Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మట్టి

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘మట్టి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

స్పర్శించు దర్శించు
మట్టి శక్తిదాయిని

అర్థించు ప్రార్థించు
మట్టి ఫలదాయిని

నమించు శ్రమించు
మట్టి క్షమదాయిని

తపించు జపించు
మట్టి వరదాయిని

జీవించు సేవించు
మట్టి సృష్టిదాయిని

చరించు తరించు
మట్టి ముక్తిదాయిని

దహించు సహించు
మట్టి ఐక్యదాయిని

Exit mobile version