేడం నాకు ఇదిగో ఈ బహుమతి ఇచ్చారు” అంటూ తనకొచ్చిన బహుమతిని ఉత్సాహంగా చూపించింది.
అది పిడికిల్లో అమరేంత ఉన్న ఒక చిన్న గ్లోబు.
“నా బంగారు తల్లి.. వెరీ గుడ్. కంగ్రాట్స్ మై లిటిల్ ప్రిన్సెస్” అంటూ ముద్దు చేసింది ధరణి. అది చూసి బాపమ్మ మూతి తిప్పుకుంది. తాత మాత్రం మరింత సంతోషాన్ని వ్యక్తం చేసాడు. అలా అమ్మకే కాదు ఇంటి చుట్టుప్రక్కల ఉన్నవారందరికీ చూపించింది మైథిలి.
ధరణి ఎంచక్కా కూతురికి ఇష్టమైన ఆలూ పరోటా చేసిపెట్టింది. మైథిలి భోంచేసాక తాతతో కలిసి గ్లోబు గురించిన ముచ్చట్లు చెబుతూ నిద్రపోయింది.
“మైథిలీ! ఓ మైథిలీ” ఎవరో పిలిచినట్లు అనిపించింది మైథిలికి.
“ఎవరూ!?” అంది మైథిలి.
ఎదురుగా ఒక స్త్రీ. ఆకుపచ్చ నీలం కలగలిసిన చీర కట్టుకుని, జలపాతాల్లాంటి కురులతో, ఆవిడ చాలా అందంగా ఉంది.
కానీ ఆమె చాలా బాధలో ఉన్నట్లుగా అనిపించింది. “ఎందుకలా బాధ పడుతున్నారు” అడిగింది మైథిలి.
ఆవిడ తన బాధను పూసగుచ్చినట్టు చెప్పసాగింది. ఆమెను ఎవరెవరు ఎన్నెన్ని విధాలుగా బాధపెడుతున్నారో, తన నుండి శక్తిని ఎలా లాగేసుకుంటున్నారో, తన శరీరాన్ని ఎలా తూట్లు పొడుస్తున్నారో వివరించింది. ఇంకా ఏమన్నదంటే నన్నే కాక నా తమ్ముడిని కూడా హింసించడానికి బయలుదేరారు అంటూ వాపోయింది.
ఆమె కన్నీరు కారుస్తుంటే మైథిలి చాలా బాధ కలిగింది. “అయ్యో ఏడవకండీ.. ఏడవకండీ” అంటూ నిద్రలో కలవరిస్తున్న మైథిలిని తాత “ఏమైంది తల్లీ” అంటూ నిద్రలేపి అడిగాడు. అంతసేపు తనకొచ్చిన కలను గురించి వివరించింది మైథిలి.
తాత చిన్నగా నవ్వుతూ “అవును తల్లీ! మనం మన భూమిని రక్షించుకునేందుకు ప్రయత్నించకుండా వేరే చోట నివసించేందుకు వీలవుతుందా!? అంటూ వెదకడం ఎంతటి మూర్ఖత్వానికి గుర్తు కదా.. విజ్ఞానం విస్తరించాలి నిజమే కానీ వినాశనాన్ని ఆపడం కూడా ముఖ్యమే కదా!.. అది మనందరి బాధ్యత కాదా!?” అన్నాడు తాతయ్య ఆవేశంగా.
“ఔను తాతయ్యా! మన భూమిని మనం రక్షించుకునేందుకు గట్టి ప్రయత్నం చేయాలి” అంది మైథిలి.
కాలుష్యం తగ్గించడానికి, మనుషుల నిర్లక్ష్యం పోవడానికి, మరియు భూమిని రక్షించుకునేందుకు ఏమి చేయాలో తాత చెబుతుంటే శ్రద్ధగా వినసాగింది మైథిలి. రేపు ప్రేయర్లో మంచిమాటలు చెప్పే అంశంగా ఇవే చెప్పాలని నిర్ణయించుకుంది. మనుషులకు మేల్కొలుపు మాటలు అవసరం అనుకుంటూ ఆమె చేతిలో ‘భూమి’ అదేనండీ ‘గ్లోబు’ గలగలా నవ్వింది.
శ్రీమతి రమాదేవి బాలబోయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ప్రవృత్తిగా కథా, కవితా, నవలా రచయిత్రి. విమర్శకురాలు, సమాజ సేవకురాలు. సాంత్వన ఫౌండేషన్ ఫౌండర్. ప్రాణంవాసన అనే కవితా సంపుటి, మీలిత-నవల వీరి రచనలు.
నా రచనను ప్రచురించిన పత్రిక యాజమాన్యానికి ధన్యవాదములు _రమాదేవి బాలబోయిన
మన భూమిని మనం రక్షించు కొనుట మన కర్తవ్యం -సుకన్య. హన్మకొండ
మంచి సందేశాత్మక కథ రమాదేవి గారూ! బాగుంది !!
థాంక్యూ మేడం
శాస్త్రీయ స్పృహతో కూడిన చక్కటి బాలల కథ అనవచ్చు👌👌 Raji Reddy గారి ప్రశంసకు ధన్యవాదములు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పెద్దలుసురుమన్న….
మరుగునపడ్డ మాణిక్యాలు – 55: హ్యాపీ-గో-లకీ
అక్కినేనితో అద్భుత స్నేహం
భారత కోకిల
ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 4
ఆశాజీవి
తెలుగు రామాయణానికి కీర్తి కిరీటమీ పద్యం
అన్నమయ్య పద శృంగారం-24
మిణుగురులు-9
ఎడారిలో కోయిల
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®