సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. సౌత్ ఇండియన్ వంటకాలు, మరిచే పోయిన కాంబినేషన్స్ నోరు ఊరించేలా వ్రాసారు. తిన్నంత తృప్తి ఆనందంకలిగింది. దీనితో పాటు అద్భుతమైన కొటేషన్ బాగుంది “సంగీతందగ్గర దేవ భాష సాహిత్యం మానవుడి హృదయ ఘోష “💐. ఫాలాక్షుని కారక్టర్ బాగా వస్తోంది. ధన్యవాదాలు 👏- రోహిణి

    1. 1.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు రోహిణి గారు మీ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదాలు

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    నమస్తే అండీ. ఈ సంచికలో మీ రూపొందించిన ప్రజ్ఞ చాలా బాగుంది, అభివందనాలు.
    మీకు వంటకాలు, రుచులపై ఉన్న అభిరుచికి నా అభివందనాలు. ప్రేమ, అభిమానంపై మీరు చూపిన విధం చదువుతుంటేనే ఎంతో అందమైన శాంతి సంతోషాలు కలిగాయి.
    వాస్తవానికి ఈనాటి మనుషుల జీవితవిధానంలో భగవంతుడు తోడు ఉన్నట్లే కదా. మన విషయాలు మరచి తోటివారి జీవితంలో విషయంలో ఆరాటం. ఉతికి ఆరేసే వారే చాలా ఎక్కువ. మనలో ఈ ఆసక్తి తగ్గిపోతే చాలా సమస్యలు చాలా వరకు ఉండవు.
    పాత్ర పోషణ అద్భుతం అనిపించింది. నటనలో జీవించినప్పుడే రాణిస్తుంది. జీవితం విలువలకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ వ్రాసిన ప్రతి అంశం అమృతం.
    చాలా బాగుంది అభివందనాలు.
    రమాదేవి

    1. 2.1

      Bhuvana Chandra

      రమాదేవి గారు నెల స్పందన తెలుపుతున్న మీ అభిమానించి హృదయపూర్వక ధన్యవాదాలు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శోభరాజా గారి వ్యాఖ్య*
    🙏 సంగీతం దేవుడి భాష అయితే సాహిత్యం దేవుడి హృదయ ఘోష అని కవిగా మీ స్పందన తెలియచేసారు.
    మన అనుకునేవాళ్ళకు దూరమైనప్పుడు దేవుడు ఎవరో ఒకర్ని తోడుగా పంపిస్తాడు లేకపోతే ప్రేమరాహిత్యంతో జీవితం ఎడారిగా మారిపోతుంది. అక్షరాలా నిజం.
    మీ నవల చదువుతుంటే మీరు భోజన ప్రియులనిపిస్తోంది. గత సంచికలో టీ ఎలా
    చెయ్యాలో చెప్పి టీ తాగని నాలో టీ తాగాలనే కోరిక కలిగించారు. ఇకపోతే ఈ సంచికలో పూరీతో combinations, ఉప్మా, పొంగల్, సాంబార్ వడలతో నోరూరింపజేసారు. మీరు సకల కళా వల్లభుడు. 🙏
    శోభరాజా

    1. 3.1

      Bhuvana Chandra

      థాంక్యూ సో మచ్ శోభ గారు… అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అందుకే అప్పుడప్పుడు ఆధరువుల గురించి రుచుల గురించి సరదాగా రాస్తూ ఉంటా మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం

  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    భువన్ జీ!
    గత వారం, ఈవారం ‘మహతి’ ఇప్పుడే చదివాను. అల ఒక పరిపూర్ణ నటిగా పరిణామం చెందే క్రమాన్ని చక్కగా వివరిస్తున్నారు.
    “సంగీతం దేవుడి భాష అయితే సాహిత్యం మానవుడి హృదయఘోష” అద్భుతమైన కొటేషన్. ఆ ఘోష నుండే ఆదికావ్యం ఉద్భవించింది కదా. నేటికీ వివిధ ప్రక్రియల్లో మనిషి ఘోషే వినిపిస్తోంది – ఆనందంతో కానీ, దుఃఖం తో కానీ. “చలి రాత్రిళ్ళ లో, ఒంటరి పగళ్ళ లో సాహిత్యమే నాకు తోడు” అన్న ఫాలాక్ష మాట చాలమందికి వర్తిస్తుంది. నిజానికి
    పుస్తకానికి మించిన తోడు ఈ లోకంలో మరేముంటుంది! ఆలోచనామృతం కదా. పుస్తకం పూర్తయినా ఆ భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు నిరంతరం వెన్నంటే ఉంటాయి. సన్నిహిత నేస్తం లా, తోడుగా నిలుస్తుంది, ముందుకు నడిపిస్తుంది పుస్తకం. అందుకే కొందరు కవులు, రచయితలు చిరస్థాయిగా నిలిచిపోయారు పాఠకుల మనసుల్లో.
    (కాఫీ, టీ గత ప్రాణిని నేను. గతవారం అద్భుతమైన టి తయారీ విధానం నేను నోట్ చేసుకున్నాను. ఈ పూరీ మీద జామ్ బట్టర్ దట్టించి తినే మజా నాకు తెలుసు.)
    చూడామణి పాత్ర ‘సార్ధక’ నామధేయురాలు.

    1. 4.1

      Bhuvana Chandra

      సుశీల గారు హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కగా చదివి చాలా చక్కగా ఆలోచించి అద్భుతమైనటువంటి స్పందన వారం వారం తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
      ఇలాంటి స్పందన వల్లనే ఇంకా ఇంకా రాయాలి ఇంకా చక్కగా రాయాలి అనే కోరిక బలపడుతుంది
      ఒక రచయిత్రి గా మీరు అందిస్తున్న స్పందన చాలా చాలా చాలా స్ఫూర్తినిస్తుంది మరోసారి ధన్యవాదాలు నమస్సులు ఇట్లు భువనచంద్ర

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!