Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మంచు దుప్పటి – మంచి భావము

సూర్యోదయం కన్నా ముందు లేచి ప్రకృతి ఆరాధన, సంగీత సాధన చేసే అమృతవర్షిణికి నిద్ర లేవగానే పొగమంచు దట్టంగా కిటికీలో నుంచి కురుస్తూ కనిపించింది. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి పూల బుట్ట పట్టుకుని అరో ప్రాణం చేత బట్టుకుని వెళ్ళింది. అప్పటికే మంచులో తడిసి నక్షత్రాల మాదిరి తెల్లని మల్లెపూలు మెరుస్తున్నాయి. సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. పువ్వులపై పడిన మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.

కొన్ని పువ్వులు కోసే కొన్ని కనకాంబరాలు కోసి మరువం మాచి పత్రి కోసి బుట్ట నింపింది. ఈలోగా సూర్యుడు సప్తాశ్వాలతో వేగంగా తన కాంతి కిరణాలను ప్రసరింప చేస్తూ వస్తున్న సూచనగా మంచు ముత్యాలు కరిగి పోతున్నాయి. దట్టమైన మంచు కిరణాలు నుంచి మెరుపు కిరణాలు ప్రసరిస్తూ మానవాళిని మేల్కొలుపుతూ భూమి అంతా వెలుగుని ప్రసాదించాడు. కొందరు స్వాగతం పలికారు. మరి కొందరు మత్తుగా లేస్తున్నారు.

పువ్వులని గబ గబ దండ కట్టింధి. దేముడు పటాలకి శ్రీ వినాయకుడు, అలమేలు మంగా సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అనంతలక్ష్మీ రమ సహిత సత్యనారాయణ స్వామి, దత్తాత్రేయుడు అనఘా దేవీ, మారుతి సువర్చల – పటాలకు దండలు వేసి అలంకరించింది.

‘ఏమిటో ఉగాది ముందు మంచు పట్టి మామిడి పూత, వేప పూత రాలిపోతుంది అంటారు. ఉగాది వెళ్లి వైశాఖ మాసం అక్షయ తదియ వచ్చింది, అయినా మంచు దట్టంగా పడుతోంది’ అనుకుంది. కమ్మని చికొరీ కాఫీ డికాషన్ వాసన వస్తోంది.

‘ఓహో రమణమ్మ వచ్చింది కాబోలు, వంట ఇంటి ఘుమ ఘుమలు మొదలు’ అనుకుని మిగతా పూల దండలు రెడీ చేసుకుని కిందకి వెళ్ళింది. అప్పటికే అమ్మ వంటకాలు పురమాయిస్తోంది.

“రా రా అమృత కాఫీ తాగు” అన్నది.

టిఫిన్ రోజు ఇడ్లీ ఉండాలి, ఆ తరువాత రెండోది దోసె కానీ ఉప్మా కానీ చేస్తుంది. ఉదయం టిఫిన్ బలంగా ఉండాలి, అందుకు రెండు రకాలు. ఒక ఆవిరి వంట, ఒక నూనె వంట చేస్తుంది. పచ్చడి వీలును బట్టి చేస్తుంది. మామిడి కాయ, కొబ్బరి పచ్చడి ఈ సీజన్‍లో తప్పదు.

“ఇంకా వంటకాలు ఏమిటి?” అడిగింది అమృత.

“ఏముంది ఆస్థాన విద్వాంసుడు మామిడికాయ పప్పు, దోసకాయ, మామిడి కాయ పచ్చడి. వంకాయ అల్లం కూర ముక్కల పులుసు” అని చెప్పింది అమ్మ.

“మరి పిండి వంట ఏమిటి?”

