నాకో తోడు కావాలి..
ఆ తోడు నా నీడై
రావాలి నన్ను వెన్నంటి
సముద్రపు సునామిలోనికి..
వెండి పాయలు నన్ను ముగ్గుబుట్టని చేస్తుంటే
ప్రేమెందుకని అంటున్నారా!!
వానపాముకి మట్టిమీద ఎందుకు ప్రేమో
అడిగారా మీరెవరైనా!!
జాబిల్లి వయస్సెంతో కనుక్కోగలరా మీరెవరైనా?
కూకూ పిట్టలు కులుకుతూ ఎగురుతుంటే
కళ్ళప్పగించి చూస్తున్నారే!!
నాకో తోడు చూడాలని అనిపించలేదా?
పండుటాకులా నే నేల రాలిపోకముందే
నన్ను ప్రేమించే ఓ హృదయం కావాలి నాకు!!
మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?
డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.