Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మల్లెతీగ కథలు, కవితల పోటీ ప్రకటన

న్టీఆర్ జిల్లా యంత్రాంగం – ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ సౌజన్యంతో, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో కథలు, కవితల పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి సమకాలీన సామాజిక సమస్యల్ని, ప్రశార్థకమౌతున్న మానవతా విలువల్ని స్పృశిస్తూ, తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే భిన్నమైన కథల్ని, కవితల్ని ఆహ్వానిస్తున్నాం. తెలుగు కవులు, రచయితలందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.

కథలు, కవితలు డీటీపీ చేసి గానీ, యూనికోడ్ ఫాంట్ లో గాని పంపాలి. రాత ప్రతులు పరిశీలించబడవు. కథలు 3 నుండి 5 పేజీలకు, కవితలు నలభై లైన్లకు మించకూడదు. ఉత్తమ కథకు రూ.5,000/- ల చొప్పున 8 ఉత్తమ కథలు, రూ. 1,000/-ల చొప్పున 10 కన్సొలేషన్ కథలను, ఉత్తమ కవితకు రూ.2,500/-ల చొప్పున 8 ఉత్తమ కవితలు, రూ.500/- ల చొప్పున 10 కన్సొలేషన్ కవితలను ఎంపిక చేస్తారు. కథలు, కవితలు అక్టోబరు 15వ తేదీలోగా

malleteega.sss@gmail.com ఈమెయిల్ కు అందాలి. ఎంపికైన కవులు, కథకులకు నవంబరు 22, 23 తేదీలలో విజయవాడలో జరిగే ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాల’లో నగదు బహుమతులతోపాటు సత్కారం వుంటుంది. సంప్రదింపులకు – 92464 15150.

కలిమిశ్రీ
మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ అధ్యక్షులు

Exit mobile version