“ఎమ్.టి.ఆర్. పులిహార, రవ్వ ప్రసాదము ఇవి చాలు అన్నారు. కొంత ప్రసాదం తీసి పక్కన పెట్టి, బూరెలుగా పిండి కలిపి వెయ్యమన్నారు. ఓ కప్పు రవ్వ ఉండ్రాళ్ళు, ఓ కప్పు పరమాన్నం చేసి నివేదనకు పెట్టమాన్నారు” చెప్పింది రమణమ్మ.

“అవును కదా ఈరోజు ఐదుగురు పెరంటాళ్ళకు అమ్మ మామిడి పళ్ళు, తాంబూలం, పువ్వులు దండలు, పసుపు, కుంకుమ, గాజులు, రవికెల బట్ట, సెంటు సీసా, పులిహోర, బూరెలు కవర్లలో పెట్టి ఇస్తుంది” అంది అమృత.

ఇది ఒక తృప్తి. స్త్రీ సుమంగళితనం అక్షయంగా ఉండాలి అంటుంది అమ్మ. నిజమే పూజ భక్తిగా ఘనంగా చెయ్యాలి. ఎలాగూ కొత్త బట్టలు కట్టుకుంటారు. నాన్న అమ్మ మాటకి సరే అంటాడు. అనకపోతే ఇంట్లో గొడవ మొదలు.

ఇంత సుఖంగా ఆడపిల్లని పెంచితే ఎలాంటి ఇంటి పెళ్లి అవుతుందో ఎవరూ వస్తారో అని తల్లి ప్రతి సంబంధానికి ఏదో వంక చెపుతుంది.

వెంకట రమణ అమృత అన్న. యింటికి పెద్ద కొడుకు. ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దండిగా డబ్బు ఉన్నది, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి.

అప్పట్లో రమణకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు – కాబోయే కోడలు ఉద్యోగం చెయ్యకూడదు, మంచి చదువు సంస్కారం ఉండాలి అని వెతికారు. ఈ రోజుల్లో ఉద్యోగం వద్దు అంటే మాకు అదే ముఖ్యం పెళ్లి కన్నా అన్న సంబంధాలు వస్తాయి.

ఎలాగో రమణ తన తెలివితో కంప్యూటర్ బి.ఎస్.సి చదివిన రేణుకను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడపిల్ల పుట్టింది. స్వర్గ శ్రీ పేరు. దానికి ఆరు ఏళ్ళ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ కంపెనీ రమణని విదేశాలకి పంపింది

ఇదివరకు వెడతాను అంటే ఇంట్లో వాళ్ళు ఇష్టం చూపలేదు. ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, డబ్బు అవసరము చెల్లెలి పెళ్ళి చెయ్యాలి, కూతుర్ని పెంచాలి అంటూ విదేశాలకి వెళ్ళాడు

అమృతను ఉద్యోగం చెయ్యనివ్వరు. ఇంటికి వచ్చి పాఠం నేర్చుకోవడం కంటే వివరాలు ఎక్కువ అడుగుతారు. జీతం తక్కువ, వివరం ఎక్కువ కావాలి. అందుకు వద్దు అన్నాడు

ఈ మధ్య మనకి ఆస్కార్ వచ్చాక చాలా మందికి సంగీతం, తెలుగు విలువ తెలిసింది. రమణ కుటుంబం వారు చాలా మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు వీళ్లని కూడా రమ్మన్నారు కానీ ఇష్టత లేదు అన్నారు. బాధ్యతలు ఉన్నాయి అంటారు. నిజమే ఈ పెద్దవాళ్ళని ఏమి తీసుకెళతాడు? చెల్లెలికి పెళ్లి చెయ్యాలి.

ఇద్దరే పిల్లలు అయిన ఎంత చెట్టుకి అంత గాలి.

రమణ పెళ్లి సింపుల్‌గా చేశారు. కట్నం కూడా లేనట్లే. ఏదో బట్టలు లాంఛనాలు మామూలే.

ఇప్పుడు ఆడపిల్లకి అలా కుదరదు. వచ్చే వాడిని బట్టి ఉంటుంది. అయితే వచ్చేవాడు ఉద్యోగం అడుగుతున్నాడు.

