సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అహల్య. నాకు నచ్చిన పాత్ర. నిండుకుండలా తొణకక బెణకక, తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ పోతుంది. ఆమె కూడా ” ఒక వీణ తీగ తెగింది. దాన్ని అతుకుపెట్టలేము” అనుకున్నదానికంటే – మనసు ఎంత గాయపడి ఉండాలి! ఇందిర, తన భర్త మధ్య సాన్నిహిత్యం తెలిసినా, అతను ఇంటికి రాగానే స్నానం, టిఫిన్ వంటివి అమర్చి “ప్రశాంతంగా” నిద్రపోమని చెప్పిందంటే – ఆ సంసారం నావకు ఆమే చుక్కాని అని తెలుస్తోంది.
    పాదచారి, మహతి ( రచయితవే) కవితలు చాలా సందర్భానుకూలతతో, అర్థవంతంగా ఉన్నాయి. మహతి, గౌతమ్, ఇందిర, అహల్య‌లతో పాటు పాఠకుడి మనసూ భారమవుతుంది ఈ ఎపిసోడ్ చదివిన తర్వాత.

    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు నమస్కారం. చక్కగా చదివి చక్కని స్పందన తెలిపిన మీకు నాహృదయపూర్వక ధన్యవాదాలు.
      కవితలు నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు.. చాలా సంతోషం కలిగింది థాంక్యూ సో మచ్

  2. 2

    యామిని

    గురువర్యా ప్రతీ పాత్రనూ మలిచిన తీరు చాలా బావుంది. ఇందిర గారి మనోస్థితి, గౌతమ్ గారి ప్రవర్తన అహల్య గారు బాధ్యతాయుతమైన గృహిణి దర్మం నిర్వహించడం ఆవిడ మనోగతం.. అన్నీ మీరు మలచిన తీరు చాలా బావుంది.
    మహతి పేరుతో మీరు వ్రాసిన ప్రతీ కవితా చాలా చాలా బావుంది.
    మహతి తాతగారు ఇందిర గారిని స్వాగతించడం ఆవిడ కోలుకునే అవకాశం అక్కడే ఉంది అనిపించింది. మహతి చేసే ఆక్టివిటీస్ అన్నీ ఆమెక్కూడా నచ్చుతాయేమో.. ఆ బాధ్యతల్లో తాను కూడా అన్నీ మరచి హాయిగా ఉంటే బావుండు కదా అన్న ఊహ వచ్చింది.

    1. 2.1

      BhuvanaChandra

      యామీజీ… చక్కగా మీ అభిప్రాయం తెలిపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారం వారం మీరు నాకు ఇస్తున్న ప్రోత్సాహం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ప్రతి పాత్ర వెనక మీరు ఎంతో జాగ్రత్తగా వ్రాసిన మీ ఆలోచన అద్భుతం. ఎంతో జాగ్రత్త గా నడిపిస్తున్న మీరు కనిపిస్తున్నారు. ఆడ వాళ్ల ఆలోచన మగవాళ్ల ప్రవర్తన తీరు కాదన లేని విధంగా వ్రాసారు. కవితలు హృదయాన్ని తాకుతున్నాయి. జీవితం లో కలిగే పరిచయాలు ఎలావుంటాయి బాగా వ్రాసారు. మనిషి ఆలోచన లే మనిషిని నడిపిస్తాయి కాని మనం కాలం మీదకు నెట్టుతాము. ఆశలు, పాశాలు అనే గుంజకు మనమే కట్టు బడి ఎవరి మీదకో నెట్టుతూ ఎవరైనా వచ్చి విడిపిస్తారేమో అని చూస్తూ పరాన్న జీవులు గా ఎదురు చూస్తూ వుంటాము.-ధన్యవాదములు -రోహిణి

