[షేక్ కాశింబి గారు రచించిన ‘మనుషులిప్పుడు..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కనిపెంచిన తల్లిదండ్రులు కాలం చేసినా.. కలవరపడక కంటి చూపుక్కూడా.. రానంత యోగులవుతున్నారు!
తోబుట్టువుల కష్టాల్ని చూసి తట్టుకోలేక వారున్న వైపుకే వెళ్ళనంత సున్నిత మనస్కులవుతున్నారు!
రోడ్డు పై బడి.. రక్తమోడుతున్న సాటి మనిషి పట్ల సానుభూతితో సెల్ఫీ దిగి.. మరుక్షణమే పనిలో బడేంతగా తామరాకు మీద నీటి బిందువు లవుతున్నారు!
ఎన్నికలప్పుడు మాత్రం తరతమ భేదా లెంచని ఉదారచిత్తులుగా వ్యవహరించి అవధూతల్నే నివ్వెర పరుస్తున్నారు!
అయినవారెంత ఆపదలో ఉన్నా.. బంధాలకి బందీలవక నిగ్రహం చూపేంత పరిణత మనస్కు లవుతున్నారు!
సలహా ఎవరిదైతేనేం.. పెళ్ళయ్యాక సులువుగా అమ్మానాన్నల్ని ఆశ్రమంలో దింపి స్తిమితంగా చెయ్యి కడుక్కునేంత స్థితప్రజ్ఞు లవుతున్నారు!
సొంత పరిధిని కుదించుకుని స్వసుఖమే పరమావధిగా తలుస్తూ.. ‘గీతా’సారానికి కొత్త భాష్యం చెప్పేంత జ్ఞాన సంపన్ను లవుతున్నారు!
నిత్యం చూస్తున్న వాస్తవ చిత్రం. నేటి తరం పరిణతి పెరిగి నిర్మమకారంగా ఉంటున్నారని,యోగులవుతున్నారని వారికి Kitabivvalemo! తన సొంత చిన్న కుటుంబం మీద మాత్రం వల్లమాలిన ప్రేమ వదులుకోవడం లేదు మరి. చాలా చక్కని కవిత ! లోకం పోకడ మీద విసురు.బావుంది.అభినందనలు.
కవిత బాగుంది అండి. నేటి కాలం మనస్తత్వాలను అద్దం పెట్టి చూపిస్తుంది.
విలువలు మరచి మేమే సర్వం అనుకునే వారికి సున్నితమైన చెంపపెట్టు. అమ్మగా గట్టిగా శిక్షించలేక సున్నితంగా మందలించినట్టు ఉంది.
నమస్తే అమ్మ…అవును ఇప్పుడు మనుష్యులు ఇలానే ఉంటున్నారు మానవత నశించి, బంధాలు విస్మరించి…ఆధునిక పోకడను చక్కగా వివరించారు అమ్మ
You must be logged in to post a comment.
ఆచార్యదేవోభవ-27
అభినందన సేవా సంస్థ 2025 హాస్య కథల పోటీకి కథలకు ఆహ్వానం
స్వీయ సాక్షాత్కారం
మేనల్లుడు-8
ఈ ఏడాది ఉగాది…
నీరాజనాలు!
సాఫల్యం-46
దేముడి లడ్డూ
పడమటి కడలి -1
సినిమా క్విజ్-77
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®