***

ఫారిన్ కరెన్సీని మార్చడానికి బ్యాంక్‍కి వెడుతూ ఉంటుంది అమృత. ఒకసారి అక్కడ కంప్యూటర్స్ ఆగిపోయాయి. అందరూ క్యూ లో ఉన్నారు. ఒక పెద్దాయన “బాబూ ఎంత సేపు పడుతుంది?” అన్నాడు

“సర్ మీ సంతకం కుదరదు, ఇది మీ భార్య పేరున ఉన్నది, అవిడ సంతకం కావాలి” అన్నాడు క్లర్క్.

“అవిడ రాలేదు నాయనా, నేను వెళ్లి పెట్టించి తెస్తాను” అన్నాడు. “ఎంత సేపు పడుతుంది?” అన్నాడు

“సర్ నేను కుర్రాడిని. బ్యాచ్‍లర్‍ని. కానీ ఈ మిషన్ బ్యాంక్ పెట్టినప్పుడు కొన్నది. అది ఎప్పుడు పని చేస్తే అప్పుడు డబ్బు ఇస్తాము. అయిన సంతకం కావాలి మీది కాదు అవిడది” అని అరిచాడా క్లర్క్. సహనం పోయింది. దాంతో ఇంకా డోర్ వేసి వెళ్ళిపోయాడు.

పాపం ఆ ముసలాయనకి వినబడదేమో, ఏమి అర్థం కాలేదు అనుకుంటున్నాడు

‘ఆహా అందుకే నా అన్నయ్య – నన్ను – అమ్మా నాన్నలకి సహాయం పెట్టాడు’ అనుకున్నది.

అమృత ఆలోచనల్లో పడింది. సంబంధాలు వెతుకుతున్నారు కానీ అందరూ కొడుకు ఒక్కడు. కూతుళ్ళు ఇద్దరు ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అవుతాయో మానుతాయో ఎవరికి ఎరుక? పెళ్లి కాని పిల్లలు ఉంటే వదిన గారికి ఎక్కడా సుఖం ఉండదు. రోజు ఏదో తరహా మాటలు వస్తాయి, దానితో సమస్యలు వస్తాయి.

సుభాషిణి తన చిన్ననాటి స్నేహితురాలు. డబ్బు ఉన్నది, బాగా చగుకున్నది. అన్నగారు తమ్ముడు ఇద్దరు మంచి డాక్టర్స్. ప్రాక్టీసు చేస్తున్నారు. ఆమెకి కట్నం బాగా ఇచ్చి పెళ్లి చేశారు. ఇంట్లో ఉన్న పెళ్లి కానీ అడబడుచు అత్తగారు నిత్యం వంకలు పెడుతూ ప్రతి పనికి విమర్శలు చేస్తారు. భర్త ఏమీ మాట్లాడడు. ఉద్యోగం ఇల్లు తప్ప వేరే ధ్యాస లేదు. తల్లి కూతురు ఖర్చు పెట్టడానికి ముందు ఆలోచించరు. సుభాషిణికి కావాల్సినవి కూడా వాళ్ల ఇష్టమే. అంతేనా, ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటారు. కైకేయి, మందర, శూర్పణఖ వారసులు వీరు అని చెప్పాలి.