    1. 3.1

      BhuvanaChandra

      రోహిణి గారు నమస్కారం. చాలా చక్కగా మీ స్పందనని తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి వారం వారం చదివి మీ అభిప్రాయాన్ని తెలపటం వల్ల నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *భువన చంద్ర గారూ నమస్కారం అండీ.
    ఈ సంచికలో పాదచారి కవిత, మహి వ్రాసిన కవితలు – కవితలుగా కాక వాస్తవాలుగా స్పురించాయి.
    మీ భావనా శక్తి హృదయాన్ని తాకేలా చేస్తుంది.
    మౌనం వెనక మనసు ఎప్పుడూ ఉంటుంది అనిపిస్తుంది నిజంగా.
    మాట మనసు మౌనంగా ఉండటం అన్నది కష్టం.
    స్వేచ్ఛ విషయం లో మీరు చెప్పిన సూత్రం అక్షరాలా నిజం. చాలా సత్యం కూడా. పెళ్ళి అనేది మనిషి జీవితంలో ముఖ్యమే, స్వేచ్ఛ స్వాతంత్య్రం లేకపోతే
    ప్రశాంతత ఉండదు. ఎదుగుదల ఉండదు.
    ప్రతిదానికీ లిమిట్స్ ఉంటాయి, ఉండాలి.
    అవి ఎవరికివారు నిబద్ధతతో ఉంటే బాగుంటుందని చాలా బాగా చెప్పారు.
    పెద్దవారైనా తాతగారి ఆలోచన రీతిని మోడల్‍గా చూపించారు.
    మహి ఆలోచనా సరళిని చాలా సహజంగా చూపించారు.
    సహజంగా పాత్రల్లో పోషణ అద్భుతం.
    చాలా బాగుంది అభివందనాలు నమస్కారం.
    ఇందిర మనసుని చదవకలగి నడుచుకునే మహి ప్రవర్తన చాలా అభినందనీయం.
    ఇందిర పాత్రలోఒదిగి ఆలోచిస్తే మనిషికి సహజంగా ఆలోచనా సరళి పరిస్థితుల అవగాహనతో పాటు నడుచుకునే మార్పు కూడా సహజంగా మారుతుంది అనిపించింది. – రమాదేవి *

    1. 4.1

      BhuvanaChandra

      రమాదేవి గారు నమస్కారం. మీ చక్కని విశ్లేషణ ని చూసి చాలా ఆనందించాను వారంభారం ఈ సీరియల్ చదువుతూ విశ్లేషిస్తూ మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  5. 5

    Sobharaja

    🙏
    ఈ సంచికలో ప్రతీ పాత్ర character ని ఒకరికి మించి మరొకర్ని తీర్చిదిద్దారు. ఒకరికి ఇంకొకరు తీసి పోనంతగా మలిచారు
    వీటికి తోడు అత్యద్భుతమైన కవితలతో వన్నె తెచ్చి అలరించారు. అందరూ ఎవరికి వారు వారి జీవితాలతో రాజీపడతారు. కానీ ఇందిర జీవితంతో ఎలా సర్దుకు పోగలదో ఊహకందడం లేదు. ఇందిర గురించి ఆలోచిస్తే తెలియని బాధ కలుగుతోంది. ఆవిడకు మీరేమి న్యాయం చేస్తారో చూడాలి.
    ధన్యవాదాలు 🙏🌹🙏

  6. 6

    rama sundari

    మహిత రాసుకున్న కాల మహిమని తెలియజేసే ‘పాశాలు విసిరేదీ నువ్వే’ కవిత, ‘చీకటి ప్రకాశాన్నీ’, ‘ప్రకాశం చీకటినీ’ ప్రసవించడమనే కవిత, ఎంతో దార్శనిక దృక్పథంతో చెప్పిన భావన. గొప్ప భావనల్ని మనసులో నింపుకున్నపుడు ఆ దివ్య ప్రకాశం ప్రసరించే కిరణాలతో లోకాన్ని దర్శించినపుడు మనసు హాయిగా ఉంటుంది. ప్రతి పాత్ర నుంచీ కొన్ని దివ్య సూత్రాల్ని ఇలా అందించడం ఎంతో సంతోషం….చండి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!