సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    Guruprasad

    From J Guru Prasad
    Excellent narration by smt syamala garu about SPB and his beautiful Performance
    From J Guru Prasad

  2. 2

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    అమరపురికి ఏలిన అమర గాయకులు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి శ్యామల గారు రాసిన ఈ వ్యాసం మరోసారి అపర గంధ్వరుని జ్ఞాపకాలతో మదిని నింపేసింది.

  3. 3

    GNMURTY

    మహా గాయకుడు గానగంధర్బావుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వ్రాసిన వ్యాసం చాలా బాగుంది.అందుకోసం వాడుకున్న పాటలు కూడా సందర్భానుసారంగా ఉన్నాయి
    జాతి గర్వించ దగిన మహా గాయకుడు మీద ఇంత విపులంగా వ్రాయడం గొప్ప ప్రయత్నం
    రచయిత్రి కి అభినందనలు

  4. 4

    prabhakaramsivvam

    శ్యామలగారు బాలుగారిపై వ్రాసిన వ్యాసం బాగుంది. బాలూగారి వ్యక్తిత్వాన్ని విపులంగా వివరించిన శ్యామల మేడమ్ గారికి అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  5. 5

    Ramana Velamakakanni

    Very appropriate and timely patala nivali by Syamala garu. May his sacred and musical soul rest in peace.

  6. 6

    విరించి

    తిరిగిరాని లోకాలకేగిన గాన గంధర్వుడు బాలు కి శ్యామల గారి అక్షర నివాళి కంటతడి పెట్టించింది….ఆయన పాడిన పాటలలో ఆణిముత్యాలు ఏరి గుదిగుచ్చి అందించిన శ్యామలగారికి అభినందనలు.. ధన్యావాదాలు.

  7. 7

    Deepa

    The read immersed me in the world of SP songs and cherished his songs through Smt. Syamala’s writing. RIP SP.

  8. 8

    Mramalakshmi

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినమ్రత, సీనియర్ల పట్ల అపార భక్తి ,గౌరవాలు, సేవాభావం ,తెలుగు భాష పట్ల అపరిమిత ప్రేమాభిమానాలు ,యువతరానికి మార్గదర్శనం. అంటూ శ్యామల గారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి రాసిన రచన బాగుంది శ్యామల గారికి ధన్యవాదములు

  9. 9

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”దొరకునా ఇటువంటి పాట”హృదయాన్ని కదిలించింది.భారతీయ సంగీత ప్రపంచం విషాదంలో మునిగివున్న సమయంలో …సందర్భోచితంగా రాసిన ఈ వ్యాసం రస హృదయాలను చాలా మంచిగా ఆకట్టుకున్నది.భారతీయ సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం. గాయకుడిగా యస్ పి బి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేకపోయినా…..అందరికీ తెలిసిన ఆయన గొప్పతనాన్ని శ్రీమతి శ్యామల గారు వివరించిన తీరు అభినందనీయం.ప్రారంభ దశ నుండి ఆయన చివరిగా ఆలాపంచిన “మనిషిని నేను”కవిత వరకూ… యస్ పి బి గారి సమగ్ర జీవన చిత్రణను మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఆయన ఆలపించిన మధురమైన పాటలను….కన్నెవయసు,ఏకవీర, శంకరాభరణం…. ఒక్కటే విటి…. మధురానుభూతిని పంచే పాటలను మళ్లీ మనకు గుర్తుచేసి ఆ మహాగాయకుడికి మన అందరిచేత కన్నీటి నివాళులు సమర్పించే విధముగా రచనాశైలిని కొనసాగించారు.
    అందరికంటే ముందుగా స్పందించిన శ్రీమతి శ్యామల గారిని అభినందిస్తూ
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