ఎప్పుడో పది గంటలకి పొద్దున్న వండిన చల్లారిన అన్నం తినాలి. కూర పులుసు ఏమి ఉంచరు. రోజు మాగాయ అన్నం తినాల్సి వచ్చింది. దానితో అరోగ్యం దెబ్బ తిన్నది. ఆ ఇంట్లో దోమలు ఈగలు ఎక్కువ. వాటికి మందులు వెయ్యకూడదు, వారికి పడదు. పిల్లకి బాగా లేదు హాస్పిటల్‍లో ఉన్నది అంటే మీరు అంతా ఉన్నారు మీరే చూసుకొని బాగు చెయ్యండి, నాకు ఉద్యోగం బాధ్యత అన్నారు. కనీసం కోడలు అనే ప్రేమ ఆ ఇంట్లో లేదు. ఇంక కొడుకు సొమ్ము వాళ్ళే తినాలి. అంటే ఇంకా పెళ్లి ఎందుకు? కట్నం కావాలి. డబ్బున్న పిల్ల కావాలి అంటూ పెళ్లి చేస్తారు. ఆ తరువాత అన్నం కూడా వేడిగా ఉండగా తిననివ్వరు. ఎన్నో మాటల బాధలు. మొగుడు ఆ మాటలు విన్నా కూడా ఏమి అనడు, వాళ్ళనే సమర్థిస్తూ ఉంటాడు.

ఇదీ వరుస. భాధలు పడలేక పుట్టింటికి వచ్చి అక్కడే వైద్యం చేయించుకుని అక్కడే ఉండి పోయింది సుభాషిణి. పుట్టింటి వారు సమర్థులు కనుక పిల్ల జీవితాన్ని చూశారు. ఇప్పుడు అక్కడే ఏదో బిజినెస్ చేస్తోంది.

ఆలోచనల్లోంచి బయటపడిన అమృత బ్యాంకు పని ముగించుకుని ఇంటికి వచ్చేసింది.

***

సుభాషిణి గురించి రమణకి కూడా తెలుసు. కాలక్రమంలో గ్రహస్థితి బాగుపడి ఇద్దరు బాగుపడాలి. అత్తగారికి పెద్దరికం ఇస్తు జీవితం వెళ్ళడానికి అవకాశం ఉందని అంటున్నారు. సరే, అతను రిటైర్ అయ్యాక వాళ్ళే ఇష్టపడతారు – అని కాలానికి అనుగుణంగా జీవించడానికి అనువుగా మారడం మంచిది కదా అంటారట.

ఇది తలుచుకుంటే ఆడపిల్ల అమృత పెళ్లి ఎలా అని వెంకట రమణ బాధపడతాడు. అందుకే తన పిల్లకి పాఠం చెప్పించి కొంత డబ్బు పాకెట్ మనీ ఇస్తాడు.

తెలుగు పాటకి ఆస్కార్ వచ్చాక ఇప్పుడు అంతా సంగీతం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే పేపర్ యాడ్ ఇస్తే అప్లికేషన్స్ బాగానే వచ్చాయి. అమృతని క్లాసులు ఇంటి దగ్గర చెప్పమన్నాడు. తల్లి తండ్రిని చూసుకుంటూ క్లాసులు చెపుతోంది.

***

ఒక్కొక్క మార్పు మనుష్యులలో వస్తుంది. పూర్వం ప్రతి ఇంట్లో హర్మని పెట్టె ఉండేది. ఆడపిల్ల పెళ్లికి ముందు నేర్చుకునేది. కారణం ధారణ, జ్ఞాపక శక్తి, మాట స్పష్టంగా ఉంటాయి, లెక్కలు బాగా వస్తాయి. అంతేనా లెక్కలు, పిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, ఇంకా తెలుగు ఆధ్యాత్మిక భావాలు, ఆయా ప్రాంత భాష ఇలా ఎన్నో రకాల సబ్జెక్ట్స్ వస్తాయి అని; ఈ తరం వారికి ఇంగ్లీష్, సైన్స్‌లో చెప్పాలి అని సంగీతాన్ని సింపుల్ పై చేసింది అమృత.

అంతేనా ఈ సప్త స్వరాలు – ప్రతి స్వరంతో ఓంకారం వస్తుంది. ఇవి ప్రకృతి లోని పక్షులు జంతువుల నుంచి పుట్టాయి. ఆ అర్ధనారీశ్వరుని నాట్యం ఢమరుక నాదం నుంచి సంస్కృతం, సంగీతము పుట్టాయి అనిశాస్త్రం చెపుతుంది అని పిల్లలకి చెబుతుంది.

