Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మంగళసూత్రాలు

[కావైశ్రీ గారు రచించిన ‘మంగళసూత్రాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

న్నె పిల్లలకు ఇవి మెళ్ళో పడాలని ఆత్రాలు
ఆ మెళ్ళో పడగానే కొత్తగా మార్పు లొస్తాయి గోత్రాలు
సుమంగళి జీవితానికి అవి సుస్వరాల గాత్రాలు
అత్తగారింట అడుగిడగానే బాధ్యతలను పెంచేను అనేక పాత్రలు
జీవితంలో మొదలవుతాయి పండంటి కాపురానికి 12 సూత్రాలు
మేళతాళాలతో ఆప్తులకి అందిస్తారు పెళ్ళి శుభలేఖ పత్రాలు
ఆదరింపుతో ఆహ్వానిస్తూ వరుడికి పడతారు ఛత్రాలు
పురుషుడ్ని వరించి; పుస్తెలు ధరించి పురిటి నొప్పులతో
వంశాన్ని ఉద్దరించి ఇంతులు ఇస్తారు పుత్రులు
ఈ బాధ్యతను నెరవేర్చి మురిసిపోటానికై అష్ట కష్టాలు పడి తల్లి – తండ్రులు
అహర్నిశలూ ఎదురు చూస్తూ గడుపుతారు ఎన్నో నిదురలేని రాత్రులు
అప్పట్లో గుండెల స్థానానికి చేరుకునేవి చూపులతో భర్త నేత్రాలు
ఇప్పట్లో గుండెల మీద నిత్యం కనిపించడానికి కరువై
అరువుగా గూట్లో తగిలిస్తూ చేస్తున్నారు సిరు సిత్రాలు
ఇకపై మునుముందు ఇంకెన్ని చూడబోతామో ఎన్నో విచిత్రాలు
ఈ పవిత్ర ధారణకు సకల దేవతల సాక్షిగా పురోహితులు
వల్లిస్తారు వేద మంత్రాలు
ఆపలేవు ఏ యంత్రాలు, తంత్రాలు
ఈ కార్య నిర్వహణకు మంగళ ప్రదాలు సత్రాలు, క్షేత్రాలు
ఏడడుగులు వేసి చూపుతారు నక్షత్రాలు
అందుకు అరుంధతిని ఆదర్శంగా తీసుకొమ్మని దీవిస్తారు
కమ్మని మన జీవితాలు పవిత్రాలు

Exit mobile version