Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వాతి కవితలు-6- మరోసారి మళ్ళీ

న్నో ఊహల మేడలు కట్టుకుని
ఎన్నో ఆశల బాసలు చేసుకుని
ఎన్నో అర్థంలేని మాటల మూటలు మోస్తూ
ఎన్నో మలుపుల సుడిలో అడుగులు వేస్తూ –
ఎన్నిసార్లు మనని మనం వెదుక్కున్నామో!
ఎన్నిసార్లు ఒకరినొకరు కనబడలేదని విసుక్కున్నామో.
ఇదిగో… అక్కడే వుండు…
నీ చూపుల దారుల్లో నేనడిచి వస్తా
పోనీ…
నా చూపై నువ్వు రా… నా కోసం… నీ కోసం…
మన కోసం… మరోసారి మళ్ళీ…

Exit mobile version