సంగీతం చేసే మిరాకిల్స్ కొన్ని ఉన్నాయి. అమృత వర్ణిణి రాగంతో సంగీత యజ్ఞం ద్వారా యాట్టయపురంలో వర్షం కురిపించి పంటలు పండిచి క్షామం పోగొట్టాడు ఓ విద్వాంసుడు. నవ గ్రహ కీర్తనల ద్వారా రోగాలు పోగొట్టాడు

నవావరణ కీర్తన ద్వారా అమ్మవారి కృప పొందారు శ్రీ దీక్షితార్ వారు.

అదే విధంగా శ్రీ త్యాగయ్య తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెడితే సమయం అయ్యింది, అన్నప్పుడు గౌళి పంతు రాగంలో ‘తెర తీయర’ా అంటూ కృతి పాడగానే తెర తొలగి దర్శనమయ్యింది. తాన్‌సేన్ దీపాలు దీపక్ రాగం పాడి వెలిగించాడు – ఇలా ఎన్నో చెప్పేది.

సరస్వతి కచ్ఛపి వీణపై నాదం వల్లే బ్రహ్మ సృష్టి జరుగుతుంది. లకుమ వినాయకుని వీణ. మహతి నారదుని వీణ. సంగీతం వల్ల పంటలు పండుతాయని చెప్తుంది.

శ్రీ కృషుని మురళీ నాదం వల్ల గోవులు బాగా పాలు ఇచ్చేవి. గోపికలు ఎంతో తన్వయత్వం చెందేవారు. ఒక విదమైన ట్రాన్స్ లోకి వెళ్ళేవారు. ఇలా ఎన్నో విషయాలు అమృత పిల్లలకి పాఠంలో చెప్పేది.

నవ గ్రహాలకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. అమ్మవారికి నవావరణ కీర్తనలు ఉన్నాయి.

సా – షడ్జమము. నెమలి కూత నుంచి పుట్టినది. దీనికి అధిదేవత అగ్ని దేముడు. సహస్రార చక్రములో ఉంటుంది.

రి – రిషబము. ఇది ఎద్దు రంకె నుంచి పుట్టింది. దీనికి బ్రహ్మ అధిదేవత. అజ్ఞ చక్రములో ఉంటుంది.

గ – గాంధారం. ఏనుగు ఘీంకరము నుంచి పుట్టింది. సూర్యుడు అధిదేవత. విశుద్ధ చక్రము.

మ – మధ్యమము. మేక అరుపు నుంచి పుట్టింది. దీనికి సరస్వతి అధిదేవత. అనాహత్ చక్రము.

ప – పంచమం. కోకిల కూత నుంచి పుట్టింది. దీనికి విష్ణుమూర్తి అధిదేవత. మణిపూరక చక్రములో ఉంటుంది.

ద – దైవతం. క్రౌంచ పక్షి అరుపు నుంచి పుట్టింది. దీనికి ఈశ్వరుడు అధిదేవత. స్వాధిష్ఠాన చక్రములో ఉంటుంది

ని – నిషాదము. గుఱ్ఱం సకిలింపు నుంచి పుట్టింది. గణపతి అధిదేవత. ఇది మూలాధార చక్రంలో ఉంటుంది

ఆయా చక్రాలు దేవతలు వివరాలు ఇలా ఉంటాయి.

ఇదే విధంగా నవగ్రహాలు జ్యోతిషం ప్రకారం ఉంటాయి.

