నా కోసం
జాబిలై దిగివస్తే
గుండెలోనే దాచుకుంటా..
పూలవానై కురిస్తే
స్వప్న వీధిన పన్నీరుగ చల్లుకుంటా
సోయగాలై తాకితే
ప్రేమగీతిక రాసుకుంటా
నిప్పుకణికై చేరితే
ప్రణయజల్లై వేడుకుంటా
హంస నయనమై గుచ్చితే
కలువ కుసుమమై విరబూస్తా
మంచు రేణువై రాలితే
రసికధూమమై వరిస్తా
వెన్నెలంతా పంచియిస్తే
దుప్పటల్లే కప్పుకుంటా..
వేదమంత్రం తోడుగా
నీలి సంద్రం ఆశగా
నీకోసం ఎదురుచూస్తా.. మరాళి
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.