సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహతి సీరియల్ లో అహల్య ఒక చక్కని పాత్ర. కొంతమంది అంతే. వాళ్ళ ప్రాధాన్యత ప్రస్పుటంగా కనిపించక పోయినా వాళ్ళ ఉనికి అంతర్లీనంగా అంతటా ప్రవహించివుంటుంది. ఒక మంచి కూతురు గా, భార్య గా, తల్లి గా అహల్య గంభీరంగా, గుంభనంగా అంతటా విస్తరించివుంది. ఆనందం గా సాగిపోయే తమ జీవితం లోకి ఇందిర ప్రవేశించడం ఒక పెద్ద కుదుపు అయినప్పటికీ చాలా వరకు స్ధిర చిత్తం తోనే ప్రవర్తించింది. ఇక సహించలేని పరిస్థితి లో, తండ్రిని చూసుకోవాల్సిన అవసరంలో బయలుదేరక తప్పలేదు. ఆమె ఆలోచనల్లో నిజాయితీ ఉంది, పరమార్థం ఉంది, పరిణతి ఉంది. నిదానంగా, నిరాడంబరంగా, వీలైనంత మౌనంగా ఉండే “అహల్య” లాంటి ఔన్నత్యాన్ని తెలిపే స్త్రీ పాత్రను తీర్చిదిద్దుతున్న భువన చంద్ర గారికి అభినందనలు.

    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు ధన్యవాదాలు మీ స్పందన అద్భుతంగా ఉంది చదివాక నాకు చాలా చాలా ఆనందం కలిగింది మీకు ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. అహల్య పాత్ర ఎంతో గంబీరమైనది హుందా కలది. అలాంటి ఆడవాళ్ళ మూలంగానే ఈ కుటుంబ వ్యవస్థ ఇంకా ఉంది. అహల్య తీసుకున్న నిర్ణయం మన్నన చేసుకోవటానికి రుక్మిణి పాత్ర సూపర్. రుక్మిణి లాంటి పిచ్చి తల్లులే మన భారత దేశంలో ఎక్కువ. ఇప్పుడు అమ్మలు కూడా మారిపోయారు. ఒకప్పుడు మగవాళ్లే సంపాదన కోసం బయటకు వెళ్లే వారు ఆడవాళ్లు ఇంట్లో ఉండి మగవారికిఅడుగులకు మడుగులు వత్త డం ఇంటెడు చాకిరీ చేయడం అలవాటుగా, భాద్యత గా మారిపోయింది. ఈ రోజు ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు కాని మగవాళ్ళు ఇంటి పనులు చేయరు పిల్లలని చేసుకోరు. ఇంటి పనులు చేయటం నామోషీ అనుకునే మగ వాళ్ళు చాలానే వున్నారు. అన్నీ చేయించుకొని అలవాటు తప్పింది అని వాపోయే మగవాళ్ళు వున్నారు. ధన్యవాదములు -రోహిణి