సూర్యుడు – తెల్ల జిల్లేడు

చంద్రుడు – మోదుగ

కుజుడు – చండ్ర చెట్టు

బుధుడు – ఉత్తరేణి

గురు గ్రహము – రావి చెట్టు

శుక్రుడు – మేడి చెట్టు

శని – శమీ లేక జమ్మి చెట్టు

రాహువు – గరి క

కేతువు – దర్భ

ఇలా ఆ వృక్షాలను పూజిస్తే మంచిది

యోగ, నవగ్రహాలు, సంగీతం, ఆధ్యాత్మికత – ఈ నాలుగు ఒకటే. గతంలో వాగ్గేయకారులు ఈ విధంగా కృషి చేశారు. ఇవి మనసుపై ప్రభావం కలిగి ఉంటాయి. అదే ఇక్కడ వివరిస్తున్నాను – అంటూ చెప్పింది అమృత.

***

పిల్లలంతా వెళ్ళిపోయాకా, అమృత సంగీతం గురించే ఆలోచిస్తోంది.

మరి మన యోగాలో చక్రాలకు ఈ అక్షరాలకు అవినాభావ సంబంధం ఉన్నది. ఇప్పుడు మ్యూజిక్ ద్వారా సంగీత వైద్యం వచ్చింది. దానికి హీలింగ్ పరికరం ఉన్నది. అది నాలుగు లక్షల వరకు ఉంటుంది. అరచేతిలో పెడితే మన శరీరం లోని భాగాల రోగాలు గ్రాఫ్ రూపంలో VIBGYOR గా వస్తాయి. సప్త వర్ణాలు అందులో ఉండి స్థాయి చూపిస్తుంది. ఈ వైద్యం కూడా ఖర్చు ఎక్కువే. అయితే డాక్టర్స్ వీటిని అంతగా ఒప్పుకోరు. కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. బిళ్ళ వెయ్యగానే రోగం తగ్గినట్లు కాదు. సమయం, సహనం, ఓర్పు, నేర్పు ఉండాలి. కష్టము కూడా.

అయితే, సంగీతం ఇలా ఇంత బాగా నేర్చుకునే వారు ఎవరు? ఏదో రెండు నెలలు నేర్చుకుని మా అమ్మాయి ప్రోగ్రామ్ ఇవ్వాలి, అవార్డ్స్ రావాలి అంటారు. జనరల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ కంటే సంగీతం కష్టము. ఐదు ఏళ్ళు లేక ఆరు ఏళ్ళు తప్పనిసరిగా నేర్చుకుని, మరల కచ్చేరి స్థాయి వేరే నేర్చుకోవాలి. అంతా తీరిక ఎవరికి? నేర్చిన వెంటనే క్లాప్ కొట్టలి, మెమెంటోలు కావాలి.

ఆ పాటకి ఆస్కార్ వచ్చిందంటే, ఎంత మంది – యాక్టర్స్, సంగీత, నృత్య, సాహితీ రచయితలు – కలిసి దర్శకుని ప్రతిభకు పట్టం కట్టారు. అది అంతా బాగా తెలుసుకోవాలి.

ప్రతి సంగీత కళాకారుడికీ తనకే ఆస్కార్ వచ్చినట్లు భావన. ప్రతి నృత్య కళాకారుడికి తనకే ఆస్కార్ వచ్చినట్లు భావన. ప్రతి దర్శకుడికి తనకే ఆస్కార్ వచ్చినట్లు బావన. ప్రతి నటుడికి తనకే ఆస్కార్ వచ్చినట్లు భావన.

ప్రతి భారతీయుడికీ తనకే ఆస్కార్ వచ్చినట్లు భావన. ఇది ఒక భ్రమ. ఈ భ్రమ మంచు దుప్పటిగా ప్రకృతి అంతా వ్యాపించింది. వేసవిలో కూడా మంచు దుప్పటి మంచు తెరలు వాతావరణంలో వ్యాపించాయి.

మామిడి పూత పిందెలు రాలి పోతాయి. మరో ప్రక్క అకాల వర్షాలు, ప్రకృతి మార్పులు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసి జీవన విధానంలో ఎన్నో మార్పులు చేర్పులు తెస్తున్నాయి.

