Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మతోన్మాది

[సిహెచ్. కళావతి గారు రచించిన ‘మతోన్మాది’ అనే కవితని అందిస్తున్నాము.]

పుట్టావు మనిషిగా
మారావు మతం పేరుతో ఉన్మాదిగా
అమాయకుల ఊపిరులు తీస్తూ ఉరకలేస్తున్నావు
ఎందుకురా మానవ జన్మ దండగ

తల్లుల గర్భశోకానికి కారణమై
పసిపిల్లల భవితవ్యానికి శాపమై
మానవత్వం మరచిన మృగానికి రూపమై
సాధించేదేమి లేదు. చాటుకున్నావు
నీచత్వానికి నిదర్శనమై
చివరకు ఎవరూ కార్చలేదు
ఒక్క కన్నీటి చుక్కను నీకై.

చరిత్రను సృష్టించాలనుకొన్నావు
చరిత్రహీనుడిగా మిగిలిపోయావు
మనిషి ఎలా ఉండకూడదో
నీవు సాక్షిగా మిగిలావు
సభ్య సమాజం సిగ్గుపడేలా
రక్త చరితుడవైనావు.

మానవ జన్మ వైశిష్ట్యాన్ని
గమనించలేక పోయావు
సమాజాన్ని సంకుల రణంగా మార్చావు
రక్తసిక్త ప్రవాహ దాడిగ చేసి
తరించాలనుకొన్నావు
చివరకు నీకు నీవు కూడ
దక్కకుండా తరలిపోయావు.

Exit mobile version