Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేఘం పాడిన పాట!

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘మేఘం పాడిన పాట!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

వరో మేఘ మల్హర్ రాగం పాడుతున్నట్లున్నారు..
అక్కడ ఖాళీ అయిన మబ్బుల్లో.,
తమ గుండెల్లోని.. వియోగాన్ని,
కళ్ళల్లోని కన్నీటిని.. వంపుతున్నట్లున్నారు.
ఇక్కడ నా ఆకాశంలో
కొత్త మేఘాలు.. తాజా కన్నీళ్లు!
***
ఆమె వెళ్లిపోయాక
నగరం ఖాళీ అయిపోయింది
నా హృదయంలా!
***
సమస్తమూ ఆమెకి ఇచ్చేసిన
సంగతి మరిచిపోయి
నాలో నేనే ఏదో వెతుకుతూ ఉంటాను.
***
నువ్వు నాకెన్నటికీ
దొరక్కపోవడమే ప్రేమ!
***
అవును కానీ.. నాకిది చెప్పు!
నువ్వింతగా నాకు
జ్ఞాపకానికి వస్తావని
నీకు ముందే తెలుసు కదూ..
తెలిసీ తలుపు తట్టావెందుకు..
మరిచిపోయావెందుకు?
సరేలే.. అందరూ ఉంటారు నీతో..
కానీ నేను ఉండను!
నేను లేకుండా మరి
నువ్వుండగలవేమో చూస్కో!

Exit mobile version