సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మానవ జీవితంలో చాలా క్లిష్టమైన దశ ‘అడాల్సెంట్ వయసు’ యువతను కథాంశం గా తీ‌సుకొన్నారు భువన్ జీ. “యవ్వనపు శోభ వళ్ళంతా విస్తరిస్తున్న” ఆ సమయంలో వాళ్ళ కెన్నో ఊహలు, ఆలోచనలు, అనుమానాలు. వాళ్ళొక అయోమయస్థితి లో ఉంటారు. తల్లిదండ్రులు ఏదైనా చెప్పబోయినా మా కంతా తెలుసులే అనే భావన లో ఉంటారు. ఈ ఇంటర్మీడియట్ దశ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకూ ఓ పరీక్షా సమయం. “మహతి” లాంటి అమ్మాయి తల్లిదండ్రుల చక్కని పెంపకంలో పెరిగింది కాబట్టి “సంయమనం” తో ప్రవర్తిస్తోంది.
    “సుగంధ అగరబత్తీలు, దుర్గంధ అగరబత్తీలు” తో ఎలా సాగిపోతుందో చూడాలి.
    టెన్త్ పాసయి, ఇంటర్ లో అడుగు పెట్టిన పిల్లల మధ్య “కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ, ప్రేమబాసలు, ఊసులు” చెప్పకుండా, వారి సహజ మనస్తత్వాన్ని వర్ణిస్తున్న భువన్ జీ కి అభినందనలు.

  2. 2

    Bhuvana Chandra

    హృదయపూర్వక ధన్యవాదాలు సుశీలమ్మ గారు థాంక్యూ సో మచ్ చక్కగా సమీక్షించి నాకు మరింత స్ఫూర్తినిచ్చారు థాంక్యూ

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    మహతి నవలపై స్పందనగా, డాక్టర్ ఎస్ ఎస్ కవితారూపంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.
    ***
    ముందుకథనము చెప్పకుండా
    ఆడమనడం భావ్యమేనా!?
    విప్పలేవా కథాగమనం
    ఇందుశేఖర న్యాయమేనా!?
    ~
    పాత్రధారుల పరిచయాలను
    చేస్తుతీసే వింతచేష్టలు
    బ్రతుకుబంధం మధ్యలోనే
    తుంచి వేయడం మోక్షమేనా!?
    ~
    మాయకప్పీ నాదినాదను
    ఆశపెంచే వేడుకేమిటి?
    అహము నేనను ఇహములేదుగ
    చిద్విలాసా  హాస్యమేనా!?
    ~
    జీవ జ్యోతికి వేడినీవే 
    మోక్ష మిచ్చే దిక్కునీవే
    వెలుగచేసీ తరుగచేసీ 
    వత్తిమాడ్చుట ధర్మమేనా 
    ~
    పేరు తుడిచీ చితినిపేర్చీ 
    కాల్చమనడం చిలిపిఆటలు
    దేవి రోధన కాన లేవా
    మరణమంటే శిథిలమేనా 
    Dr. S S

  4. 4

    యామిని

    ఇప్పటి రోజుల్లో కాలేజ్ పిల్లలే కాదు స్కూల్ పిల్లల ఆలోచనా విధానలు న్యూస్ లో వినడం చదవడం కూడా భయంకరంగా ఉంటున్నాయ్, తల్లితండ్రులముందు ఒకలా బయట మరోలా నడుచుకునే యువత శాతం పెరిగింది
    చూసేవారికి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ శాతం యువత ఈ కాలంలో అలా తయారయింది.
    మహతి లాంటి మెచ్యుర్డ్త్ పాత్ర చాలా చాలా బావుంది👌
    ఈ కాలం యువత ఇలాంటి రచనలు చదవడం చాలా అవసరం. ఆమె వెనుక తల్లితండ్రుల సంస్కారం తెలుస్తుంది.
    మంచి రచన మాకు అందించారు మీకు ధన్యవాదాలు గురువర్యా🙏🏻

  5. 5

    చండి

    మహతి డేషింగ్ నేచర్ మరింతగా ఎస్టాబ్లిష్ అయింది. ఒక పాత్రలోని సుగుణాల్ని మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాం. ఇళ్లల్లో పెద్దవాళ్ల సంగతి మామూలే. ఇంటి పేర్లతో కులాల్ని ఎంక్వైరీ చేసే నేచర్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!