  10. 10

    Syamala Dasika

    శ్యామల అందించిన “దొరుకునా ఇంటువంటి పాట” చదువుతుంటే ఓ కంటినుంచి కన్నీరు, ఓ కంటినుంచి ఆనందబాష్పాలు వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం గారి మరణవార్త విన్నప్పటినుంచీ మనసుమనసులో లేదు. ఎన్నో ఏళ్లకిందట బాలుగారు సుశీల గారితో కలిసి న్యూయార్క్ లో ఇచ్చిన కాన్సర్ట్, ఎప్పటికీ మరచిపోలేని శంకరాభరణం నైట్ .. అలాగే చిత్రగారితో కలిసి ఇచ్చిన అద్భుతమైన ప్రోగ్రాం….ఈ మధ్యనే అటెండ్ అయిన పాడుతా తీయగా ప్రోగ్రాం అన్నీ గుర్తుకొస్తున్నాయి. సినిమా పాట అంటే లల్లాయి పదాలే అని అనుకునే మనకు సినిమా పాట గొప్పతనాన్ని, సినిమా పాట పాడటానికి ఎంత శ్రమపడాలో,ఎంత ప్రతిభ ఉండాలో తెలియచేసిన వ్యక్తి బాలు గారు.
    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ- యు ఎస్ ఎ

  11. 11

    Bhramara

    ‘నరుడి బ్రతుకు నటన’ వంటి ఎమోషనల్ సాంగ్ తో ఆర్టికల్ ప్రారంభంలోనే హృదయాన్ని కదిలించింది. సినీ సంగీత ప్రపంచంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా ఎంతో ఒదిగిపోయి నవరసాలను తన గొంతులో అవలీలగా పలికించి సంగీతాభిమానుల గుండెల్లోకి పాటై ప్రవహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలూ గారికి శ్యామల గారి అక్షర సుమాంజలి ఎంతో సముచితంగా ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విలువైన, అపురూపమైన సంగతులను సేకరించి వాటికి తగిన పాటలను జతకలిపి ఎంతో హార్ట్ టచింగ్ ఆర్టికల్ ను పాఠకులకు అందించిన శ్యామలగారికి అనేక ధన్యవాదాలు 🙏🙏 …బాలూగారు ఆలపించిన అనేక అద్భుత మధురగీతాలను గుర్తుచేసి కంటతడి పెట్టించేశారు బాలూగారి గురించి ఎంతో లోతుగా అధ్యయనం చేసి దాదాపు ప్రతి కోణాన్ని స్పృశించి ( అదీ ఇంత తక్కువ సమయంలో ) పాఠకులతో పంచుకున్న శ్యామలగారి అసాధారణ రచనాప్రతిభకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 🙏🙏🙏 ( రచయిత్రి గారు అన్నట్లు బాలూగారు నిజంగా అమరగాయకులు. అందుకే ఆయన పాటకూ మరణం లేదు..)

  12. 12

    Gauthami

    శ్యామలగారూ … ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి అన్నచోట కలవరము మొదలైంది. మాట, పాటా ఆపి పనుందంటూ పరలోకాలకేగారు ఎండుకు ? అని ప్రశ్నిచినప్పుడు నా గుండె నాకు భారమైపోయింది మోయలేనంత, మీ వ్రాసేటప్పుడు మీ హృదయభారాన్ని చదువుతుండగా నేను అనుభవించాను.

    ఈ భూమి మీద కళ్ళుతెరిచి, నాకు ఊహ వచ్చిందగ్గిరనుండీ ఇప్పటివరకూ ఆయనపాటలతోనే పెరిగాను. ఆయన పోయారనగానే నాలో ఒకస్తబ్దత ఆవరించింది. ఆ స్తబ్క స్తబ్దతనుండి ఒకే ఒక్క గానము నన్ను చాలాసేపు వెంటాడింది అది “ఏ దివిలో విరిసిన పారిజాతమో “. చాలాసార్లు ఆ పాట పాడుతూ ఆయన వీడియోలు చూసాను ఆయన్ని వెతుకుతున్నట్లుగా. తర్వాత “శివరంజనీ నవరాగిణి ” , ఆ సినిమాలో హీరో ఆమెకు తన ప్రేమను తెలియపరుస్తుండవచ్చు, కాని బాలుగారు తనపాటలో నాకు సాక్ష్యాత్తు దేవీని నాకళ్ళకు సాక్ష్యాత్కరింపజేసారు. ఆఖరుగా ఆయన సందేశాత్మక పాట మళ్ళీ చూసి, విని మెల్లగా లేచి మళ్ళీ పనిలోపడ్డాను , అయినా మూడురోజులపాటు కలతపోలేదు.

    చాలా చక్కటి పాటలు ఎంపిక చేసారు. ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!