మన దేశానికి ఆస్కార్ కోసం ఇంతవరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, నేడు ఆ మంచు దుప్పటి తొలగి కరిగి ఆస్కార్ వచ్చింది. అది మన అందరికీ అనందం అనే చెప్పాలి. ఇలా మనిషి జీవిత ప్రగతిలో దేశ ప్రగతి సమ్మిళితం చేసి ఎన్నో విజయాలు సాధించిన కీర్తి మన దేశ సొంతం. ఇది ఎందరో కృషి వల్ల సాధ్యం అని చెప్పాలి. ఏది వచ్చినా సినిమా వారి వల్లే మార్పులు వస్తాయి.

ఇప్పుడు పిల్లలు విదేశాలకి వెళ్ళడం ఇష్టపడడం లేదు. ఇండియా లోనే ఆ డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు.

***

అమృత తల్లి అనుకుంటోంది – దీనికి అన్ని సుఖాలు నేర్పాను. పెళ్లి అయితే ఎలా జీవిస్తుంది? అత్తగారు ఎలా ఉంటుంది ఏమో? అమృతలో కూడా విదేశీ మోజు వచ్చింది కానీ మనసు అంగీకరించలేదు. పెళ్లి చేసుకుని ఇక్కడ వ్యక్తిని అక్కడకు తీసుకెళ్లడం కష్టం. అంత కన్నా అక్కడి వాడు అయితే ఆ పద్ధతులు భరించడం కష్టం. కనుక జీవితం కోసం ఎక్కడ ఉన్నా మనీయే కావాలి కదా.

ఇప్పటి ఆడపిల్ల పట్టుమని నలుగురికి వండ లేదు. ఇంకా అత్త ఇంట్లో ఏమి చెయ్యగలదు? ఇక్కడ కనుక కంచంలో చెయ్యి పెట్టుకుని స్విగ్గీకి ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. వాడు తెచ్చే లోగా టివి చూస్తుంది. అలా అత్త ఇంట ఎలా కుదురుతుంది? దీనికి అన్నం తినిపించే మొగుడు కావాలి. వండే మొగుడు ఉంటాడు కానీ తినిపించే మొగుడిని ఎక్కడ నుంచి తేవాలి?

కాలం మార్పు, కలికాలం ఆడాళ్ళు ఉద్యోగాలు మొగాళ్ళు వంటలు అని నవ్వుకుంటుంది.

అదే తన కొడుకుని కోడలు అంటే ఊరుకుంటుందా? ఏ తల్లి అయినా సరే చెప్పండి.

ఆడబడుచులు మొగుడు పిల్లలు వస్తారు, పది కంచాలు లేస్తాయి. జోమోటో వాడికి ఫోన్ చేసి మంచి ఐటమ్స్ తెప్పిస్తా అంటే ఎలా?

అన్ని పంచదార చిలుకల కబుర్లే. అన్ని కరిగి పోయి శరీరంలో గ్లూకోజ్ మిగులుతుంది. చిన్న వయసు పర్వాలేదు పెద్ద వయసు అయితే కష్టము. మనిషికి మాటలు కాదు సాంత్వన కావాలి – అనుకుంది తల్లి.

***

వెంకట రమణ చెల్లికి అన్ని విదేశీ సంబంధాలు తేవడం, తల్లి తండ్రి వద్దు అనడం మామూలయిపోయింది. ఈ పెళ్లికి ఇండియాలో పుట్టాడా ఎవరైనా అంటే మేం ఉన్నాం అంటూ చిన్ననాటి మిత్రుడు – తన తమ్ముడు ఉన్నాడంటూ చెప్పాడు.

ఇంకనే, ఉన్న ఊళ్ళో కంప్యూటర్ బిజినేస్ క్లాసులు కోర్సులు అన్ని ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వెంకట రమణకి తెలిసింది, ఆ అబ్బాయి విదేశాల్లో ఉన్న ఇండియా వాళ్ళకి కోర్సులు చెపుతాడని.

