Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన ప్రేమ

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘మన ప్రేమ’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రియా..!
వికసించే పువ్వులనడిగా
నీ నవ్వులు నాకే కావాలని

ప్రసరించే కిరణాలనడిగా
నీ దర్శన భాగ్యం కలగాలని

ప్రవహించే సెలయేరునడిగా
నీ ప్రేమని నేనే పొందాలని

రవళించే మువ్వలనడిగా
నీ పాదానికి పారాణి కావాలని

కురిసే పున్నమి వెన్నెలనడిగా
నీ చల్లని చూపు నాపై ఉండాలని

మెరిసే గగనపు తారలనడిగా
నీ మదిలో స్థానం పొందాలని

వీచే పిల్ల తెమ్మెరనడిగా
నీ స్మృతిలో నిత్యం నేనుండాలని

కదిలే కాలాన్ని అడిగా
కలకాలం మనం కలిసుండాలని

Exit mobile version