    1. 2.1

      BhuvanaChandra

      రోహిణి గారు నమస్కారం చాలా చాలా చక్కగా మీ స్పందనని తెలియజేశారు చక్కగా చదివి విశ్లేషించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ సో మచ్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్తే భువన చంద్ర గారూ.
    ముందుగా గురుపూర్ణిమ శుభాకాంక్షలు మీకు. ఒక గురువుగా జీవనమార్గాలని తెలియచెప్పే మీ ఆత్మతత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    నీడ లేకుండా నేను లేను, నాకు చాలా బాగుంది అభివందనాలు. ఇది నిజం.ఈ నిజం గురించి వాస్తవాలు ఆలోచన చేయకలిగితే జీలితం ఒంటరిగా అనిపించదు.
    పాదచారి అన్నమాట వాస్తవం.
    మీ రచనల్లో వాస్తవాన్ని ఆ లోతులను ఆలోచించేలా ఉంటుంది.
    మనిషి మనసు ప్రగాఢ నిద్రలో మాత్రమే తనని తాను మరువగలడు. అది మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం. మీరు వ్రాసిన కధా పరమైన పాత్ర పోషణ అద్భుతం మరోవైపు మనసుతో మనిషి తీరు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది నాకు.
    అహల్యే కాదు ప్రతి స్త్రీకి కూడా స్పష్టంగా విడమర్చి ఆలోచించే రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. స్త్రీ కి అపరమిత స్వార్థం ఎక్కువ శాతం.
    తనకే ప్రాధాన్యత సంతరించుకుంది తనపై అందరూ ఆధారపడి తనకే ప్రాధాన్యత ఇస్తారు అని ఆశిస్తుంది. ఇది నిజం.చాలా చక్కగా విశ్లేషించారు.
    అహల్య చాలా సహజమైన స్త్రీ మనసు. పరిస్థితి అర్థం చేసుకుని నడుచుకుని మనసుని సముచితంగా సమతుల్యంగా తీసుకుని తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే స్త్రీ గా అనిపించింది.
    చాలా బాగుంది అభివందనాలు చాలా సహజంగా ఉంది. రుక్మిణి పాత్రలు కోకొల్లలు సమాజంలో.
    ఇది సహజం. స్త్రీ మనసు భావాల పుట్ట.
    ధన్యవాదాలు అండీ
    రమాదేవి

    1. 3.1

      BhuvanaChandra

      చాలా చాలా ధన్యవాదాలు రమాదేవి గారు చాలా లోతుగా చదివి విశ్లేషించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందుకోండి

  4. 4

    Sobharaja

    🙏
    జీవితం గురించి చాలా చక్కగావివరించారు. ఎవరికి వారే యమునాతీరే అనడం వాస్తవం. ఎవరి బాధ్యతలు సమస్యలు వారివే. చివరికి మిగిలేది ,కాటికి వెళ్శేది మనం మాత్రమే.
    అహల్య మనసులో సంఘర్షణ బాగుంది.
    పిల్లలు నాన్న గారు బాధ్యత అని బయలుదేరడం బాగుంది. వీళ్ళందరికీ కావలసింది వేళకు భోజనం.
    కానీ కార్యేషు దాసీ కరణేషు మంత్రి……అని ప్రమాణం చేసి కొన్ని సంవత్సరాలు భర్తతో అన్యోన్యంగా అనుకూలవతిగా కష్టసుఖాల్లో పాలు పంచు కున్నారు. ఇప్పుడు ఇందిర అకస్మాత్తుగా వచ్చి కలవరంలేపింది. ఆ పరిస్థితుల్లో భర్తఎంతటి క్షోభకు గురవుతూ ఎంతలా సతమతమవుతున్నాడో ఒక్క నిముషమైనా ఆలోచించిందా? అతనికి ప్రక్క బలంగా ఉండి ఇద్దరూ కలిసి సమస్యను సమయోచితంగా ఆలోచించి పరిష్కరించడం అహల్య బాధ్యత. చివరి క్షణం వరకూ తోడునీడగా ఉండేది భార్యకు భర్త భర్తకు భార్యే. . ఇంకెవ్వరూ రారు. నీ సమస్య నువ్వే పరిష్కరించారో అని గాలికి వదిలెయ్యడం ఆయన మానసిక సంఘర్షణ నుంచి ఆయన్ను బయటికి తీసుకు రాకుండా బాధ్యతనుంచి పారిపోవడం మంచి భార్య లక్షణం కాదు.
    తప్పయితే క్షమించండి.
    ధన్యవాదాలు🙏🌹🙏

    1. 4.1

      BhuvanaChandra

      శోభ గారు చాలా చక్కగా చదివారు చాలా లోతుగా మీ స్పందనని అందించారు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి స్పందనలే రచయితకి ఆరో ప్రాణం లాంటివి మరోసారి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలుతో భువనచంద్ర

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!