ఈ తరంలో బ్రతకడానికి ఎన్నో రకాల ఉద్యోగాలు, వ్యాపకాలు ఉన్నాయి. అదే నేపథ్యంలో అమృత కూడా విదేశీ పాఠాలు చెపుతోంది. ఇద్దరికీ కుదురుతుందని భావించాడు.

అన్ని మంచు దుప్పటీ ఆలోచనలు, ఎప్పుడు ఎలా కరిగి పోతాయో తెలియదు.

మీరు ఎలాగూ కట్నం వద్దు అన్నారు, పెళ్లి ఘనంగా చేస్తాను అన్నాడు.

పెళ్లి అంటే అన్ని పెట్టీ దులుపుకోవడం కాదు. ఆ తరువాత జీవితం సజావుగా ఉన్నది లేనిది చూసుకోవాలి. విదేశాలకు పంపితే సరా. అక్కడి స్థితి ఎలా ఉన్నది చూడాలి కదా, ఇండియా అయితే పర్వాలేదు. ఇది కొందరు ఉద్దేశం కదా.

తల్లి తండ్రి మూలుగుతూ ముక్కుతూ ఒప్పుకున్నారు. “నీ పెళ్లి ఎలాగూ సింపుల్‌గా జరిగింది, చెల్లి పెళ్ళయినా ఘనంగా చెయ్యాలి” అన్నారు.

పిల్లాడు మంచి వాడు, మంచి వాడు అంటారు. కానీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? సంపాదన స్థితి, అందము, మాటతీరు – ఇవే చూస్తాం తప్ప – అతని లోపల ఏముంది అన్నదీ ఎవరికీ తెలియదు.

చాలామంది, ముందు అన్ని చక్కని నీతి కబుర్లు చెపుతారు, పెళ్లి తరువాత అసలు స్వరూపం బయటికి వస్తుంది.

సుభాషిణి మాదిరి అమృత జీవితం అవకూడదు అనే భావంతో అంతా ఉన్నారు.

విధి గొప్పది కదా, దాని ఇష్టము జీవితం.

ఇప్పుడు ఇన్ని లక్షలు పోసి పెళ్లి చెయ్యాలి, ఎక్కడి కక్కడ టిఫిన్ స్టాల్స్, ఐస్ క్రీమ్ స్టాల్స్ పెట్టించి, నచ్చిన టిఫిన్స్ ఏర్పాటు చేశారు. భోజనం కూడా గ్రాండ్‌గా నలబై రకాల ఏర్పాటు చేశారు. చాలా డబ్బు చెల్లిల్లి కోసం ఖర్చు పెట్టాడు రమణ. వెజిటబుల్ కార్వింగ్ డెకరేషన్, రౌండ్ టేబుల్ అమరిక ఉండాలి అన్నారు మగ పెళ్ళివారు. సరే అన్నారు, ఏదీ తప్పదు కదా.

ఆ పిల్ల పేర కొంత దాచినది ఆ పిల్లకి ఇచ్చారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా, ఘనమైన ఖర్చుతో పెళ్ళిళ్ళు చెయ్యాలి తప్పదు.

అమృత కచ్చేరి పెట్టారు. ఓ రెండు గంటలు పాడింది. ముఖ్యంగా అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు ఎక్కువ పాడింది. అవి అందరికీ తెలుస్తాయి కూడా.

***

అమృత భర్తతో ఎంతో సంతోషంగా ఉంది. తరువాతి కాలంలో కర్ణాటక సంగీతంలో ఎన్నో అవార్డ్స్ పొందింది. విదేశాలు వెళ్లి వచ్చింది.

మంచు దుప్పటి కరిగి మంచి భావాలు కలిగిన సంతృప్తి, ఆనందం అమృతలో.

(సమాప్తం)

Exit mobile version